• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Video Stories >  'స్పార్క్ L.I.F.E'.....

'స్పార్క్ L.I.F.E'.. హేసమ్ అబ్దుల్ మెలోడీ బాణం​

| విక్రాంత్​ హీరోగా డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్స్​లో భారీ బడ్జెట్​తో తెరకెక్కిన చిత్ర 'స్పార్క్ L.I.F.E'. లవ్ అండ్ సస్పెన్స్, మర్డర్ మిస్టరీ థ్రిల్లర్​గా సినిమాను రూపొందించారు.

By - Tupaki Desk
Update: 2023-10-22 07:21 GMT

విక్రాంత్​ హీరోగా డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్స్​లో భారీ బడ్జెట్​తో తెరకెక్కిన చిత్ర 'స్పార్క్ L.I.F.E'. లవ్ అండ్ సస్పెన్స్, మర్డర్ మిస్టరీ థ్రిల్లర్​గా సినిమాను రూపొందించారు. విక్రాంత్​కు జోడీగా మెహరీన్, రుక్సర్ థిల్లాన్ నటించారు. ఈ సినిమా నవంబర్ 17న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్​ ప్రారంభించిన మూవీటీమ్​ వరుసగా అప్డేట్స్​ను రిలీజ్​ చేస్తోంది.

రీసెంట్​గా ట్రైలర్​ను రిలీజ్​ చేసిన చిత్రబృందం తాజాగా చిత్రంలోని థర్డ్​ సింగిల్​ను రిలీజ్​ చేసింది. జ్ఞాపకాలు పేరుతో పాటను విడుదల చేసింది. అనంత శ్రీరామ్​ లిరిక్స్ అందించారు. ఖుషి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన హేసమ్ అబ్దుల్ వాహబే ఈ సాంగ్​కు మ్యూజిక్ అందించారు. అలాగే ఆయనే ఈ పాటను కృష్ణ లాస్య కలిసి ఆలపించారు. జార్జ్​ థామస్​ పీవీ కూడా సంగీతం కోసం పని చేశారు.

వండర్ ఫుల్​ మెలోడీగా ఈ పాట సాగింది. హేషమ్​ అబ్దుల్​ అందించిన మ్యూజిక్​ ఎంతో వినసొంపుగా ఉంది. అలానే అబ్దుల్ వాహబ్ అండ్ కృష్ణ లాస్య వాయిస్​, ఆలపించిన విధానం కూడా మనసును తాకేలా ఉంది. అనంత్ శ్రీరామ్​ లిరిక్స్​ ఎంతో బాగున్నాయి. విక్రాంత్​-రుక్సర్​ లవ్​ జర్నీని అద్భుతంగా ఎక్స్​ప్రెస్​ చేశాయి. ఇద్దరి మధ్య చూపించిన కెమిస్ట్రీ సాంగ్​కు హైలైట్​గా ఉంది. విజువల్స్​ కూడా ఎంతో కూల్​గా​ ప్లెజెంట్​గా ఉన్నాయి. కొండల మధ్య, పచ్చని చెట్ల మధ్య అద్భుతమైన లొకేషన్స్​లో సన్నివేశాలను చిత్రీకరించారు.

ఇకపోతే సినిమాలో సీనియర్ యాక్టర్లు నాజర్​, సునాసిని మణిరత్నం, వెన్నెల కిశోర్​, సత్య బ్రహ్మాజీ, శ్రీకాంత్ అయ్యంగర్​, చమ్మక్ చంద్ర, అన్నపూర్ణమ్మ, రాజా రవీంద్ర తదితురులు ఇతర పాత్రల్లో నటించారు. మలయాళ సీనియర్ యాక్టర్​ సోమసుందరం ప్రతినాయకుడిగా నటించారు. సినిమాను ఐదు భాషల్లో గ్రాండ్​గా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు.

కాగా, పవర్ ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్​తో రీసెంట్​గా రిలీజైన ట్రైలర్​ ఇప్పటికే సినిమాపై క్యూరియాసిటినీ పెంచింది. నిర్మాతలు ఖర్చుకి వెనుకాడకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఈ చిత్రం ఏ మేరకు ఆడియన్స్​ను ఆకట్టుకుంటుందో..

Full View
Tags:    
  • Gnapakaalusong 
  • Sparklife 
  • Tollywood 
  • Movienews 

Similar News

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

కొత్త ఏటీఎం స్కాం.. విత్ డ్రా చేసినా డబ్బులు రావు.. జర జాగ్రత్త

2026-11-04 06:09 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

పాకెట్ రాకెట్స్ టీజర్.. డబ్బు చుట్టూ ఓ కొత్త ఆట!

2026-11-03 18:01 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

Tupaki Exclusive: రుద్రవరం-పీఎస్ కథలో ఎన్నో ఆసక్తికర మలుపులు.. టీమ్ ఏమంటోంది?

2026-11-03 08:04 GMT

Copyright @2026

Powered by Blink CMS