లెనిన్ అప్డేట్.. అసలు నిజం ఏంటి..?

మురళి కిషోర్ అబ్బూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ కలిసి నిర్మిస్తుంది.;

Update: 2025-09-21 10:30 GMT

అక్కినేని అఖిల్ ఏజెంట్ తర్వాత లెనిన్ సినిమా చేస్తున్నాడు. మురళి కిషోర్ అబ్బూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ కలిసి నిర్మిస్తుంది. సినిమా ఎప్పుడు మొదలు పెట్టారో ఏమో కానీ టీజర్ తో సర్ ప్రైజ్ చేశారు. లెనిన్ టీజర్ లో అఖిల్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటించింది. ఐతే ఈమధ్య జరిగిన పరిణామాల వల్ల శ్రీలీల ఆ ప్రాజెక్ట్ నుంచి ఎగ్జిట్ అయ్యి భాగ్య శ్రీ బోర్స్ ఎంటర్ అయ్యిందని టాక్. ఐతే సినిమాకు కొన్ని ఎపిసోడ్స్ అవుట్ సరిగా లేదని రీషూట్ చేశారన్న టాక్ వచ్చింది.

అఖిల్ లెనిన్ పై రకరకాల వార్తలు..

మేకర్స్ నుంచి మాత్రం సినిమా గురించి ఎలాంటి అప్డేట్ రావట్లేదు. ఐతే లేటెస్ట్ టాక్ ప్రకారం లెనిన్ సినిమా 80 శాతం వరకు షూటింగ్ పూర్తైందట. మరో 20 రోజుల్లో సినిమా పూర్తి చేసి నవంబర్ లో రిలీజ్ ప్లానింగ్ ఉన్నారట. నవంబర్ 14న ఈ సినిమా రిలీజ్ ప్లానింగ్ ఉందని టాక్. రీషూట్స్, రిలీజ్ డేట్ అఖిల్ సినిమాకే ఇలా రకరకాల వార్తలు స్ప్రెడ్ అవుతాయి. ఐతే వీటిపై చిత్ర యూనిట్ నుంచి రెస్పాన్స్ వస్తుందని ఆశించినా వాళ్లు మాత్రం సైలెంట్ గా ఉంటున్నారు.

అఖిల్ ఏజెంట్ సినిమా తర్వాత దాదాపు రెండేళ్లు టైం తీసుకున్నాడు. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన స్పై యాక్షన్ మూవీ ఏజెంట్. ఐతే ఆ మూవీ ఫ్లాప్ వల్ల అఖిల్ మళ్లీ అప్సెట్ అయ్యాడు. తను ఇంత కష్టపడుతున్నా సక్సెస్ రానందుకు ఫీల్ అవుతున్నాడు. ఆ టైం లోనే వినరో భాగ్యము విష్ణు కథ సక్సెస్ అందుకున్న మురళి కిషోర్ లెనిన్ స్టోరీతో అఖిల్ ని మెప్పించాడు.

మాస్ హిట్ టార్గెట్..

లెనిన్ సినిమా కూడా లవ్ యాక్షన్ మూవీగా వస్తుంది. ఐతే ఈ సినిమా విషయంలో అక్కినేని ఫ్యాన్స్ డౌట్స్ కి ఆన్సర్ రావాల్సి ఉంది. అఖిల్ కూడా ఈమధ్య ఎక్కువగా బయట కనిపించలేదు. ఆఫ్టర్ మ్యారేజ్ అఖిల్ బయటకు రావట్లేదు. మరి లెనిన్ సినిమా అనుకున్నట్టుగానే నవంబర్ 14న వస్తుందా లేదా అన్నది చూడాలి. అఖిల్ మాత్రం లేట్ అయినా కూడా లెనిన్ తో మాస్ హిట్ కొట్టాల్సిందే అన్న కసితో ఉన్నాడు.

అఖిల్ సినిమాతో హీరోగా కెరీర్ మొదలు పెట్టిన అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో కమర్షియల్ సక్సెస్ అందుకున్నాడు. ఐతే ఆ సినిమా తర్వాత కెరీర్ గాడిన పడినట్టే అనుకోగా ఏజెంట్ తో మరో షాక్ తగిలింది. లెనిన్ సినిమా అఖిల్ మార్క్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా వస్తుంది. మరి సినిమాతో అఖిల్ అనుకున్న సక్సెస్ అందుకుంటాడా లేదా అన్నది చూడాలి.

Tags:    

Similar News