టీజర్ టాక్: సింగర్ సునీత కొడుకుకు కండోమ్ తెచ్చిన తంటా
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మాతగా గంగానమోని శేఖర్ దర్శకత్వంలో కథానాయకుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆకాశ్‌కు జోడీగా భావన వళపండల్ హీరోయిన్ గా నటిస్తోంది. సర్కారు నౌకరి అని టైటిల్ తో ఈ చిత్రం ఆడియెన్స్ ముందుకు రాబోతుంది
టాలీవుడ్ పాపులర్ అండ్ సీనియర్ సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెలోడీ సాంగ్స్ తో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఎన్నో వందల పాటలతో సంగీత ప్రియుల మనసులను దోచుకుంది. అయితే ఇప్పుడామె తనయుడు ఆకాష్ హీరోగా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే.
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మాతగా గంగానమోని శేఖర్ దర్శకత్వంలో కథానాయకుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆకాశ్‌కు జోడీగా భావన వళపండల్ హీరోయిన్ గా నటిస్తోంది. సర్కారు నౌకరి అని టైటిల్ తో ఈ చిత్రం ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది.
1996లో కొల్లాపూర్ లో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు టీజర్ లో తెలిపారు. దీంతో ఈ చిత్రం పీరియాడిక్ ఫిల్మ్ అని అర్థమైంది. ఈ టీజర్ లో మొదటగా.. ఆ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగి అంటే ఎంత విలువ ఉండేదో చూపించారు. ఈ ప్రచార చిత్రంలో హీరోను గవర్నమెంట్ మెడికల్ ఎంప్లాయిగా చూపించారు. ఈ క్రమంలోనే ఉద్యోగంలో భాగంగా అతడు ఊరు చివర బాక్స్ లో కండోమ్ ప్యాకెట్లను పెట్టడం, ఆ కండోమ్ ప్యాకెట్లను ఊర్లోని చిన్నపిల్లలు బూరలులాగా ఊదుకుంటూ ఆడుకోవడం, ఊరంతో దాని గురించి చెప్పుకోవడం కూడా చూపించారు.
అయితే హీరోకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఓ పల్లెటూరు అమ్మాయితో పెళ్లి ఫిక్స్, ఆ తర్వాత తనకు వచ్చిన ఉద్యోగం వల్ల అతడు ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాడు అనే పాయింట్ ను సినిమాలో చూపించబోతున్నట్లు టీజర్ ద్వారా అర్థమైంది. చివరికి అతడు చేసే ఉద్యోగం వల్లనో, మరే ఇతర కారణం వల్లనో ఊళ్లోకి రావద్దంటూ వార్నింగ్ ఇస్తూ ప్రచార చిత్రాన్ని ముగించారు. మరి ఎందుకు అతడిని ఊరులోకి రావొద్దన్నారు? అతడు చేసే ఉద్యోగం వల్లనేనా అనేది క్లారిటీగా రివీల్ చేయలేదు. మొత్తంగా ఈ టీజర్ నేచురల్ గా ఉన్న విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో బాగానే ఉంది.
ఇకపోతే ఈ చిత్రాన్ని లెజెండరీ డైరెక్టర్ కే.రాఘవేంద్రరావుకు చెందిన ఆర్.కె టెలీ షో ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. సినిమాలో తనికెళ్ల భరణి, సాయి శ్రీనివాస్ వడ్లమాని, సూర్య, రాజేశ్వరి ముళ్లపూడి, మణిచందన, త్రినాథ్, రమ్య పొందూరి తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. శాండిల్య సంగీతం అందించారు. దర్శకత్వంతో పాటు సినిమాటోగ్రఫీ బాధ్యతలు కూడా గంగనమోని శేఖరే చూసుకుంటున్నారు. చూడాలి మరి సింగర్ గా ఉన్నత స్థాయికి చేరుకున్న సునీత పేరును ఆమె కొడుకు ఆకాశ్ హీరోగా ఎంతవరకు నిలబెడతాడో..