ఈవెంట్‌లో అదితి హవా.. బెల్లంగారు అంటూ

పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ కుమార్తెగా తమిళ పరిశ్రమలో అడుగుపెట్టిన అదితి శంకర్, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకునే దిశగా సాగుతోంది.;

Update: 2025-05-26 05:28 GMT

పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ కుమార్తెగా తమిళ పరిశ్రమలో అడుగుపెట్టిన అదితి శంకర్, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకునే దిశగా సాగుతోంది. ఇప్పటికే తమిళంలో కొన్ని సినిమాలతో ఆకట్టుకున్న ఆమె, ఇప్పుడు తెలుగులో ‘భైరవం’ సినిమా ద్వారా మరో లెవెల్ కు వెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఈ సినిమాలో ఆమె ఓ ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా, ప్రమోషన్ లో కూడా పక్కా బజ్‌ను క్రియేట్ చేస్తున్నారు.

ఇటీవల జరిగిన ‘భైరవం’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో అదితి పాడిన ‘గిచ్చమాకే’ సాంగ్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో ఆమె ఓ ప్రొఫెషనల్ సింగర్‌లా పాటను పాడడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతేకాదు, ఈవెంట్‌లో ఆమె చేసిన డ్యాన్స్ ముహూర్తం వేళ ట్రైలర్ లాంచ్‌లో కనిపించిన ఎనర్జీని మరోసారి గుర్తుచేసింది. అదితి పర్ఫార్మెన్స్‌తో పాటు ఆమె మాట్లాడిన మాటలూ వైరల్ అయ్యాయి.

అందులో ముఖ్యంగా హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ను ‘బెల్లంగారు’ అని క్యూట్‌గా పిలవడం అందరినీ ఆకట్టుకుంది. వెంటనే శ్రీనివాస్ తన మైక్ తీసుకుని ‘మధ్యలో శ్రీను కూడా వేస్తే బెటర్’ అని సరదాగా కామెంట్ చేయగా, అదితి కూడా స్మైల్ చేస్తూ ఆడియెన్స్ అభిప్రాయాన్ని ఊహిస్తూ ఓకే అనిపించేలా సైగ చేసింది. చివరికి శ్రీనివాస్ కూడా నవ్వుతూ అదే పేరునే ఓకే అన్నారు. ఈ సరదా సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.

అదితి మాట్లాడుతూనే బెల్లంకొండ శ్రీనివాస్‌ గురించి పొగడ్తలు కురిపించింది. “అతను చాలా మంచి కో స్టార్. ఫుల్ ఎనర్జీతో ఉంటారు. సెట్‌లో చాలా బాగా ట్రీట్ చేశారు. టాలెంటెడ్ హీరో, గ్రేట్ డ్యాన్సర్. భైరవం సినిమా మంచి విజయం సాధించాలి,” అని తెలిపింది. అలాగే తన తండ్రి శంకర్‌కు తెలుగులో ఉన్న అభిమానాన్ని గుర్తు చేస్తూ, “తెలుగు ప్రేక్షకులు నన్ను కూడా ప్రేమిస్తారని ఆశిస్తున్నా,” అంటూ ఎమోషనల్ గా చెప్పింది.

ఈ నెల 30న విడుదల కానున్న ‘భైరవం’లో బెల్లంకొండ శ్రీనివాస్‌తో పాటు నారా రోహిత్, మంచు మనోజ్‌లు కలిసి నటించారు. అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లై తదితరులు కథానాయికలుగా నటించారు. తమిళ బ్లాక్‌బస్టర్ ‘గరుడన్’కు తెలుగు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి విజయ్ కనకమేడల దర్శకత్వం వహించగా, ట్రైలర్, పాటలు, ఈవెంట్లు ఇప్పటికే సినిమాపై హైప్ ను పెంచాయి.

Full View
Tags:    

Similar News