• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Sports >  క్రికెటర్ల వయసు మోసం...

క్రికెటర్ల వయసు మోసం నిజమేనా? దానికి ఉన్న పరీక్షేంటి?

| ఇదే సమయంలో పాకిస్థాన్ కే చెందిన హసన్ రాజా అనే కుర్రాడి గురించి కూడా పెద్ద దుమారం రేగింది.

By - Tupaki Desk
Update: 2024-11-26 10:05 GMT

భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ 16 ఏళ్ల వయసుకే టీమ్ ఇండియాలోకి వచ్చేశాడు. 1989లో ఇదో సంచలనం. ఆపై 24 ఏళ్ల పాటు తిరుగులేని విధంగా ఆడాడు. ఈ రికార్డును బ్రేక్ చేయడం ఎవరికీ సాధ్యం కాలేదు. కాకపోతే పాకిస్థాన్ కు చెందిన దిగ్గజ ఆల్ రౌండర్ షాహిద్ ఆఫ్రిది కూడా 16 ఏళ్ల వయసుకే అరంగేంట్ర చేశాడు. 1996లో ఇది కూడా సంచలనమే. అయితే, అప్పట్లో ఆఫ్రిది ఆకారం చూసినవారు ఎవరూ అతడికి 16-17 ఏళ్లు మాత్రమే ఉంటాయని భావించలేదు. అయితే, ఆ వివాదం పెద్దది కాకుండానే సమసిపోయింది. ఆఫ్రిది వయసుపై మరెప్పుడూ చర్చ జరగలేదు. ఇదే సమయంలో పాకిస్థాన్ కే చెందిన హసన్ రాజా అనే కుర్రాడి గురించి కూడా పెద్ద దుమారం రేగింది. సచిన్ రికార్డు బద్దలు కొట్టడానికా అన్నట్లు కేవలం 14 ఏళ్ల వయసులో అతడిని పాకిస్థాన్ జట్టులోకి తీసుకున్నారు. ఇతడిపైనా ఏజ్ ఫ్రాడ్ ఆరోపణలు వచ్చాయి. 1982 మార్చిలో పుట్టిన హసన్ 1996 అక్టోబరు నాటికి (అంటే 14 ఏళ్ల 7 నెలలు) పాకిస్థాన్ తరఫున మ్యాచ్ ఆడాడు. కానీ, హసన్ కెరీర్ ఎక్కువ కాలం కొనసాగలేదు. పాకిస్థాన్ కు 7 టెస్టులు, 16 వన్డేల్లో మాత్రమే ప్రాతినిధ్యం వహించాడు.

సర్ఫరాజ్ పైనా ఆరోపణలు

ప్రస్తుతం టీమ్ ఇండియా టెస్టు జట్టు సభ్యుడైన సర్ఫరాజ్ ఖాన్ వయసు పైనా గతంలో ఆరోపణలు వచ్చాయి. 2011లో ఓ స్కూల్ జట్టు.. సర్ఫ రాజ్ కు 15 ఏళ్లు ఉంటాయని, కానీ 13 ఏళ్ల వాడిగా చూపుతూ ఆడిస్తున్నారని ఆరోపించించింది. తర్వాత పరీక్షల్లో సర్ఫ ఏజ్ సరైనదేనని తేలింది.

ఇప్పుడు బిహార్ కుర్రాడిపై..

‘మా బాబుకు 13 ఏళ్లే..టెస్టుకు సిద్ధం..’’ అంటూ ఐపీఎల్ సెన్సేషన్ తండ్రి. శని, ఆదివారాల్లో ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలంలో తొలి రోజు టీమ్ ఇండియా సీనియర్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ కు రూ.27 కోట్లు దక్కడం సంచలనమైతే.. రెండో సంచలనం వైభవ్ సూర్యవంశీ. బిహార్ కు చెందిన ఈ కుర్రాడి వయసు 13 ఏళ్లే. రాజస్థాన్ రాయల్స్ ఇతడిని రూ.1.10 కోట్లకు వేలంలో దక్కించుకుంది. దీంతో వైభవ్ పేరు మార్మోగుతోంది. ఒకవేళ రాజస్థాన్ తుది జట్టులో చోటు దక్కితే యశస్వి జైశ్వాల్, సంజూ శాంసన్ తో కలిసి వైభవ్ ఆడతాడు.

సంచలనం వెనుకే దుమారం..

