డిగ్రీ పరీక్షల కోసం... క్రేజీ హీరోయిన్‌ షూటింగ్‌కి బ్రేక్‌!

సినిమా ఇండస్ట్రీలో ఆఫర్లు రావడమే అదృష్టంగా భావిస్తారు. ఒక్క ఆఫర్‌ వచ్చిందంటే మొత్తం కెరీర్‌ ఇదే అనుకుని కష్టపడ్డ వారు చాలా మంది ఉంటారు.;

Update: 2025-11-11 16:30 GMT

సినిమా ఇండస్ట్రీలో ఆఫర్లు రావడమే అదృష్టంగా భావిస్తారు. ఒక్క ఆఫర్‌ వచ్చిందంటే మొత్తం కెరీర్‌ ఇదే అనుకుని కష్టపడ్డ వారు చాలా మంది ఉంటారు. కొందరు హీరోలు, హీరోయిన్స్ ఇండస్ట్రీలో ఆఫర్లు వచ్చిన వెంటనే చదువు, వ్యాపారం పక్కన పెట్టి పూర్తిగా సినిమాలపై దృష్టి పెట్టిన వారు ఉంటారు. చాలా మంది హీరోయిన్స్‌ సైతం తమ చదువును మధ్యలో ఆపేశామని, సినిమాల్లో ఆఫర్లు రావడం వల్ల తమ చదువు పూర్తి చేయలేక పోయాము అని చెబుతూ ఉంటారు. కానీ కొందరు మాత్రమే ఇండస్ట్రీలో మంచి ఆఫర్లు వస్తున్నప్పటికీ తమ చదువును పూర్తి చేయడం మనం చూస్తూ ఉంటాం. ఆ మధ్య శ్రీలీల హీరోయిన్‌గా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తన ఎంబీబీఎస్‌ పరీక్షలను పూర్తి చేయడం కోసం షూటింగ్‌లకు బ్రేక్ తీసుకుందనే వార్తలు వచ్చాయి. శ్రీలీల కొన్ని వారాల తర్వాత షూటింగ్‌ లో మళ్లీ పాల్గొనడం మనం చూశాం.

సయ్యార సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అనిత్‌ పడ్డా...

ఇప్పుడు బాలీవుడ్‌ క్రేజీ బ్యూటీ అనిత్ పడ్డా గురించి ఇలాంటి వార్తలే సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వచ్చే నెలలో అనిత్‌ పడ్డాకి బి.ఎ పరీక్షలు ఉన్నాయట. అందుకోసం సన్నద్దం అవుతుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఈ ఏడాది సూపర్‌ హిట్‌ సినిమాల్లో ముందు ఉండే సయ్యారా సినిమాలో హీరోయిన్‌గా నటించడం ద్వారా అనిత్‌ పడ్డా ఓవర్‌ నైట్ స్టార్‌ హీరోయిన్‌ అయింది. ఆ సినిమా విడుదలైన వెంటనే ఆమె వద్ద పది మంది నిర్మాతలు, ఫిల్మ్‌ మేకర్స్ అడ్వాన్స్ పట్టుకుని నిల్చున్నారు. ఆ స్థాయిలో స్టార్‌డం దక్కించుకున్న ముద్దుగుమ్మ అనిత్‌ పడ్డా ఆచితూచి సినిమాలకు కమిట్‌ అయింది. ఇటీవల దినేష్‌ విజన్ దర్శకత్వంలో శక్తి షాలిని అనే సినిమాను చేసేందుకు గాను అడ్వాన్స్ తీసుకుందని, ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ పూర్తి చేసుకుని షూటింగ్‌ను ప్రారంభించేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

అనిత్ పడ్డా రెండో సినిమా కన్ఫర్మ్‌..

దినేష్‌ విజన్‌ షూటింగ్‌ ప్రారంభించేందుకు రెడీగా ఉన్నప్పటికీ జనవరి రెండో వారం వరకు అనిత్‌ పడ్డా పరీక్షలతో బిజీగా ఉండటం వల్ల వెయిట్‌ చేయాల్సిన పరిస్థితి ఉందట. అనిత్‌ పడ్డా లేని షెడ్యూల్‌ ను దర్శకుడు దినేష్ ప్లాన్‌ చేస్తున్నట్లు బాలీవుడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. సినిమాల్లో నటిస్తూనే అనిత్ పడ్డా తన పొలిటికల్‌ సైన్స్‌ బి.ఎ ను చేస్తుంది. ఆమె తన చదువును మధ్యలో ఆపేయడం ఇష్టం లేకపోవడం వల్లే షూటింగ్‌ కు దూరంగా ఉంటుందట. షూటింగ్‌ కు హాజరు అవుతూనే పరీక్షలు రాసే అవకాశం ఉన్నప్పటికీ చదువుపై ఆమెకు ఉన్న ఆసక్తి, పట్టుదల కారణంగా ఏకంగా రెండున్నర నెలలు గ్యాప్‌ తీసుకోవాలని నిర్ణయించుకుందట. ఈ ఏడాదితో ఆమె తన బి.ఎ ను పూర్తి చేస్తుందని కూడా బాలీవుడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

బాలీవుడ్‌ సినిమాలతో బిజీ బిజీ..

ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ చదువుపై ప్రత్యేక శ్రద్దను కనబర్చడం అభినందనీయం. చదువు పూర్తి చేసి సినిమాల్లో బిజీ కావడం అనేది మంచి నిర్ణయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమాల్లో హిట్‌ వచ్చినంత మాత్రాన సినిమాలను పూర్తిగా పక్కన పెట్టడం కరెక్ట్‌ కాదని, భవిష్యత్తు అవసరాల నిమిత్తం అయినా సినిమాలతో పాటు, చదువును కంటిన్యూ చేయడం కొత్త హీరోయిన్స్‌కు ఎంతైనా అవసరం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సయ్యార సినిమాతో ఓవర్‌ నైట్‌ స్టార్‌ అయిన అనిత్‌ పడ్డా ప్రస్తుతానికి చేస్తున్న సినిమాలు ఏమీ లేవు. కానీ వచ్చే ఏడాదిలో ఈమె నుంచి కనీసం రెండు మూడు సినిమాలు అయినా వచ్చే విధంగా ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి అనిత్‌ పడ్డా తన కాలేజ్‌ డేస్‌ను తిరిగి ఎంజాయ్‌ చేస్తుంది. చదువు పూర్తి చేసి పూర్తి స్థాయి హీరోయిన్‌గా సినిమాలు చేయాలని ఆమె సన్నిహితులు కోరుకుంటున్నారు.

Tags:    

Similar News