• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Sports >  అంపైర్ త‌ల‌కు బంతి...

అంపైర్ త‌ల‌కు బంతి విసిరిన పాక్ ప్లేయ‌ర్..! అద్భుతం అన్న అక్ర‌మ్

| ఇక మ్యాచ్ లో యూఏఈ బ్యాటింగ్ సంద‌ర్భంగా ఏకంగా అంపైర్ రుచిరా ప‌ల్లియుగురుగె వైపు బంతిని విసిరాడు పాక్ ఫీల్డ‌ర్.

By - Tupaki Desk
Update: 2025-09-18 09:32 GMT

భార‌త క్రికెట‌ర్లు షేక్ హ్యాండ్ ఇవ్వ‌క‌పోవ‌డానికి రిఫ‌రీనే కార‌ణ‌మంటూ యూఏఈతో మ్యాచ్ ను బ‌హిష్క‌రించి ఆసియా క‌ప్ నుంచే ఔట్ అయ్యేలా క‌నిపించిన పాకిస్థాన్ న‌వ్వుల పాలైంది. చివ‌ర‌కు మైదానంలో దిగి కాస్త క‌ష్టంగానైనా యూఏఈపై గెలిచింది. కానీ, బుధ‌వారం నాటి మ్యాచ్ కు ముందు బాయ్ కాట్ హైడ్రామా న‌డిపించిన పాక్ చివ‌ర‌కు తోక ముడిచింది.

షేక్ హ్యాండ్.. బాయ్ కాట్..

రిఫ‌రీని త‌ప్పుబ‌డుతూ భార‌త్ తో మ్యాచ్ లో షేక్ హ్యాండ్ అంశాన్ని వివాదంగా మ‌లిచిన పాకిస్థాన్.. యూఏఈతో మ్యాచ్ లో బాయ్ కాట్ చేస్తామ‌ని బెదిరించింది.. ఇక మ్యాచ్ లో యూఏఈ బ్యాటింగ్ సంద‌ర్భంగా ఏకంగా అంపైర్ రుచిరా ప‌ల్లియుగురుగె వైపు బంతిని విసిరాడు పాక్ ఫీల్డ‌ర్. ఇది అంపైర్ త‌ల‌కు త‌గిలింది. దీంతో శ్రీలంక‌కు చెందిన రుచిరా మైదానాన్ని వీడాడు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

అక్ర‌మ్.. నువ్వు కూడానా..?

పాకిస్థాన్ క్రికెట‌ర్ల‌లో వ‌సీం అక్రమ్ అంటే మంచివాడు అనే పేరుంది. అత‌డి కామెంట్రీ కూడా హుందాగా ఉంటుంది. భార‌త మాజీ క్రికెట‌ర్ల‌తోనూ వ‌సీంకు మంచి సంబంధాలే ఉన్నాయి. అయితే, అలాంటివాడు కూడా బుధ‌వారం నాటి మ్యాచ్ లో అంపైర్ కు బంతి త‌గిలిన సంద‌ర్భంలో చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దం అవుతున్నాయి. ఫీల్డ‌ర్ వికెట్ల‌కు దూరంగా బంతిని విస‌ర‌డాన్ని అక్ర‌మ్ త‌ప్పుబ‌ట్టి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. అదే స‌మ‌యంలో అంపైర్ త‌ల‌మీదుగా అద్భుత‌మైన త్రో అని కామెంట్ చేయ‌డం వైర‌ల్ గా మారింది.

కావాల‌నే చేశారా?

శ్రీలంకకు చెందిన అంపైర్ రుచిరా.. గ‌తంలో పాకిస్థాన్ మ్యాచ్ ల‌కు అంపైరింగ్ చేశాడు. ఆ స‌మ‌యంలో ప‌లు ఎల్బీడ‌బ్ల్యూ నిర్ణ‌యాలు వెల్ల‌డించాడు. దీంతోనే అత‌డిని పాక్ ఆట‌గాళ్లు టార్గెట్ చేశారు అనే కామెంట్లు సోష‌ల్ మీడియాలో వ‌స్తున్నాయి. ఇలా ప్ర‌తీకారం తీర్చుకున్నారు అంటూ మ‌రికొంద‌రు కామెంట్ చేస్తున్నారు. ఇక భార‌త అభిమానులైతే.. అరుదైన అంపైర్ రిటైర్డ్ హ‌ర్ట్ అంటూ ఎద్దేవా చేశారు. మొన్న‌టి మ్యాచ్ లో రిఫ‌రీ, నేటి మ్యాచ్ లో అంపైర్ టార్గెట్ అంటూ ఎగ‌తాళి చేశారు.

పాక్ కు చెందిన స‌యీమ్ అయూబ్ బౌలింగ్ లో యూఏఈ బ్యాట్స్ మ‌న్ ధ్రువ్ ప‌రాశ‌ర్ బంతిని కొట్టాడు. సింగిల్ కోసం ప్ర‌య‌త్నిస్తుండ‌గా, ఫీల్డ‌ర్ నాన్ స్ట్ర‌యిక‌ర్ ఎండ్ వైపు బంతిని విసిరాడు. కానీ, అది అంపైర్ రుచిరా త‌ల‌కు త‌గిలింది. అత‌డు మైదానాన్ని వీడ‌డంతో రిజ‌ర్వ్ అంపైర్ గాజీ సొహైల్ మైదానంలోకి వ‌చ్చాడు. ఈ మొత్తం ఎపిసోడ్ లో వ‌సీం అక్ర‌మ్ వంటి దిగ్గ‌జ ఆట‌గాడు చేసిన వ్యాఖ్య‌లే వైర‌ల్ గా మారాయి. విమ‌ర్శ‌ల‌కు తావిచ్చాయి.

Pakistani fielder hit the umpire on the head with the ball and Wasim Akram said “What a throw bull’s eye.”

This is the mentality of every Pakistani Cricketers pic.twitter.com/I08HWvuB8t

— ` (@Atomickohli18) September 17, 2025
Tags:    
  • PakistanCricket 
  • AsiaCup 
  • WasimAkram 
  • ViralVideo 
  • CricketControversy 
  • UmpireIncident 
  • IndiaVsPakistan 
  • CricketDrama 
  • SportsBuzz 
  • UAE 

Similar News

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని ఆటగాడు మృతి!

2026-11-04 05:07 GMT

ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని రిక్వెస్టులా? 2027 వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

2026-11-03 08:21 GMT

ముంబై గొంతెమ్మ కోరికలు.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ కు కేకేఆర్ బ్రేక్

2026-11-02 18:26 GMT

ఒక నవ్వు.. ఎంబాపే కొంప మునిగింది.. చైనా నుంచి గట్టి షాక్ తగిలింది..

2026-11-02 13:54 GMT

ముంబై ఇండియన్స్ తో హార్దిక్ పాండ్యా రాజీ.. కానీ ఒక కండీషన్.. తెలుగోడికి అన్యాయం?

2026-10-30 22:30 GMT

మ్యాచ్ మధ్యలో క్రికెటర్ తల్లిపై కామెంట్.. ఏం మనుషులురా మీరు.. ఇదేం దౌర్భాగ్యం

2026-10-30 07:20 GMT

రొనాల్డోను వెనక్కి నెట్టిన గిల్.. గిల్‌కు గ్లోబల్ బ్రాండ్ గుర్తింపు!

2026-10-30 04:01 GMT

Copyright @2026

Powered by Blink CMS