• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Sports >  వైభవ్ సూర్యవంశీ: కారున్న...

వైభవ్ సూర్యవంశీ: కారున్న ’మైనరు’.. తోలాలంటే నాలుగేళ్లు ఆగాలి తమరు

| 13 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ జట్టు రాజస్థాన్ రాయల్స్ కు ఎంపికై ఔరా అనింపించాడు బిహారీ బాలుడు వైభవ్ సూర్యవంశీ.

By - Tupaki Desk
Update: 2025-06-10 15:30 GMT

ఇటీవలి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ లో అత్యంత సంచలనం ఏమిటి..? రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు తొలిసారి టైటిల్ గెలవడమా? ఈ సీజన్ లో 300 కొడుతుంది అనుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్ హెచ్) ప్లేఆఫ్స్ నకు కూడా చేరకపోవడమా..? ఐదుసార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలవడమా..? వాస్తవానికి ఇవేమీ కాదు.

13 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ జట్టు రాజస్థాన్ రాయల్స్ కు ఎంపికై ఔరా అనింపించాడు బిహారీ బాలుడు వైభవ్ సూర్యవంశీ. అంతేకాక, గుజరాత్ టైటాన్స్ వంటి జట్టపై కేవలం 35 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. మొత్తం 38 బంతుల్లో 101 పరుగులు చేశాడు. ఏడు మ్యాచ్ లలో 252 పరుగులు చేశాడు. స్ట్రయిక్ రేట్ 206.55 కావడం విశేషం.

తనపై వెచ్చించిన రూ.1.10 కోట్ల ధరకు న్యాయం కూడా చేశాడు.

ఇటీవల బిహార్ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీని వైభవ్ విమానాశ్రయంలో కుటుంబంతో సహా కలిశాడు. వైభవ్ కు గొప్ప భవిష్యత్ ఉందని.. మోదీనే కొనియాడారు. ఇప్పటికే ఇంగ్లండ్ లో పర్యటించే భారత అండర్ 19 జట్టుకు ఎంపికైన వైభవ్ అక్కడా రాణిస్తే ఈ ఫార్మాట్ లో ప్రపంచ కప్ నకు వెళ్లడం ఖాయం. వచ్చే రంజీ ట్రోఫీ సీజన్ లోనూ వైభవ్ అదరగొడితే 16 ఏళ్ల వయసు లోపే టీమ్ ఇండియాకు ఆడినా ఆశ్చర్యం లేదు.

ఇదంతా అలా ఉంటే.. వైభవ్ సూర్యవంశీకి ఇటీవల కారు గెలుచుకున్నాడు. సహజంగా ఈ వయసు పిల్లలకు పెద్దవాళ్లు రిమోట్ కార్లు గిఫ్ట్ గా ఇస్తుంటారు. కానీ, వైభవ్ పిల్లల్లో పెద్దవాడు కదా..? అతడు కారునే గెలిచాడు. ఐపీఎల్ లో 206 స్ట్రయిక్ రేట్ తో పరుగులు చేసింనదుకు ఈ కారును అందుకున్నాడు. కానీ, వైభవ్ మరో నాలుగేళ్లకు కానీ.. దానిని డ్రైవ్ చేయలేదు. ఇండియాలో వాహనం నడిపేందుకు కనీస వయసు 18 ఏళ్లు కావడమే దీనికి కారణం. అప్పటివరకు లైసెన్సు కూడా ఇవ్వరు. అందుకే వైభవ్ సూర్యవంశీని కారున్న ’మైనరు..’ నాలుగేళ్ల ఆగాలి మీరు అంటున్నారు.

Tags:    
  • VaibhavSuryavanshi 
  • IPLSensation 
  • CricketProdigy 
  • YoungestStar 
  • IndianCricketFuture 
  • IPL2025 
  • BCCI 
  • CricketNews 

Similar News

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని ఆటగాడు మృతి!

2026-11-04 05:07 GMT

ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని రిక్వెస్టులా? 2027 వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

2026-11-03 08:21 GMT

ముంబై గొంతెమ్మ కోరికలు.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ కు కేకేఆర్ బ్రేక్

2026-11-02 18:26 GMT

ఒక నవ్వు.. ఎంబాపే కొంప మునిగింది.. చైనా నుంచి గట్టి షాక్ తగిలింది..

2026-11-02 13:54 GMT

ముంబై ఇండియన్స్ తో హార్దిక్ పాండ్యా రాజీ.. కానీ ఒక కండీషన్.. తెలుగోడికి అన్యాయం?

2026-10-30 22:30 GMT

మ్యాచ్ మధ్యలో క్రికెటర్ తల్లిపై కామెంట్.. ఏం మనుషులురా మీరు.. ఇదేం దౌర్భాగ్యం

2026-10-30 07:20 GMT

రొనాల్డోను వెనక్కి నెట్టిన గిల్.. గిల్‌కు గ్లోబల్ బ్రాండ్ గుర్తింపు!

2026-10-30 04:01 GMT

Copyright @2026

Powered by Blink CMS