చిరు, బాలయ్య, పవన్.. ఉండేదెవరు? తప్పుకునేదెవరు?
ఈ క్రమంలోనే రానున్న దసరాపై తెలుగు స్టార్ హీరోలు కన్నేశారు. ఈ సెప్టెంబర్లో పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఢీ అంటే ఢీ అనేందుకు సిద్ధమవుతున్నాయి.;
టాలీవుడ్ లో బాక్సాఫీస్ వద్ద పరిస్థితి ఎప్పుడూ విచిత్రంగానే ఉంటుంది. చేయాలని ఫిక్స్ అయితే ఎంత పోటీ ఉన్నా ఒకరోజు సినిమాలు రిలీజ్ చేస్తారు. అలా ఒకే రోజు రెండు, మూడు సినిమాలు రిలీజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. లేదంటే బాక్సాఫీస్ ను ఖాళీగా ఉంచేస్తారు. అసలు రిలీజ్ మాటే ఎత్తరు. రీసెంట్ గా సమ్మర్ అలానే గడిచిపోయింది.
ఎండాకాలం సెలవులను ఉపయోగించుకొని బాక్సాఫీస్ వద్ద సినిమాల సందడి ఉంటుందని అనుకుంటే, పరిస్థితి భిన్నంగా అయ్యింది. పలు కారణాలు వల్ల ఆయా సినిమాలు పోస్ట్ పోన్ అయ్యాయి. ఇక టాలీవుడ్ లో బడా హీరోలు టార్గెట్ చేసేది ఒకటి సంక్రాంతి, రెండు దసరా. తెలుగు రాష్ట్రాల్లో ఇవి రెండు పెద్ద పండగలు. అందుకే సినిమాలను కూడా ఈ పండగలకే రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటారు.
ఈ క్రమంలోనే రానున్న దసరాపై తెలుగు స్టార్ హీరోలు కన్నేశారు. ఈ సెప్టెంబర్లో పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఢీ అంటే ఢీ అనేందుకు సిద్ధమవుతున్నాయి. అందులో నందమూరి బాలకృష్ణ అఖండ 2, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ, మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర ఉన్నాయి. ఈ ముగ్గురు బడా హీరోలు సెప్టెంబర్ లోనే వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
ఈసారి అక్టోబర్ 02న దసరా పండగ ఉండనుంది. ఇందు కోసం వారం ముందు నుంచే సెలవులు ప్రకటిస్తారు. ఈ హాలీడేస్ ను దృష్టిలో ఉంచుకున్న ఆయా సినిమాల మేకర్స్ సెప్టెంబర్ 25 డేట్ పై కన్నేశారు. ఈ నేపథ్యంలోనే సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న అఖండ 2 సెప్టెంబర్ 25 రిలీజ్ కానుంది. అయితే అందరి కంటే ముందే అఖండ మేకర్స్ ఈ తేదీని లాక్ చేసుకున్నారు.
ఇక పనన్ కళ్యాణ్, సుజిత్ కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా ఓజీ కూడా అదే తేదీన థియేటర్లలోకి రానుంది. దీంతో రెండు సినిమాలు క్లాష్ అవుతున్నాయని అనుకునే లోపే రేస్ లోకి మూడో సినిమా రానుందని ఇన్ సైట్ టాక్ వినిపిస్తోంది. చిరంజీవి విజువల్ వండర్స్ విశ్వంభర కూడా సెప్టెంబర్ 25న వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
అయితే ఒకే రోజు రెండు సినిమాలు అంటే ఓకే. కానీ మూడు సినిమాలు, అవీనూ పెద్ద హీరోల సినిమాలు ఒకే రోజు రిలీజ్ అంటే థియేటర్ల అడ్జెస్ట్ మెంట్ కూడా కష్టమే. అటు ఫ్యాన్స్ కు కూడా కన్ ఫ్యూజనే. అందుకే ఈ రేస్ లో నుంచి ఒకరు తప్పుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలిసింది.
అందరికంటే ఆఖరుగా ఫిక్స్ అయిన విశ్వంభం మాత్రం రేస్ లో ఉంటుందట. మిగిలిన రెండు అఖండ 2, ఓజీలో ఏదో ఒకటి తప్పుకోనుందని తెలుస్తోంది. చూడాలి మరి దసర రేస్ లో ఉండేదెవరు? తప్పుకునేదెవరు? మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది!