సూపర్ స్టార్ సినిమాకు బాయ్‌కాట్ తిప్పలు..!
బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమీర్ ఖాన్ సాలిడ్ సక్సెస్ దక్కించుకుని దశాబ్ద కాలం అయింది. ఆయన నుంచి వస్తున్న సినిమాలు ఇలా వచ్చి అలా వెళ్లి పోతున్నాయి. సక్సెస్‌లు లేకపోవడంతో సినిమాల సంఖ్య భారీగా తగ్గించాడు.;
బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమీర్ ఖాన్ సాలిడ్ సక్సెస్ దక్కించుకుని దశాబ్ద కాలం అయింది. ఆయన నుంచి వస్తున్న సినిమాలు ఇలా వచ్చి అలా వెళ్లి పోతున్నాయి. సక్సెస్‌లు లేకపోవడంతో సినిమాల సంఖ్య భారీగా తగ్గించాడు. చాలా ఏళ్ల క్రితం అమీర్ ఖాన్ నటించిన తారే జమీన్ పర్ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. విద్యా వ్యవస్థలో రావాల్సిన మార్పులను గురించి ఆ సినిమాలో చూపించడం ద్వారా జాతీయ స్థాయిలో ఆమీర్ ఖాన్ ఆ సమయంలో ప్రశంసలు దక్కించుకున్నారు. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ అన్నట్లుగా సితారే జమీన్ పర్ అనే సినిమాతో ఆమీర్ ఖాన్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
సితారే జమీన్ పర్ అనేది ఒక విదేశీ సినిమాకు రీమేక్. ఒరిజినల్‌గా తారే జమీన్ పర్ సినిమాకు సీక్వెల్ కాదు. కానీ తారే జమీన్ పర్ సినిమాకు సీక్వెల్ అంటే పబ్లిసిటీ కలిసి రావడంతో పాటు, ప్రేక్షకుల్లో బజ్ క్రియేట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇలాంటి ప్రచారం చేశారు. గత రెండేళ్లుగా ఈ సినిమా గురించిన ప్రచారం జరుగుతోంది. ఎట్టకేలకు ఈ సినిమాను వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న కొద్ది సినిమా చుట్టూ వివాదాలు చుట్టు ముడుతున్నారు. సినిమా విడుదల విషయంలో కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆమీర్ ఖాన్ విషయంలో చాలా మంది విమర్శలు చేస్తున్నారు.
ఇటీవల ఇండియా-పాకిస్తాన్ మద్య ఘర్షణ వాతావణం నెలకొంది. ఆ సమయంలో చాలా మంది బాలీవుడ్ స్టార్స్‌తో పాటు, ఇతర భాషల సినిమా తారలు పాకిస్తాన్ తీరును తప్పుబట్టడంతో పాటు, ఇండియన్ ఆర్మీ గురించి పాజిటివ్‌గా స్పందించారు. అంతేకాకుండా ఇండియా పై జరిగిన ఉగ్రదాడిని ఖండించారు. కానీ ఆమీర్ ఖాన్ నుంచి మాత్రం ఎలాంటి ప్రకటన రాలేదు. దాంతో కనీస బాధ్యతతో వ్యవహరించని ఆమీర్ ఖాన్ సినిమాను ఇండియన్స్ ఎందుకు ఆధరించాలంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. ఆమీర్ ఖాన్‌కి దేశ భక్తి లేదు, ఆయన ఇతర దేశం పైనే మక్కువ చూపుతున్నట్లు ఉన్నారు అంటూ కొందరు సితారే జమీన్ పర్ సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ పిలుపునిచ్చారు.
సితారే జమీన్ పర్ సినిమా సీక్వెల్ కాదని, రీమేక్ అంటూ కూడా కొందరు బాయ్ కాట్ చేయాలని భావిస్తున్నారు. సినిమా విడుదల తేదీ సమీపిస్తున్నా కొద్ది ఈ వివాదం పెరుగుతున్న నేపథ్యంలో ఆమీర్ ఖాన్ ఎలా స్పందిస్తాడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆమీర్ ఖాన్ సితారే జమీన్ పర్ సినిమా విడుదల చుట్టూ నెలకొన్న వివాదం పై ఆమీర్ ఖాన్ ఫ్యాన్స్, ఆయన సన్నిహితులు స్పందిస్తున్నారు. ఆమీర్ ఖాన్ గత మూడు నాలుగు ఏళ్లుగా సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. కానీ ఆయన నిర్మాణ సంస్థకు చెందిన అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో ఉగ్ర దాడిని ఖండించడంతో పాటు, పాక్ కి వ్యతిరేకంగా ట్వీట్స్ చేయడం జరిగింది. కనుక బాయ్ కాట్ అనేది సమంజసం కాదని అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. విడుదలకు మరికొన్ని రోజులు మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో ఏం జరుగుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.