'నాగబంధం' టీజర్.. ఎలా ఉందంటే..
టాలీవుడ్‌లో ప్రస్తుతం మైథాలజీ, ఫాంటసీ జానర్ల హవా నడుస్తోంది. ఈ క్రమంలోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘నాగబంధం’ సినిమా అనౌన్స్‌మెంట్ నుండే అందరి దృష్టిని ఆకర్షించింది.;
టాలీవుడ్‌లో ప్రస్తుతం మైథాలజీ, ఫాంటసీ జానర్ల హవా నడుస్తోంది. ఈ క్రమంలోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘నాగబంధం’ సినిమా అనౌన్స్‌మెంట్ నుండే అందరి దృష్టిని ఆకర్షించింది. అభిషేక్ నామ దర్శకత్వంలో విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం తాలూకూ టీజర్‌ను మహా శివరాత్రి సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఒక పురాతన రహస్యాన్ని ఛేదించే ప్రయాణంలా సాగిన ఈ టీజర్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ఇలాంటి సినిమాల్లో డైలాగుల కంటే విజువల్స్ కే ప్రాధాన్యత ఉంటుంది. ‘నాగబంధం’ టీజర్‌లో కూడా ఒక్క మాట కూడా లేకుండా కేవలం విజువల్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తోనే కథలోని విజువల్స్ ని పరిచయం చేశారు. బ్రహ్మ సృష్టి, విష్ణు ధర్మం, శివుని కోపం అనే కాన్సెప్ట్‌తో దైవత్వానికి, విధ్వంసానికి మధ్య జరిగే పోరాటంగా ఈ సినిమా ఉండబోతోందని అర్ధమవుతుంది. అశోక్ కుమార్ విజువల్ ఎఫెక్ట్స్ ప్రొడక్షన్ డిజైన్ టీజర్‌కు ఒక గ్రాండ్ లుక్ ఇచ్చాయి.
తొలి సినిమా ‘పెద్దకాపు’తో నటుడిగా నిరూపించుకున్న విరాట్ కర్ణ, తన రెండో సినిమాకే శివుని అంశతో కూడిన ఒక యోధుడి పాత్రను ఎంచుకోవడం విశేషం. ఈ పాత్ర కోసం చేసిన ఫిజికల్ ట్రాన్స్‌ఫార్మేషన్ టీజర్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా పురాతన దేవాలయాల్లోని నిధులు, వాటిని కాపాడే శక్తుల చుట్టూ అల్లిన కథాంశం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. విదేశీ దండయాత్రల నేపథ్యంలో సాగే నిధుల వేట, అలాగే నాగబంధం ఈ సినిమాకు మెయిన్ హైలెట్ కానున్నట్లు తెలుస్తోంది.
నభా నటేష్, ఐశ్వర్య మీనన్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. మీడియా వర్గాల నుండి కూడా ఈ టీజర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. ఇండియన్ స్క్రీన్ పై ముందెన్నడూ చూడని కొన్ని విజువల్స్ ఇందులో ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ ఖర్చుతో నిర్మిస్తున్నారు.
టీజర్‌లో చూపించిన ఫ్రేమ్స్ చూస్తుంటే దర్శకుడు అభిషేక్ నామ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించారని అర్థమవుతోంది. కేవలం గ్రాఫిక్స్ మీదనే ఆధారపడకుండా కథలోని ఎమోషన్‌ను కూడా విజువల్స్ ద్వారా కన్వే చేసే ప్రయత్నం చేశారు. పాన్ ఇండియా లెవల్లో విడుదల కానున్న ఈ సినిమా వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆధ్యాత్మికతతో కూడిన యాక్షన్ డ్రామాను ఇష్టపడే వారికి ఈ సినిమా ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేలా కనిపిస్తోంది. మొత్తానికి శివరాత్రి వేళ ‘నాగబంధం’ టీజర్ ద్వారా మేకర్స్ గట్టిగానే సౌండ్ చేశారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.