ఆ వివాదాస్ప‌ద పాక్ క్రికెట‌ర్.. స‌న్ రైజ‌ర్స్ కు ఆడ‌తాడా? లేదా?

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభం సంద‌ర్భంగా ఉండాల్సిన హ‌డావుడి.. ఇటీవ‌ల ఓ పాకిస్థాన్ క్రికెట‌ర్ విష‌యంలో ద‌క్షిణాఫ్రికా లీగ్ (ది హ‌డ్రెండ్ లీగ్) వేలం స‌మ‌యంలో చోటుచేసుకుంది.;

Update: 2026-03-15 16:30 GMT

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభం సంద‌ర్భంగా ఉండాల్సిన హ‌డావుడి.. ఇటీవ‌ల ఓ పాకిస్థాన్ క్రికెట‌ర్ విష‌యంలో ద‌క్షిణాఫ్రికా లీగ్ (ది హ‌డ్రెండ్ లీగ్) వేలం స‌మ‌యంలో చోటుచేసుకుంది. పెహ‌ల్గాం ఉగ్ర‌దాడి, ఆప‌రేష‌న్ సిందూర్, ఆసియా క‌ప్ షేక్ హ్యాండ్స్ వివాదం, టి20 ప్ర‌పంచ క‌ప్ న‌కు ముందు చోటుచేసుకున్న ప‌రిణామాల‌తో ప‌రిస్థితులు తీవ్రంగా మారాయి. పైగా ఆ క్రికెట‌ర్ ను కొనుగోలు చేసింది త‌మిళ‌నాడు మూలాలున్న స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ (ఎస్ఆర్ హెచ్) కావ‌డంతో మ‌రింత దుమారం రేగింది. ఐపీఎల్ మ‌రికొద్ది రోజుల్లో మొద‌లుకానుండ‌గా, ఎప్పుడో జ‌ర‌గాల్సిన లీగ్ హండ్రెడ్ లీగ్. అయితే, ఇంత‌కూ ఆ క్రికెట‌ర్ ప‌రిస్థితి ఏమిటి? స‌న్ రైజ‌ర్స్ యాజ‌మాన్యం కొన‌సాగిస్తుందా? అనేది సందిగ్ధంగా మారింది.

పాకిస్థానే వెన‌క్కుత‌గ్గింది

స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ యాజ‌మాన్యంలోని స‌న్ రైజ‌ర్స్ లీడ్స్ ఫ్రాంచేజీ... ద‌క్షిణాఫ్రికా క్రికెట్ లీగ్ హండ్రెడ్ లీగ్ వేలంలో పాకిస్థాన్ వివాదాస్ప‌ద స్పిన్న‌ర్ అబ్రార్ అహ్మ‌ద్ ను కొనుగోలు చేసింది. బ్యాట‌ర్ ఔటైన‌ప్పుడు వెళ్లు వెళ్లు అంటూ త‌ల‌తోనే సైగ చేసే అబ్రార్ పై ఏమంత స‌ద‌భిప్రాయం లేదు. కానీ, అత‌డిని ద‌క్షిణాఫ్రికా లీగ్ లో స‌న్ రైజ‌ర్స్ లీడ్స్ కొనుగోలు చేసింది. ఇదంతా ప‌క్క‌న‌పెడితే ఇప్పుడు అత‌డికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నుంచి నిర‌భ్యంత‌ర ప‌త్రం (ఎన్వోసీ) రాలేదు. అందుక‌ని ద‌క్షిణాఫ్రికా లీగ్ లో ఆడే అవ‌కాశం లేద‌ని స‌మాచారం.

వెస్టిండీస్ తో టెస్టు సిరీస్ వంక‌

అబ్రార్ టి20 స్పిన్న‌ర్ గానే పేరు తెచ్చుకున్నాడు. కానీ, ఇప్పుడు వెస్టిండీస్ తో రెండు టెస్టుల సిరీస్ పేరు చెప్పి అత‌డికి ఎన్వోసీ ఆపేస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఆ టెస్టు సిరీస్ లో అబ్రార్ కు తుది జ‌ట్టులో చోటు ద‌క్కుతుంద‌ని కూడా చెప్పలేం. కానీ, ది హండ్రెడ్ లీగ్ నుంచి గౌర‌వ‌ప్ర‌దంగా అయినా త‌ప్పించేందుకు ఇదొక మార్గంగా మారింది.

పేరు న‌మోదు చేసింది ఎవ‌రు?

అబ్రార్ అహ్మ‌ద్ పేరును ది హండ్రెడ్ లీగ్ లో న‌మోదు చేసింది అత‌డి మేనేజ‌ర్ అట‌. అయితే, క్రికెట‌ర్ కు తెలియ‌కుండా ఇది జ‌రిగిందా? అనేది తెలియ‌రాలేదు. మ‌రోవైపు త‌న‌కు ఎన్వోసీ వ‌స్తుంద‌ని అబ్రార్ న‌మ్మ‌కంతో ఉన్నాడ‌ని చెబుతున్నారు. ఈ లీగ్ జూలై 21 నుంచి ఆగ‌స్టు 16 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. పాక్ జ‌ట్టు జూలై 15న వెస్టిండీస్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నుంది. ఆగ‌స్టు 7 వ‌ర‌కు ఈ టూర్ కొన‌సాగుతుంది.

Tags:    

Similar News