• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Sports >  మీటింగ్ లో కునుకు.. నేరం...

మీటింగ్ లో కునుకు.. నేరం తనది కాదంటున్న టెంబా!

| వివరాళ్లోకి వెళ్తే... ఈ రోజు నుంచి వన్డే ప్రపంచకప్‌ - 2023 మెగా సమరం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో... బుధవారం ప్రీ వరల్డ్‌ కప్‌ సమావేశం నిర్వహించారు

By - Tupaki Desk
Update: 2023-10-05 07:46 GMT

ఎంతో ముఖ్యమైన మీటింగ్స్ లోనూ, సమావేశాల్లోనూ పలువురు ప్రముఖులు చిన్నపాటి కునుకు తీస్తుంటారు. దానికి సంబందించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుంటాయి. తర్వాత వివరణ ఇచ్చుకుంటారు.. అబ్బే తాను నిద్రపోలేదు, ధ్యానంలో ఉన్నాననో.. నిద్రపోలేదు ఏదో ఆలోచిస్తూన్నాననో చెబుతుంటారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి దక్షిణాఫ్రికా క్రికెట్ కెప్టెన్ కు వచ్చింది.

అవును... ఒక అతిముఖ్యమైన సమావేశంలో తాజాగా పాల్గొన్న సౌతాఫ్రికా క్రికెట్ కెప్టెన్ టెంబా బావుమా కునుకు తీసినట్లుగా కనిపించారు.. దీంతో అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. ఆ పిక్స్ ని తెగ షేర్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ నేపథ్యమంలో ఆ సంఘటనపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు టెంబా. ఇందులో భాగంగా కెమెరా యాంగిల్ తప్పుగా పెట్టారు అంటూ కొత్త లాజిక్ తీశారు.

వివరాళ్లోకి వెళ్తే... ఈ రోజు నుంచి వన్డే ప్రపంచకప్‌ - 2023 మెగా సమరం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో... బుధవారం ప్రీ వరల్డ్‌ కప్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మొత్తం పది జట్ల కెప్టెన్లు హాజరయ్యారు. కెప్టెన్లందరూ వరుసగా కూర్చుని ఉన్నారు. ఈ సమయంలో న్యూజిలాండ్ - శ్రీలంక కెప్టెన్ల మధ్యలో సౌతాఫ్రికా కెప్టెన్ కూర్చుని ఉన్నారు.

ఈ సమయంలో సమావేశం జరుగుతుండగా చక్కగా నిద్రలోకి జారుకున్నట్లు కనిపించాడు దక్షిణాఫ్రికా కెప్టెన్‌ టెంబా. దీనికి సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్‌ గా మారింది. దీంతో ఈ విషయంపై తాజాగా స్పందించాడు టెంబా. ఇందులో భాగంగా... "కెమెరా యాంగిల్‌ సరిగా లేదు. అంతే కానీ, నేను నిద్రపోలేదు" అని ఎక్స్‌ (ట్విటర్) వేదికగా వివరణ ఇచ్చుకున్నాడు.

ఆ సంగతి అలా ఉంటే... ఈ రోజు నుంచి జరిగే వన్డే వరల్డ్‌ కప్‌ ఆతిథ్యం బాధ్యతలను భారత్‌ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమరంలో... భారత్‌ సహా పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక, నెదర్లాండ్స్‌, న్యూజిలాండ్‌, అఫ్గానిస్థాన్‌, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ దేశాల టీం లు పాల్గొంటున్నాయి.

అహ్మదాబాద్‌ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఇంగ్లాండ్‌ - న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌ తో ఈ టోర్నీ ప్రారంభం కానుంది. అక్టోబర్ 8న భారత్‌ తొలి మ్యాచ్‌ లో ఆస్ట్రేలియాను ఢీకొంటుంది. ఆ మ్యాచ్ పై భారీ అంచనాలున్నాయి.

Tags:    
  • Tembabavuma 
  • Southafricacricketer 
  • ODIworldcup2023 
  • Worldcup2023 
  • ICCworldcup2023 
  • Tembabavumasleep 

Similar News

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని ఆటగాడు మృతి!

2026-11-04 05:07 GMT

ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని రిక్వెస్టులా? 2027 వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

2026-11-03 08:21 GMT

ముంబై గొంతెమ్మ కోరికలు.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ కు కేకేఆర్ బ్రేక్

2026-11-02 18:26 GMT

ఒక నవ్వు.. ఎంబాపే కొంప మునిగింది.. చైనా నుంచి గట్టి షాక్ తగిలింది..

2026-11-02 13:54 GMT

ముంబై ఇండియన్స్ తో హార్దిక్ పాండ్యా రాజీ.. కానీ ఒక కండీషన్.. తెలుగోడికి అన్యాయం?

2026-10-30 22:30 GMT

మ్యాచ్ మధ్యలో క్రికెటర్ తల్లిపై కామెంట్.. ఏం మనుషులురా మీరు.. ఇదేం దౌర్భాగ్యం

2026-10-30 07:20 GMT

రొనాల్డోను వెనక్కి నెట్టిన గిల్.. గిల్‌కు గ్లోబల్ బ్రాండ్ గుర్తింపు!

2026-10-30 04:01 GMT

ముంబై ఇండియన్స్ కొట్టే జట్టు ఐపీఎల్ లో పుట్టలేదిక..

2026-10-29 15:30 GMT

నువ్వు 12 బంతుల్లో 50 కొట్టలేదు.. కానీ.. అభిషేక్ శర్మపై యువరాజ్ సింగ్ ఆసక్తికర ట్వీట్..

2026-10-27 12:38 GMT

జెర్సీ నంబర్ కోసం ఫైటింగ్.. అంతటి సెహ్వాగ్ కు తల్లి, పెళ్లాం పోరు తప్పలేదు నాయనలారా?

2026-10-26 14:39 GMT

Copyright @2026

Powered by Blink CMS