• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Video Stories >  ట్రైల‌ర్‌: అమ్మాయి కోసం...

ట్రైల‌ర్‌: అమ్మాయి కోసం దాయాదుల‌ గలాటా

| ప్రేమ‌- స్నేహం నేప‌థ్యంలో ఇప్ప‌టికే ఎన్నో సినిమాలు విడుద‌లై ఘ‌న‌విజ‌యం సాధించాయి.

By - Tupaki Desk
Update: 2023-08-12 04:01 GMT

ప్రేమ‌- స్నేహం నేప‌థ్యంలో ఇప్ప‌టికే ఎన్నో సినిమాలు విడుద‌లై ఘ‌న‌విజ‌యం సాధించాయి. స్టార్లు మార‌తారు .. కానీ థీమ్ అదే.. అవే సెన్సిబిలిటీస్.. నిజ‌జీవితంలో ఎన్నో సంఘ‌ట‌న‌ల ఆధారంగా ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌లు ఇలాంటి సినిమాల‌కు స‌న్నివేశాల‌ను స‌మ‌కూర్చుకోవ‌డం ప్ర‌తిసారీ కొత్త‌దనాన్ని ఆవిష్క‌రిస్తుంది. ప్రేమ‌- స్నేహం-విరోధం నేప‌థ్యంలోనే వ‌చ్చిన ప్రేమ‌దేశం- చెలి లాంటి చిత్రాలు యూత్ ఆద‌ర‌ణ‌తో బ్లాక్ బ‌స్ట‌ర్లుగా నిలిచాయి.

తాజాగా ఇదే బాట‌లో విడుద‌ల‌వుతున్న మ‌రో సినిమా-యారియన్ 2. దివ్య ఖోస్లా కుమార్, యష్ దాస్‌గుప్తా, అనశ్వర రాజన్, మీజాన్ జాఫ్రీ, వరినా హుస్సేన్, ప్రియా వారియర్, పెరల్ వి పూరి నటించారు. రాధికా రావు-వినయ్ సప్రూ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో దాయాదులైన ఇద్ద‌రు స్నేహితుల‌ కలయిక క్రేజీ రిలేషన్‌షిప్ నేప‌థ్యంలో భావోద్వేగాల సెల‌బ్రేష‌న్ ని తెర‌పై ఆవిష్క‌రిస్తున్నారు.

`యారియాన్ 2` టీజర్ తాజాగా విడుద‌లైంది. ఇరువురు దాయాదుల మధ్య ఉన్న సాన్నిహిత్యం.. నిజాయితీతో కూడుకున్న‌ స్నేహానికి సంబంధించిన క‌థాంశ‌మిది. కజిన్స్ అయినప్పటికీ, వారి సంబంధం నిజమైన స్నేహంతో ముడిపడి ఆక‌ట్టుకుంటోంది. టీజర్ హిట్ ట్రాక్ `సన్నీ సన్నీ` ఉత్కంఠ‌ను క‌లిగిస్తుంది. ముఖ్యంగా టీజ‌ర్ ఆద్యంతం దివ్యా ఖోస్లా అద్భుత న‌ట‌న క‌ట్టి ప‌డేస్తుంది. తాజాగా టీజ‌ర్ ని విడుద‌ల చేసిన మేక‌ర్స్ అక్టోబర్ 20న యారియాన్ 2 థియేట‌ర్ల‌లోకి విడుద‌ల‌వుతుంద‌ని ప్ర‌క‌టించారు.

యారియన్ 2 ప్రేమ, స్నేహం, భావోద్వేగాలతో పాటు ఫ్యామిలీ ఆడియెన్ మెచ్చే అన్ని విషయాలతో ఆరోగ్యకరమైన కథను తీసుకు వ‌స్తున్నామ‌ని టీమ్ ప్ర‌క‌టించింది. గుల్షన్ కుమార్ T-సిరీస్ సినిమాలు మరియు రావ్ & సప్రు ఫిల్మ్స్ ప్రొడక్షన్ స‌మ‌ర్ప‌ణ‌లో ఈ చిత్రం తెర‌కెక్కింది. అక్టోబర్ 20న థియేటర్లలోకి రానున్న ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, దివ్య ఖోస్లా కుమార్, ఆయుష్ మహేశ్వరి నిర్మించారు. రాధికా రావు-వినయ్ సప్రు దర్శకత్వం వహించారు.

Full View
Tags:    
  • Yaariyan2 
  • TeaserTalk 
  • Bollywood 
  • MovieNews 

Similar News

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

కొత్త ఏటీఎం స్కాం.. విత్ డ్రా చేసినా డబ్బులు రావు.. జర జాగ్రత్త

2026-11-04 06:09 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

పాకెట్ రాకెట్స్ టీజర్.. డబ్బు చుట్టూ ఓ కొత్త ఆట!

2026-11-03 18:01 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

Tupaki Exclusive: రుద్రవరం-పీఎస్ కథలో ఎన్నో ఆసక్తికర మలుపులు.. టీమ్ ఏమంటోంది?

2026-11-03 08:04 GMT

Copyright @2026

Powered by Blink CMS