మెగా వేలంలో అమ్ముడుపోయిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించిన వైభవ్.. 12 ఏళ్లకే ఫస్ట్‌ క్లాస్‌ అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌ లలో 100 పరుగులు చేశాడు. అక్టోబరులో ఆస్ట్రేలియా అండర్‌-19తో యూత్‌ టెస్టులోనూ ఆడాడు. 62 బంతుల్లోనే సెంచరీ (104 పరుగులు) చేసి ఆకట్టుకున్నాడు. తాజాగా రాజస్థాన్ రాయల్స్ కూడా ఎంపిక చేయడంతో ఎడమచేతి వాటం వైభవ్.. అతి త్వరలోనే టీమ్ ఇండియాకు ఆడతాడని భావిస్తున్నారు. కానీ, ఇతడి వయసు 15 ఏళ్లు అని ఆరోపణలు వస్తున్నాయి.

కాదు 13 మాత్రమే..

తన కుమారుడి వయసు వివాదంపై వైభవ్ తండ్రి సంజీవ్‌ స్పందించారు. వైభవ్‌ కు ఎనిమిదేళ్ల వయసులోనే బీసీసీఐ ఎముక పరీక్ష చేసిందని తెలిపారు. మళ్లీ పరీక్షకు సిద్ధం అని పేర్కొన్నారు. 8 ఏళ్ల వయసులోనే అండర్‌-16 జిల్లా ట్రయల్స్‌ లో రాణించాడని.. బిహార్ లోని సమస్తిపుర్‌ క్రికెట్ అకాడమీలో రాటుదేలాడని వివరించారు. వైభవ్‌ క్రికెటర్‌ గా ఎదిగేందుకు భూమిని అమ్మేశానని పెద్దఎత్తున డబ్బు ఖర్చుపెట్టానని తెలిపారు. తాము ఎవరికీ భయపడమని.. అవసరమైతే మళ్లీ ఎముక పరీక్ష చేయించుకోవచ్చని చెప్పారు.

ఏమిటీ ఎముక పరీక్ష?

క్రికెటర్లనే కాదు ఒక వ్యక్తి వయసు కచ్చితంగా నిర్ధారణ ఎముక పరీక్ష ద్వారా తేలుతుంది. మరీ ముఖ్యంగా క్రీడల్లో వయసు మోసాలు జరుగుతుంటాయి. ఎక్కువ వయసు వారు తక్కువ వయసు కేటగిరీల్లో ఆడేందుకు ఇలా చేస్తుంటారు. అందుకే ఎముక పరీక్ష ద్వారా కచ్చితమైన వయసును తేలుస్తుంటారు.

Tags:    
  • IndianCricketTeam 
  • ICC 
  • BCCI 
  • India 
  • CricketTeam 
  • Cricket 
  • SachinTendulkar 
  • SarfarazKhan 
  • IndianTestTeam 
  • Bihar 
  • IPL 
  • IPL2025 
  • IPLauction 
  • Rishabpant 
  • VaibhavSuryavanshi 
  • RajasthanRoyals 
  • RR 
  • YashasviJaiswal 
  • SanjuSamson 
  • Sanjeev 

Similar News

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని ఆటగాడు మృతి!

2026-11-04 05:07 GMT

ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని రిక్వెస్టులా? 2027 వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

2026-11-03 08:21 GMT

ముంబై గొంతెమ్మ కోరికలు.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ కు కేకేఆర్ బ్రేక్

2026-11-02 18:26 GMT

ఒక నవ్వు.. ఎంబాపే కొంప మునిగింది.. చైనా నుంచి గట్టి షాక్ తగిలింది..

2026-11-02 13:54 GMT

ముంబై ఇండియన్స్ తో హార్దిక్ పాండ్యా రాజీ.. కానీ ఒక కండీషన్.. తెలుగోడికి అన్యాయం?

2026-10-30 22:30 GMT

మ్యాచ్ మధ్యలో క్రికెటర్ తల్లిపై కామెంట్.. ఏం మనుషులురా మీరు.. ఇదేం దౌర్భాగ్యం

2026-10-30 07:20 GMT

రొనాల్డోను వెనక్కి నెట్టిన గిల్.. గిల్‌కు గ్లోబల్ బ్రాండ్ గుర్తింపు!

2026-10-30 04:01 GMT

ముంబై ఇండియన్స్ కొట్టే జట్టు ఐపీఎల్ లో పుట్టలేదిక..

2026-10-29 15:30 GMT

నువ్వు 12 బంతుల్లో 50 కొట్టలేదు.. కానీ.. అభిషేక్ శర్మపై యువరాజ్ సింగ్ ఆసక్తికర ట్వీట్..

2026-10-27 12:38 GMT

జెర్సీ నంబర్ కోసం ఫైటింగ్.. అంతటి సెహ్వాగ్ కు తల్లి, పెళ్లాం పోరు తప్పలేదు నాయనలారా?

2026-10-26 14:39 GMT

మైదానంలో తెలుగు వాగ్వాదం.. టీమిండియాకు విజయాన్ని అందించిన తెలుగు కుర్రాళ్లు!

2026-10-24 14:22 GMT

Copyright @2026

Powered by Blink CMS