అఖిల్ ని మారుతి లైన్ లో పెడుతున్నాడా?

అక్కినేని వార‌సుడు అఖిల్ స‌క్సెస్ కోసం ఎలా ఎదురు చూస్తున్నాడో? చెప్పాల్సిన ప‌నిలేదు.;

Update: 2026-04-01 02:45 GMT

అక్కినేని వార‌సుడు అఖిల్ స‌క్సెస్ కోసం ఎలా ఎదురు చూస్తున్నాడో? చెప్పాల్సిన ప‌నిలేదు. ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న `ఏజెంట్` ఫ‌లితం ఊహించ‌ని విధంగా రావ‌డంతో? మ‌రోసారి ప్లాప్ రూపంలో గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలింది. `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్` తో వ‌చ్చిన స‌క్సెస్ ను `ఏజెంట్` తోనూ కొన‌సాగించాల‌ని చూసిన ఆలోచ‌న‌కు బ్రేక్ ప‌డింది. `ఏజెంట్` హిట్ అయితే కెరీర్ కొత్త ట‌ర్నింగ్ తీసుకుంటుంద‌ని ఎంతో ఆశించాడు కానీ ఫ‌లితం తీవ్ర నిరాశ‌నే మిగిల్చింది. దీంతో కొత్త క‌థ‌లు, ద‌ర్శ‌కుల విష‌యంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు.

ప్ర‌స్తుతం ముర‌ళీ కిషోర్ అబ్బూరి ద‌ర్శ‌క‌త్వంలో `లెనిన్` లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. రాయ‌ల‌సీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న చిత్ర‌మిది. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ ముగింపు ద‌శ‌కే చేరుకుంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా జ‌రుగు తున్నాయి. స‌మ్మ‌ర్ కానుక‌గా రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. అయితే అగ్ర హీరోల చిత్రాలు రిలీజ్ కు ఉండ టంతో వెన‌క్కి త‌గ్గుతున్నాడు. మ‌రి త‌దుప‌రి చిత్రాల సంగ‌తేంటి? అంటే ఓ ఇంట్రెస్టింగ్ విష‌యం లీకైంది. అఖిల్ కోసం మారుతి ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు తెలిసింది. ఇప్ప‌టికే అఖిల్ తో రెండు..మూడు మీటింగ్లు కూడా జ‌రిగాయ‌ని స‌న్నిహిత వ‌ర్గాల నుంచి తెలిసింది.

మ‌రి ఈ కాంబో సెట్ అవుతుందా? లేదా? అన్న‌ది ఇంకా చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉంది కాబ‌ట్టి క్లారిటీ రావ‌డానికి స‌మ‌యం ప‌డ‌తుంది. మారుతి చివ‌రిగా ప్ర‌భాస్ తో తెర‌కెక్కించిన `ది రాజాసాబ్` ప్లాప్ అయిన సంగ‌తి తెలిసిందే. అప్ప‌టి నుంచి మారుతి హీరోల విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. త‌ర్వాత ఏ హీరోతో సినిమా చేసిన అది ప‌క్కా హిట్ అవ్వాల‌నే క‌సితో ప‌ని చేస్తున్నాడు. ఇప్ప‌టికే మారుతి అక్కినేని కాంపౌండ్ లో నాగ‌చైత‌న్య హీరోగా `శైలిజ రెడ్డి అల్లుడు` అనే సినిమా తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చింది. కానీ క‌మ‌ర్శియ‌ల్ గా మంచి లాభాలే తెచ్చి పెట్టింది.

ఆ పాజిటివ్ సైన్ అఖిల్ సినిమా ప‌రంగా క‌లిసొచ్చే అవ‌కాశం ఉంది. అఖిల్ కూడా కొత్త ద‌ర్శ‌కుల్ని ఎంచుకోవ‌డంలో విఫ‌ల‌మ‌వుతున్నాడు. ఇంత వ‌ర‌కూ అత‌డు చేసిన ప్ర‌య‌త్నాల్లో ఒకటి రెండు త‌ప్ప పెద్ద‌గా క‌లిసి రాలేదు. ఈ క్ర‌మంలో మారుతి లాంటి అనుభ‌వం ఉన్న ద‌ర్శ‌కుడితో సినిమా చేస్తే అఖిల్ కి ప్ల‌స్ అవుతుంద‌నే భావ‌న ఉంది.ఇంకా అఖిల్ వేర్వేరు ద‌ర్శ‌కుల‌తోనూ ట‌చ్ లో ఉన్నాడు. వాళ్లంద‌రిలో ఎవ‌రి మంచి క‌థ‌తో ముందుకొస్తే వాళ్ల‌తోనే ముందుకెళ్తాడు. మ‌రి మారుతి విష‌యంలో ఎలాంటి ప్ర‌క‌ట‌న వ‌స్తుందో చూడాలి.

Tags:    

Similar News