• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Sports >  12 ఏళ్ల తర్వాత 6 పరుగులకే...

12 ఏళ్ల తర్వాత 6 పరుగులకే క్లీన్ బౌల్డ్..కోహ్లి ఆఫ్ స్టంప్ ఎగిరింది

| రైల్వేస్‌ కు చెందిన పేస్ బౌలర్ 29 ఏళ్ల కుడిచేతి వాటం పేస్ బౌలర్ హిమాన్షు సాంగ్వాన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ అయ్యాడు.

By - Tupaki Desk
Update: 2025-01-31 12:30 GMT

రోహిత్ శర్మ సంగతి తేలిపోయింది.. రిషభ్ పంత్ కథ తెలిసిపోయింది.. శుబ్ మన్ గిల్ ఫామ్ అర్థమైంది.. ఇక మిగిలింది విరాట్ కోహ్లి.. టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ 12 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీ బరిలో దిగితే ఎలా ఆడతాడో చూద్దామని.. సొంతగడ్డపై ఎలా చెలరేగుతాడోనని అనుకుంటే తీవ్రంగా నిరాశపరిచాడు. 2013 అనంతరం రంజీ ట్రోఫీ ఆడుతున్న కోహ్లి పట్టుమని పది పరుగులు చేయలేకపోయాడు. మూడు ఓవర్లు కూడా ఆడలేకపోయాడు.. ఒక్కటే బౌండరీ కొట్టగలిగాడు.

న్యూజిలాండ్ పై స్వదేశంలో, ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై తీవ్రంగా విఫలమైన విరాట్ కోహ్లి.. టెస్టుల్లో ఇక వీడ్కోలు పలకడం ఉత్తమం అన్న అభిప్రాయం వ్యక్తం అవుతున్న విరాట్ కోహ్లి.. ఖాళీగా ఉంటే రంజీ ట్రోఫీలు ఆడక తప్పదన్న బీసీసీఐ ఆదేశంతో బరిలో దిగినా ఫలితం మాత్రం అదే. పేలవ ఫామ్ తో తంటాలు పడుతూ.. 15 బంతులాడి 6 పరుగులకే ఔటయ్యాడు.

రైల్వేస్‌ కు చెందిన పేస్ బౌలర్ 29 ఏళ్ల కుడిచేతి వాటం పేస్ బౌలర్ హిమాన్షు సాంగ్వాన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ అయ్యాడు. ఆఫ్ స్టంప్ పై పడిన బంతిని డ్రైవ్ ఆడే క్రమంలో కోహ్లి బౌల్డయ్యాడు.

పదివేల మంది వస్తే..

కోహ్లి బ్యాటింగ్ చూద్దామని పదివేల మంది అభిమానులు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియానికి వస్తే వారిని కోహ్లి తీవ్రంగా నిరాశపరిచాడు. సాంగ్వాన్ కచ్చితమైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌ లో వేసిన బంతిని ఎదుర్కొనడంలో కోహ్లి తేలిపోయాడు.

కాగా, ఢిల్లీకి గత మ్యాచ్ లోనే కోహ్లి ఆడతాడని భావించిన కోహ్లి మెడ నొప్పితో దూరమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు రైల్వేస్ తో మ్యాచ్ బరిలో దిగాడు. దీనికిముందు వికెట్ కీపర్ బ్యాటర్ పంత్ (ఢిల్లీ), కెప్టెన్ రోహిత్ శర్మ, ఓపెనర్ యశస్వి జైస్వాల్ (ముంబై) పెద్దగా పరుగులు చేయలేదు. గిల్ మాత్రం పంజాబ్ తరఫున ఆడుతూ రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ కొట్టాడు.

Tags:    
  • Viratkohli 
  • Ranjimatch 
  • Cricket 
  • Himanshusangwan 
  • Railwaysbowler 
  • Delhiteam 
  • BCCI 
  • Ranjitrophymatch 

Similar News

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని ఆటగాడు మృతి!

2026-11-04 05:07 GMT

ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని రిక్వెస్టులా? 2027 వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

2026-11-03 08:21 GMT

ముంబై గొంతెమ్మ కోరికలు.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ కు కేకేఆర్ బ్రేక్

2026-11-02 18:26 GMT

ఒక నవ్వు.. ఎంబాపే కొంప మునిగింది.. చైనా నుంచి గట్టి షాక్ తగిలింది..

2026-11-02 13:54 GMT

ముంబై ఇండియన్స్ తో హార్దిక్ పాండ్యా రాజీ.. కానీ ఒక కండీషన్.. తెలుగోడికి అన్యాయం?

2026-10-30 22:30 GMT

మ్యాచ్ మధ్యలో క్రికెటర్ తల్లిపై కామెంట్.. ఏం మనుషులురా మీరు.. ఇదేం దౌర్భాగ్యం

2026-10-30 07:20 GMT

రొనాల్డోను వెనక్కి నెట్టిన గిల్.. గిల్‌కు గ్లోబల్ బ్రాండ్ గుర్తింపు!

2026-10-30 04:01 GMT

Copyright @2026

Powered by Blink CMS