కొత్త ప్రయోగం చేస్తున్న అఖిల్?
అక్కినేని యంగ్ హీరో అఖిల్ కు ఎంత కష్టపడినా సక్సెస్ అనేది దక్కడం లేదు.;
అక్కినేని యంగ్ హీరో అఖిల్ కు ఎంత కష్టపడినా సక్సెస్ అనేది దక్కడం లేదు. ఎన్నో అంచనాలతో చాలా కష్టపడి ఏజెంట్ చేస్తే ఆ మూవీ టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఏజెంట్ సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న అఖిల్ తన నెక్ట్స్ మూవీతో ఎలాగైనా సాలిడ్ హిట్ అందుకోవాలనే ఉద్దేశంతో ఎన్నో కథలను విని ఆఖరికి ఓ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
సరికొత్తగా ట్రై చేస్తున్న అఖిల్
అదే లెనిన్. మురళీ కిషోర్ అబ్బూరి (నందు) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రాయలసీమ నేపథ్యంలో, చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుందని ఇప్పటికే మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పటివరకు అఖిల్ కెరీర్లో ఎప్పుడూ కనిపించని లుక్ లో లెనిన్ లో కనిపించనుండగా ఈ సినిమాలో అఖిల్ మాట్లాడే యాస కూడా చాలా ఆడియన్స్ కు సర్‌ప్రైజ్‌ను ఇస్తుందంటున్నారు.
సిస్టర్ రోల్ లో సీనియర్ నటి?
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ లో అఖిల్ బిజీగా ఉండగా, ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమాలో హీరోకు సిస్టర్ రోల్ ఉంటుందని, ఆ క్యారెక్టర్ చాలా ఎమోషనల్ గా ఉండనుందని అంటున్నారు. ఆ క్యారెక్టర్ కోసం ఓ సీనియర్ నటిని తీసుకోవాలని దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది.
లెనిన్ క్లైమాక్స్ లో సిస్టర్ రోల్ చాలా ఎమోషనల్ గా నిలుస్తుందని, దాంతో పాటూ అఖిల్ క్యారెక్టర్ కు ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉంటాయని కూడా టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే ఈ సినిమా అఖిల్ కెరీర్లో సరికొత్త ప్రయోగంగా మారడం ఖాయం. నవంబర్ 14న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తుండగా, ఎట్టి పరిస్థితుల్లో లెనిన్ తో సాలిడ్ హిట్ అందుకోవాలని చూస్తున్నారు అఖిల్.