మళ్ళీ కలెక్షన్లతో నిలబడ్డ అల్లరోడు

మొదటి మూడు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 4.40 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి డీసెంట్ వీకెండ్ నంబర్లను నమోదు చేసింది.

Update: 2026-09-07 09:43 GMT

ఈమధ్య సీరియస్ రోల్స్, ఇంటెన్స్ డ్రామాలు చేస్తూ వచ్చిన అల్లరి నరేష్.. మళ్లీ తన సొంత ట్రాక్ అయిన ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైన్‌మెంట్ వైపు అడుగులేశారు. ఆడియన్స్ కూడా ఆయన నుంచి ఎక్కువగా ఆశించేది వింటేజ్ కామెడీ టైమింగే కావడంతో లేటెస్ట్ మూవీ 'రంభ ఊర్వశి మేనక'పై రిలీజ్ ముందే క్రేజ్ ఏర్పడింది. ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో అవుట్ అండ్ అవుట్ కామెడీ ట్రాక్ లో ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది.

మొదటి రోజు మార్నింగ్ షోస్ పడగానే కొన్ని చోట్ల మిక్స్‌డ్ టాక్ వినిపించినప్పటికీ, సినిమాలోని ఫన్ ఎలిమెంట్స్ కుర్రాళ్లతో పాటు ఫ్యామిలీస్ కి కనెక్ట్ అవ్వడం మొదలైంది. రొటీన్ కమర్షియల్ మాస్ సినిమాల మధ్య కాసేపు రిలాక్స్ అయి హాయిగా నవ్వుకునే స్పేస్ దొరకడంతో నెమ్మదిగా మౌత్ టాక్ బలపడింది. ముఖ్యంగా శనివారం, ఆదివారం నాటికి బీ, సీ సెంటర్లలో కూడా ఈవెనింగ్ షోలకు ఆక్యుపెన్సీలు మెరుగవుతూ వచ్చాయి.

ఈ పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ బాక్సాఫీస్ కలెక్షన్లలో కనిపిస్తోంది. మొదటి మూడు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 4.40 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి డీసెంట్ వీకెండ్ నంబర్లను నమోదు చేసింది. మిక్స్‌డ్ టాక్ ప్రభావం కొంత ఉన్నప్పటికీ ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం మామూలు విషయం కాదు. అల్లరి నరేష్ టైమింగ్‌కి, కామెడీ జానర్‌కు ఇంకా ఆ క్రేజ్ తగ్గలేదని చెప్పవచ్చు.

సినిమాలో స్వర్గలోకం నేపథ్యం, రంభ, ఊర్వశి, మేనకలుగా కనిపించిన నటీమణులతో నరేష్ చేసిన కామెడీ ట్రాక్స్ కూడా హైలెట్ అయ్యాయి. లాజిక్కులు వెతక్కుండా కేవలం ఎంటర్‌టైన్‌మెంట్‌ను మాత్రమే ఎంజాయ్ చేసే ఆడియన్స్‌కు ఈ కంటెంట్ బాగా రీచ్ అయింది. చైతన్ భరద్వాజ్ అందించిన మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆ ఫన్ మూడ్‌ను నిలబెట్టడంలో సాయపడ్డాయి.

కథ పరంగా కన్ఫ్యూజన్ ఏమి లేదు, రన్‌టైమ్ తక్కువగా ఉండటం, నరేష్ తన మార్క్ కామెడీతో నెట్టుకురావడం సినిమాకు కలిసొచ్చింది. దర్శకుడు చంద్రమోహన్ నరేష్ కు తగ్గ ఫన్ ను క్రియేట్ చేశాడు, హాస్య మూవీస్ నిర్మాణ విలువలు సినిమా స్కేల్‌కు సరిపోయేలా ఉన్నాయి. పెద్దగా హంగులకు పోకుండా కేవలం ఫన్ ట్రాక్స్‌పైనే ఫోకస్ పెట్టడంతో బాక్సాఫీస్ వద్ద వీకెండ్ వరకు ఒక మోస్తరుగా నిలబడగలిగింది. అయితే చిత్రానికి అసలైన ఛాలెంజ్ సోమవారం నుంచే మొదలవుతోంది. వీకెండ్‌లో వచ్చిన డీసెంట్ నంబర్స్ మిక్స్‌డ్ టాక్ ఉన్న సినిమాలకు వర్కింగ్ డేస్‌లో కంటిన్యూ అవ్వడం అంత సులువు కాదు. ఇక రాబోయే రోజుల్లో ఈ సినిమా ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News