అమరావతికి జాతీయ స్థాయి గుర్తింపు

Update: 2015-07-18 04:01 GMT
    ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని అమరావతికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. దేశవ్యాప్తంగా ఉన్న పర్యాటక కేంద్రాల్లో  ఒకటిగా గుర్తింపు లభించింది.

అమరావతి చారిత్రక పట్టణమైనప్పటికీ ఇంతవరకు దానికి పెద్దగా గుర్తింపు లేదు.  తాజాగా ఏపీ ప్రభుత్వం ఏపీ రాజధానికి అమరావతి పేరు పెట్టడంతో అమరావతికి విశేష ప్రాచుర్యం దక్కింది. దీంతో పర్యాటక పథ కం కింద దేశంలోని వివిధ పట్టణాలతో పాటు తాజాగా అమరావతినీ చేర్చారు.  దేశవ్యాప్తంగా గయ, గుజరాత్‌లోని ద్వారక, అమృత్‌సర్‌, ఆజ్మీర్‌, కంచి, వేళాంకిని, పూరి, వారణాసి, మధుర, కేదారనాథ్‌, గౌహతిలోని కామాక్యలను ప్రత్యేక యాత్రా కేంద్రాలుగా ఇప్పటికే గుర్తింపు పొందాయి. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని అమరావతిని కూడా ప్రత్యేక యాత్ర కేంద్రంగా గుర్తించింది. ఈవిధంగా గుర్తించిన అమరావతి ప్రత్యేక యాత్రా కేంద్రంలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనుంది. అంతేకాకుండా మౌలిక వసతుల ఏర్పాటుకు కృషి చేస్తుంది. ఇందుకు అవసరమైన నిధులను సైతం కేంద్రం మంజూరు చేస్తుందని అధికారవర్గాలు చెబుతున్నాయి.

వారసత్వ సంపద పరిరక్షణలో భాగంగా కూడా అమరావతి ఎంపికైంది. ఈ విధంగా వారసత్వ సంపద పరిరక్షణ ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌ కూడా ఉన్నట్లు సంబంధిత అధికారవర్గాలు వెల్లడిస్తున్నాయి. వారసత్వ సంపద పరిరక్షణలో భాగంగా గుర్తించిన అమరావతి, వరంగల్‌ను అన్ని విధాలుగాను అభివృద్ధి చేసేందుకు అవసరమైన నిధులను కేటాయిస్తారు. మొత్తానికి ఎంతో ప్రాధాన్యమున్న అమరావతి ఇంతకాలం మరుగున పడిపోయినా ఏపీ కొత్త రాజధానికి ఆ  పేరు పెట్టడం... రాజధాని ప్రాంతంలోనే అమరావతి ఉండడంతో... అమరావతికి చంద్రబాబు ప్రపంచవ్యాప్త ప్రచారం కల్పించడంతో మళ్లీ వెలుగులోకి వచ్చినట్లయింది.
Tags:    

Similar News