స్లిమ్ సీక్రెట్ చెప్పేసిన నయా నటి!
ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన లయ కెరీర్ పీక్స్ లో ఉండగానే హీరోయిన్ అవకాశాలు వదులుకుని పెళ్లి చేసుకుని స్థిరపడింది.;
`తమ్ముడు` చిత్రంతో లయ కంబ్యాక్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన లయ కెరీర్ పీక్స్ లో ఉండగానే హీరోయిన్ అవకాశాలు వదులుకుని పెళ్లి చేసుకుని స్థిరపడింది. అప్పటి నుంచి ఇంతవరకూ మళ్లీ సినిమాల వైపు చూడలేదు. తమ్మడుతోనే రీఎంట్రీ ఇస్తుంది. కానీ అప్పటి లయకు-ఇప్పటి లయకు పెద్దగా వ్యత్యాసం లేదన్నది కాదనలేని వాస్తవం. లయ ఇప్పటికీ హీరోయిన్ మెటీరియల్.
వయసు జస్ట్ నెంబర్ మాత్రమే అనిపిస్తుంది. లయ వయసిప్పుడు నాలుగు పదులు దాటాయి. 43 రన్నింగ్ లో ఉంది. ఇద్దరు పిల్లల తల్లి. కానీ 30 ఏళ్ల భామలాగే వైరల్ అవుతుంది. మరి ఈ బ్యూటీ సీక్రెట్ ఏంటి? మంచి ఫిట్ నెస్ ప్రియురాలా? యోగా, జిమ్ లాంటివి లైఫ్ లో భాగం చేసుకుందా? అంటే అలాంటిందేమి లేదు. కేవలం మితంగా తినడం ద్వారానే ఇలా ఉన్నట్లు తెలిపింది.
పెళ్లికి ముందు నుంచి కూడా మితంగా తినడం అలవాటు అని ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నానని తెలిపింది. కడపు నిండుగా తినడం అన్నది ఇంతవరకూ ఎప్పుడూ జరగలేదని..అందుకే సన్నగా ఉన్నానంది. అలాగే పూర్తి శాఖాహారి అట. కానీ వంటకాలన్ని మాత్రం స్పైసీ గా ఉంటాయట. పప్పు, కూర, పచ్చడి ఏదైనా సరే అన్నంలో పదార్దాలు ఎక్కువగా ఉండేలా చూసుకుంటుందిట.
వాటన్నింటిని తానే స్వయంగా తయారు చేసుకుంటుందిట. బయట పుడ్ తినదట. అమెరికాలో ఉన్న ప్పుడు పిల్లల కోసం, భర్త కోసం లంచ్ బాక్సులు తయారు చేయడం లాంటివి ఏవీ ఉండవని...అన్ని వాళ్లున్న ప్రదేశాల్లోనే అందుబాటులో ఉంటాయంది. సాయంత్రం మాత్రమే వంట చేస్తుందిట. తాను తినేది కూడా తక్కువ కావడంతో మరుసటి రోజు వాటినే తీసుకుంటాని తెలిపింది.