కొడుకు కోసం తండ్రి స్పెషల్ కేర్
అందానికి అందం, టాలెంట్ కు టాలెంట్, మంచి డ్యాన్సులు వేయగల సత్తా ఉన్నప్పటికీ అక్కినేని వారసుడు అఖిల్ కు మాత్రం సక్సెస్ అనేది దరి చేరడం లేదు.;
అందానికి అందం, టాలెంట్ కు టాలెంట్, మంచి డ్యాన్సులు వేయగల సత్తా ఉన్నప్పటికీ అక్కినేని వారసుడు అఖిల్ కు మాత్రం సక్సెస్ అనేది దరి చేరడం లేదు. అఖిల్ మూవీతో ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ ఆ సినిమాతో డిజాస్టర్ ను అందుకున్నాడు. ఆ తర్వాత చేసిన సినిమాలు కూడా అతనికి కోరుకున్న క్రేజ్, మార్కెట్ ను తెచ్చిపెట్టలేకపోయాయి.
ఏజెంట్ కోసం బాగా కష్టపడిన అఖిల్
ఎంతో కష్టపడి ఎన్నో ఆశలు పెట్టుకుని ఏజెంట్ మూవీ చేస్తే అది కూడా డిజాస్టర్ గానే నిలిచింది. దీంతో ఎప్పటికప్పుడు అఖిల్ పడిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. అందుకే నెక్ట్స్ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాల్సిందేనని అఖిల్ ఎంతో కసి మీదున్నాడు. అందులో భాగంగానే ఏజెంట్ తర్వాత అఖిల్ మీడియా ముందుకు కూడా రాలేదు.
మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో లెనిన్
ఏజెంట్ తర్వాత చాలా కాలం పాటూ గ్యాప్ తీసుకున్న అఖిల్ ఎట్టకేలకు ఓ సినిమాను ఓకే చేసి ఆ సినిమాతో హిట్ అందుకోవాలని ఆశ పడుతున్నాడు. అదే లెనిన్. మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుండగా, అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లలో నాగార్జున, నాగ వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
అక్కినేని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతారు
చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ లవ్ స్టోరీ సినిమాతో అఖిల్ తప్పకుండా బ్లాక్ బస్టర్ అందుకుంటాడని ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆశగా ఉండగా, ఈ మూవీ గురించి రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో నిర్మాత నాగ వంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. లెనిన్ మూవీ చూశాక అక్కినేని ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీలవుతారని, త్వరలోనే ఈ సినిమా నుంచి సాంగ్ వస్తుందని, లెనిన్ మిస్ ఫైర్ అయ్యే ఛాన్సే లేదని, కంటెంట్ విషయంలో ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా నాగార్జున భూతద్దాలు పెట్టుకుని మరీ మానిటర్ చేస్తున్నారని, ఆల్రెడీ కొన్ని సీన్స్ చూశామని, కానీ తానిప్పుడు సినిమా గురించి గొప్పగా చెప్పనని, సినిమా బావుంది, గొప్పగా ఉంటుందని తాను చెప్పిన మాటలే తనకు 2025లో బ్యాక్ ఫైర్ అయ్యాయని, అందుకే లెనిన్ గురించి తాను ఎక్కువగా చెప్పనని, కానీ సినిమా మాత్రం ఎవరినీ డిజప్పాయింట్ చేయదని ఎంతో ధీమా వ్యక్తం చేశారు. నాగ వంశీ చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే అఖిల్ సినిమా విషయంలో నాగ్ ఈసారి స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.