'వాట్స్ అప్ నరేష్' గ్లింప్స్.. యూత్ కు కనెక్ట్ అయ్యేలా ఉందే..
ఇప్పుడు మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న లేటెస్ట్ మూవీ వాట్స్ అప్ నరేష్. బలగం ఫేమ్ కావ్య కళ్యాణ్ రామ్, కొత్త పోరడు ఫేమ్ అన్వేష్ మైకేల్ జంటగా నటిస్తున్న ఆ చిత్రానికి సీవీ విశాల్ దర్శకత్వం వహిస్తున్నారు.;
యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాలకు ఆడియన్స్ లో ఎప్పుడూ స్పెషల్ క్రేజ్ ఉంటుందనే చెప్పాలి. ఆ జోనర్ లో ఇప్పుడు మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న లేటెస్ట్ మూవీ వాట్స్ అప్ నరేష్. బలగం ఫేమ్ కావ్య కళ్యాణ్ రామ్, కొత్త పోరడు ఫేమ్ అన్వేష్ మైకేల్ జంటగా నటిస్తున్న ఆ చిత్రానికి సీవీ విశాల్ దర్శకత్వం వహిస్తున్నారు. సీవీవీ బ్యానర్ పై భాగ్యలక్ష్మి నిర్మిస్తున్నారు.
ఇప్పటికే సినిమా నుంచి మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్.. మంచి రెస్పాన్స్ అందుకుంది. ఆడియన్స్ ను తెగ మెప్పించింది. అందులో హీరో ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్, పెళ్లి గురించి వారి ఆలోచనలు, హీరోయిన్ తో హీరో తొలి పరిచయాన్ని చూపించారు మేకర్స్. తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా రెండో గ్లింప్స్ విడుదల చేసి సినిమాపై మరింత క్రియేట్ చేశారు.
రెండో గ్లింప్స్ లో స్టోరీని మరింత పరిచయం చేశారు మేకర్స్. డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన హీరో–హీరోయిన్లు కాఫీ డేట్ లో తమ గత ఎక్స్పీరియన్స్లు, ప్రేమపై ఫీలింగ్స్ షేర్ చేసుకునే సీన్స్ తో గ్లింప్స్ ప్రారంభవ్వగా.. కన్వర్జేషన్లు చాలా నేచురల్ గా, నవ్వులు పంచేలా సాగుతాయి. డేటింగ్ లైఫ్ ఎలా ఉంది? వంటి డైలాగ్స్ తో ఆసక్తి రేపుతాయి.
ఆ తర్వాత కులం, కుటుంబ ఆలోచనలు, మోడ్రన్ రిలేషన్స్ పై ఇద్దరూ మాట్లాడుకుంటారు. అయితే వారి మాటల్లోనే కథలోని ఎమోషన్, రియాలిటీ కనిపిస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో గ్లింప్స్ వైరల్ గా మారగా.. యూత్ కు కనెక్ట్ అయ్యే డైలాగ్స్ సినిమాలో ఎక్కువగా ఉన్నట్లు సెకెండ్ గ్లింప్స్ ద్వారా తెలుస్తోంది. కామెడీ మధ్య వచ్చే ఎమోషనల్ మూమెంట్స్ ఆకట్టుకున్నాయి.
అదే సమయంలో హీరోహీరోయిన్ల మధ్య మధ్య కెమిస్ట్రీ నేచురల్ గా ఉందనే చెప్పాలి. కావ్య కళ్యాణ్ రామ్ సింపుల్ లుక్ లో మెప్పిస్తే, అన్వేష్ మైఖేల్ నెక్స్ట్ డోర్ బాయ్ ఇమేజ్ తో ఆకట్టుకున్నారు. లవ్ జర్నీ మెల్లగా మొదలై బలపడుతుందో చూపించే సీన్స్.. సినిమాపై మంచి అంచనాలు పెంచుతున్నాయి. అదే సమయంలో టెక్నికల్ గా కూడా గ్లింప్స్ మంచి ఫీల్ ను అందించింది.
సామ్రాన్ సాయి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా చివర్లో వచ్చిన మెలోడీ సాంగ్ మెప్పిస్తోంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ క్లీన్ గా, సాఫ్ట్ టోన్ లో ఉండటం గమనార్హం. ఏదేమైనా గ్లింప్స్ చూస్తుంటే వాట్స్ అప్ నరేష్ మూవీ ప్యూర్ లవ్ స్టోరీతో ఉంటుందని క్లియర్ గా తెలుస్తోంది. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే అంశాలు సినిమాలో ఉన్నాయని అర్థమవుతుంది. మరి సినిమా ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.