ఫ్యామిలీ టూర్ కాదు..దేశం కోసం..బీసీసీఐ రూల్ పై గంభీర్..కోహ్లికి కౌంటర్

కుటుంబం కంటే క్రికెట్ కే ఎక్కువ సమయం కేటాయించాలనే బీసీసీఐ విదేశీ టూర్ రూల్స్.. ఇంగ్లండ్ తో సిరీస్ నుంచి మొదలయ్యాయి.;

Update: 2025-07-11 08:38 GMT

టీమ్ ఇండియా దిగ్గజం విరాట్ కోహ్లి తనకు ఎంతో ఇష్టమైన టెస్టు ఫార్మాట్ కు.. అందులోనూ తను సొంతంగా భారీ భవనం కొనుక్కున్న ఇంగ్లండ్ లో టూర్ కు ముందు.. ఎందుకు వీడ్కోలు పలికాడు.. సుదీర్ఘ ఫార్మాట్ లో ఫామ్ లో లేనిది వాస్తవమే.. స్వదేశంలో న్యూజిలాండ్, ఆపై ఆస్ట్రేలియా టూర్ లో పెద్దగా రాణించలేదు. దీంతోపాటు కొన్ని విషయాల్లో అతడు బీసీసీఐతో రాజీ పడడం లేదు. మరీ ముఖ్యంగా ఆస్ట్రేలియా టూర్ లో బోర్డర్-గావస్కర్ సిరీస్ లో ఓటమి అనంతరం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు కోహ్లికి నచ్చలేదనే ప్రచారం జరిగింది. విదేశీ టూర్ల సందర్భంగా ఫ్యామిలీలను తీసుకెళ్లడం నిబంధనలను విరాట్ తేలిగ్గా తీసుకోలేదు. రూల్స్ విషయంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా కాస్త కటువుగానే ఉండే వ్యక్తి. ఫామ్, పరిస్థితులు చూసిన కోహ్లి.. టెస్టులకు రిటైర్మెంట్ ఇచ్చేశాడు.

కుటుంబం కంటే క్రికెట్ కే ఎక్కువ సమయం కేటాయించాలనే బీసీసీఐ విదేశీ టూర్ రూల్స్.. ఇంగ్లండ్ తో సిరీస్ నుంచి మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే తన తల్లికి అనారోగ్యం బారిన పడడంతో గంభీర్ ఇండియాకు వచ్చాడు. వెంటనే ఇంగ్లండ్ వెళ్లాడు. ఈ పరిణామాల రీత్యా బీసీసీఐ రూల్స్ పై అతడు మాజీ సహచరుడు చతేశ్వర్ పుజారాతో ఇంటర్వ్యూలో మాట్లాడాడు.

కుటుంబాలు అనేవి అందరికీ ముఖ్యమేనని.. అయితే, మనం విదేశీ టూర్లు చేసేది హాలిడే ట్రిప్ లకు కాదని, దేశం కోసం ఆడుతున్న సంగతి మర్చిపోవద్దని గంభీర్ వ్యాఖ్యానించాడు. టూర్ ల రీత్యా డ్రెస్సింగ్ రూమ్ లలో చాలా తక్కువ మందితో ఉండాల్సి ఉంటుందని, అలాంటి సమయంలో సర్దుకుపోయి దేశం గర్వించే విజయం అందించాలని సూచించారు.

ఆటగాళ్లు, సిబ్బందితో కుటుంబాలు ఉండొద్దు అనే నిబంధనలకు తాను వ్యతిరేకం కాదని, కుటుంబాలకు సమయం ఇవ్వాలని.. అదే సమయంలో దేశం కోసం ఆడుతున్నప్పుడు వందశాతం ఎఫర్ట్ పెట్టాలని గంభీర్ వ్యాఖ్యానించాడు. మిగతా వాటికంటే తనకు దేశమే ఎక్కువని, ఇప్పుడు (కొత్త నిబంధనల తర్వాత) అంతా బాగుందని తాను భావిస్తున్నట్లు చెప్పాడు.

గంభీర్ స్పందనను బట్టి చూస్తే.. కోహ్లి టెస్టులకు గుడ్ బై చెప్పడంలో బీసీసీఐ విదేశీ టూర్ రూల్స్ కీలకంగా మారాయని భావించాల్సి ఉంటుంది. అసలే కోహ్లి.. ఫ్యామిలీకి చాలా ప్రాధాన్యం ఇస్తుంటాడు. భార్య అనుష్క శర్మ అతడు ఆడే మ్యాచ్ లకు కూడా వస్తుంటుంది. అలాంటప్పుడు బీసీసీఐ కొత్త రూల్స్ తనకు సరిపడవని భావించి వైదొలగాడని అనుకోవాలి.

Tags:    

Similar News