• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అమ్మ‌వారి పూజలో స్టార్...

అమ్మ‌వారి పూజలో స్టార్ వైఫ్ ఆగ్ర‌హానికి కార‌ణం?

| నేటి ద‌స‌రాను పుర‌స్క‌రించుకుని అమ్మవారి(దుర్గ‌మ్మ‌) పూజా కార్య‌క్ర‌మాలు వైభ‌వంగా జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2024-10-12 05:14 GMT

నేటి ద‌స‌రాను పుర‌స్క‌రించుకుని అమ్మవారి(దుర్గ‌మ్మ‌) పూజా కార్య‌క్ర‌మాలు వైభ‌వంగా జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. దీనికి సామాన్యులు సెల‌బ్రిటీలు అనే విభేధ‌మే లేదు. అయితే సెల‌బ్రిటీల ఇండ్ల‌లో ఈ త‌ర‌హా కార్య‌క్ర‌మాలు కాస్త క‌ల‌ర్ ఫుల్ గా రంజుగా సాగుతుంటాయి. సాటి స్టార్లు అంద‌రినీ ఆహ్వానించి ఈ ఉత్స‌వాల‌ను ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్వ‌హించ‌డం నిత్య‌కృత్యం.

ఇప్పుడు అలాంటి ఉత్స‌వంలో ప్ర‌ముఖ స్టార్ వైఫ్ కోపం న‌షాలానికి అంట‌డం, అది కాస్తా అదుపుత‌ప్ప‌డం క‌నిపించింది. ప్ర‌స్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతున్నాయి. అమ్మ‌వారి చెంత ప్ర‌శాంతంగా ఉండాల్సిన‌ది పోయి ఆమె ఎందుక‌లా కోపంగా మారింది? అమ్మ‌వారు పూనారా? అంటూ కొంద‌రు కామెంట్లు చేస్తున్నారు. ఇంత‌కీ ఈ ఎపిసోడ్ లో స్టార్ హీరోయిన్ ఎవ‌రు? అంటే... ది గ్రేట్ కాజోల్. డిడిఎల్‌జే న‌టి. ఖాన్ అభిమానుల ఫేవ‌రెట్ హీరోయిన్.

అక్టోబరు 11, శుక్రవారం నాడు బాలీవుడ్ ప్రముఖులు దుర్గాపూజ ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. కాజోల్, అలియా భట్, రాణి ముఖర్జీ, జ‌యా బ‌చ్చ‌న్ స‌హా ప‌లువురు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అయితే దుర్గాపూజ పండల్ వద్ద కాజోల్ తన కూల్ నెస్ ని కోల్పోయినట్లుగా క‌నిపించిన‌ వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియోలో కాజోల్ పూజా కార్య‌క్ర‌మాల సమయంలో దుర్గా దేవి విగ్రహం దగ్గర బూట్లు ధరించి హాజరైన వారిపై ఘ‌ర్ష‌ణ ప‌డిన‌ట్టు క‌నిపిస్తోంది. బూట్లు చెప్పుల‌తో ప్ర‌వేశం నిషిద్ధం. కానీ వారు అలా గుడ్డిగా అమ్మ‌వారి వ‌ద్ద‌కు వ‌చ్చేసారు. దీంతో కలవరపడిన కాజోల్ నిజంగానే సీరియ‌స్ అయ్యారు. ``కొంచెం గౌరవం ఇవ్వండి.. ఇది దేవ‌త‌ పూజ`` అని చెబుతూ గౌరవం చూపించమని వారిని గట్టిగా కోరింది కాజోల్.

కాజోల్‌తో పాటు సీనియ‌ర్ న‌టీమ‌ణి, అమితాబ్ బ‌చ్చ‌న్ స‌తీమ‌ణి జ‌యాబ‌చ్చ‌న్ జీ కూడా ఈ పండుగ‌లో క‌నిపించారు. యువ‌నటి ఆలియా భట్ అద్భుతమైన ఎరుపు రంగు చీర ధరించి క‌నిపించ‌గా, త‌న సోద‌రి షాహీన్ భ‌ట్ కూడా పూజ‌లో పాల్గొని క‌నిపించారు. భ‌ట్స్ సోదరీమణులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని పండుగ వాతావరణం నెలకొల్పారు. ఈవెంట్ నుండి బ‌య‌టికి వ‌చ్చిన‌ మరొక వీడియోలో కాజోల్ తన భర్త, నటుడు అజయ్ దేవగన్, వారి కుమారుడు యుగ్‌తో కలిసి ఉంది. నేవీ బ్లూ కుర్తా సెట్‌లలో అజయ్, యుగ్, కాజోల్ క‌లిసి ఫోటోగ్రాఫ్‌ల కోసం పోజులిచ్చారు.

#kajol angry on paparazzi asks everyone to remove their shoes pic.twitter.com/hEQskXMEfz

— Bollywood World (@bwoodworld) October 11, 2024
Tags:    
  • Kajol 
  • Actress 
  • Bollywood 
  • Filmindustry 
  • Durgamandir 
  • Aliabhatt 
  • Jayabachchan 
  • Durgapooja 

Similar News

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

Copyright @2026

Powered by Blink CMS