కపుల్ ఫ్రెండ్లీ.. 'మైక్' కామెంట్స్ పై ధీరజ్ ఏమన్నారంటే?

అయితే తెలుగు, తమిళ భాషల్లో ఫిబ్రవరి 14న విడుదలైన కపుల్ ఫ్రెండ్లీ మూవీని రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్మాత కమ్ డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని గ్రాండ్ గా విడుదల చేశారు.;

Update: 2026-02-15 11:08 GMT

వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రొమాంటిక్ ఎంటర్టైనర్ కపుల్ ఫ్రెండ్లీ.. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. సంతోష్ శోభన్, మానస వారణాసి లీడ్ రోల్స్ పోషించగా, అశ్విన్ చంద్రశేఖర్ తెరకెక్కించారు. చెన్నై బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సినిమాను యూవీ కాన్సెప్ట్స్ నిర్మించగా, యోగి బాబు తదితరులు నటించారు.

అయితే తెలుగు, తమిళ భాషల్లో ఫిబ్రవరి 14న విడుదలైన కపుల్ ఫ్రెండ్లీ మూవీని రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్మాత కమ్ డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని గ్రాండ్ గా విడుదల చేశారు. తాజాగా నిర్వహించిన సక్సెస్ మీట్‌ లో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజుల క్రితం చేసిన కామెంట్స్ ను ప్రస్తావించారు. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానని చెప్పారు.

రీసెంట్ గా కపుల్ ఫ్రెండ్లీ మూవీ ఈవెంట్ లో తాను సినిమా నచ్చకపోతే, మరోసారి మైక్ పట్టుకుని మాట్లాడనని షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అనేక మంది నెటిజన్లు రెస్పాండ్ అయ్యారు. కొందరు కంటెంట్ పై నమ్మకంతో అలా అన్నారని అభిప్రాయపడగా, మరికొందరు మాత్రం ప్రమోషనల్ స్ట్రాటజీ అంటూ విమర్శించారు.

ఇప్పుడు సక్సెస్ మీట్ లో ఆ విమర్శలపై స్పందించారు ధీరజ్ మొగిలినేని. "నేను ఆ రోజు కపుల్ ఫ్రెండ్లీ బాగోకపోతే.. మీకు నచ్చకపోతే.. మరోసారి మైక్ పట్టుకుని మాట్లాడనని చెప్పా.. ఆ మాటను కాన్ఫిడెంట్ గా ఫ్లోలో చెప్పేశా.. నేను ఆలోచించకుండా మైండ్ లో అనిపించి చెప్పా.. ఆ రోజు సాయంత్రం గట్టిగా ఏసుకున్నారు.. ఏదో వైరల్ కంటెంట్ కోసం ట్రై చేస్తున్నారు.. పబ్లిసిటీ కోసం ట్రై చేస్తున్నారని అన్నారు" అని తెలిపారు.

"నాకు తెలుసు అలాంటి పిచ్చి పిచ్చి స్టేట్మెంట్ ఇవ్వకూడదని.. కానీ జెన్యూన్ గా హార్ట్ నుంచి వచ్చిందే చెప్పా.. ఈరోజు నా మాట నిలబెట్టుకున్నా.. నిజంగా మంచి సినిమా ఇవ్వడంతో ఆడియన్స్ ఆదరిస్తున్నారు. నాలో ఇప్పుడు ఫుల్ గా కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది.. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నా" అంటూ ధీరజ్ మొగిలినేని పరోక్షంగా చెప్పారు.

ఇక సినిమా విషయానికొస్తే, రెండేళ్ల బ్రేక్ తర్వాత సంతోష్ శోభన్ మంచి కథను ఎంచుకుని ప్రేక్షకుల ముందుకొచ్చారు. తన పాత్రలో ఒదిగిపోయే ఫన్ సీన్స్ లో టైమింగ్‌ తో నవ్వులు పంచడమే కాకుండా, ఎమోషనల్ సీన్స్ లో మెచ్యూర్ నటనతో ఆకట్టుకున్నారు. హీరోయిన్ మానస కూడా తన నటనతో మెప్పించారు. టెక్నికల్‌ గా కూడా సినిమా అలరిస్తోంది. సినిమాటోగ్రఫీ నేచురల్‌ గా ఉండి, రియల్ లొకేషన్లలో తీసిన సీన్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. కొత్త దర్శకుడైనా అశ్విన్ ప్రేమకథను అందంగా తెరకెక్కించారు. మొత్తానికి కపుల్ ఫ్రెండ్లీ యూత్ ను కుటుంబ ప్రేక్షకులను అలరించే క్లీన్ రొమాంటిక్ ఎంటర్టైనర్‌ గా నిలిచిందని చెప్పాలి.



Tags:    

Similar News