• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Sports >  పుష్ప 3లో టీమ్ ఇండియా యువ...

పుష్ప 3లో టీమ్ ఇండియా యువ క్రికెటర్..? కెప్టెన్ సూర్యకు షాక్

| దక్షిణాఫ్రికాతో సిరీస్ లో అతడు భారీ జుట్టుతో కనిపించాడు. దీన్ని చూసి కెప్టెన్ సూర్య ఆట పట్టించాడు చివరి మ్యాచ్ తర్వాత వీరిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.

By - Tupaki Desk
Update: 2024-11-17 12:30 GMT

టీమ్ ఇండియా దక్షిణాఫ్రికాతో ఇటీవల నాలుగు మ్యాచ్ ల టి20 సిరీస్ ను 3-1తో గెలుచుకుంది. ఇందులో రెండో మ్యాచ్ లో మాత్రమే ఓడిపోయింది. అది కూడా కొద్ది తేడాతో. అయితే, చివరి రెండు మ్యాచ్ లలో మాత్రం చెలరేగి ఆడి సిరీస్ ను దక్కించుకుంది. ఈ విజయాల్లో మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హైదరాబాదీ యువ బ్యాట్స్ మన్ తిలక్ వర్మ గురించి. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ను అడిగి మరీ వన్ డౌన్ లో వచ్చిన తిలక్.. రెండు మ్యాచ్ ల్లోనూ అజేయ సెంచరీలు నమోదు చేశాడు. అతి తక్కువ వయసు (22 ఏళ్ల 5 రోజులు)లో టి20లో సెంచరీ కొట్టిన బ్యాట్స్ మన్ రికార్డును.. టి20ల్లో సెంచరీ చేసిన తొలి తెలుగు బ్యాట్స్ మన్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాక.. వరుసగా రెండు సెంచరీలు చేసిన తొలి తెలుగు బ్యాట్స్ మన్, రెండో ఇండియన్ బ్యాట్స్ మన్ గా చరిత్రలో నిలిచాడు.

సూర్య చాటున పేరు మార్మోగుతోంది..

తిలక్ వర్మ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ క్రికెట్ జట్టు సభ్యుడు. ఇదే జట్టులో సభ్యుడు స్టార్ బ్యాట్స్ మన్, టి20 కెప్టెన్ సూర్య. ఇక తిలక్ టి20 జట్టులోకి దాదాపు రెండేళ్ల కిందట వచ్చాడు. జట్టులో స్థానం మాత్రం సుస్థిరం కాలేదు. తాజాగా టి20 సిరీస్ తో మాత్రం వెనక్కుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రానంతగా రాణించాడు. మరోవైపు ముంబై సభ్యుడిగా సూర్యతో ఉన్న అనుంబంధం టీమ్ ఇండియాలోకి వచ్చాక తిలక్ కు ఉపయోగపడుతోంది. వీరిద్దరూ సొంత అన్నదమ్ముల్లా కనిపిస్తున్నారు. దక్షిణాఫ్రికాతో ఇటీవలి టి20 సిరీస్ లో తిలక్ అడిగిన వెంటనే సూర్య తన వన్ డౌన్ స్థానాన్ని ఇచ్చేయడం విశేషం. దీన్ని తిలక్ తన భవిష్యత్ కు పునాది చేసుకున్నాడు. అంతేకాదు.. సెంచరీలు సాధించాక సూర్యకు గాల్లో ముద్దులు పంపాడు.

మనోడు ఫ్యాషన్ లోనూ ముందే..

ఈ కాలం కుర్రాడిలా తిలక్ వర్మ ఫ్యాషన్ ఫాలో అవుతున్నాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్ లో అతడు భారీ జుట్టుతో కనిపించాడు. దీన్ని చూసి కెప్టెన్ సూర్య ఆట పట్టించాడు. చివరి మ్యాచ్ తర్వాత వీరిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. తిలక్.. జుట్టును చూస్తూ ఏంటి ఫుష్ప -3లో నటించాలని అనుకుంటున్నావా..? అందరూ నిన్ను అల్లు అర్జున్ అని పిలుస్తున్నారు ఏంటి..? అని సూర్య ప్రశ్నించాడు. తిలక్ హెయిర్ స్టైల్ అచ్చం పుష్పలో అల్లు అర్జున్ స్టయిల్ లా ఉందన్నాడు. అక్కడ తెలుగు సూపర్ స్టార్.. ఇక్కడ నువ్వు?? అంటూ ఆటపట్టించాడు. దీనికి తిలక్ స్పందిస్తూ ఇప్పుడిప్పుడే జుట్టు పెంచుతున్నానని, అందరూ అల్లు అర్జున్ అని పిలుస్తున్నారని చెప్పుకొచ్చాడు. జుట్టు పెంచుకోవడం తనకు ఇష్టం అని తెలిపాడు. పొడవైన జుట్టుపై హెల్మెట్ పెట్టుకుంటే మస్త్ అనిపిస్తుందని.. అందుకే జుట్టు పెంచుతున్నానని వివరణ ఇచ్చాడు.

పుష్ప ట్రైలర్ రిలీజ్ నేపథ్యంలో

ప్రస్తుతం తన పని బాల్, బ్యాట్ తో మైదానంలో రాణించడమేనని పుష్ప-3 సినిమాలో నటించడం లేదని తిలక్ చెప్పాడు. కాగా, తిలక్-సూర్య మధ్య సాగిన ఈ సరదా సంభాషణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆదివారం పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ నేపథ్యంలో దీన్ని మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఖుషీఖుషీగా ఉన్నారు. డిసెంబరులో పుష్ప2 విడుదల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ‘పుష్ప’ ఫీవర్ నడుస్తోంది. ఆదివారం బిహార్ రాజధాని పట్నాలో ట్రయిలర్ రిలీజ్ చేయనున్నారు.

Tags:    
  • Suryakumaryadav 
  • Teamindiat20captain 
  • Tilakvarma 
  • Pushpa3 
  • Alluarjun 
  • Pushpa2 
  • Tollywood 
  • Tilakvarmahair 
  • Pushpa2trailer 
  • SKY 
  • Indiasouthafricaseries 

Similar News

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని ఆటగాడు మృతి!

2026-11-04 05:07 GMT

ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని రిక్వెస్టులా? 2027 వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

2026-11-03 08:21 GMT

ముంబై గొంతెమ్మ కోరికలు.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ కు కేకేఆర్ బ్రేక్

2026-11-02 18:26 GMT

ఒక నవ్వు.. ఎంబాపే కొంప మునిగింది.. చైనా నుంచి గట్టి షాక్ తగిలింది..

2026-11-02 13:54 GMT

ముంబై ఇండియన్స్ తో హార్దిక్ పాండ్యా రాజీ.. కానీ ఒక కండీషన్.. తెలుగోడికి అన్యాయం?

2026-10-30 22:30 GMT

మ్యాచ్ మధ్యలో క్రికెటర్ తల్లిపై కామెంట్.. ఏం మనుషులురా మీరు.. ఇదేం దౌర్భాగ్యం

2026-10-30 07:20 GMT

రొనాల్డోను వెనక్కి నెట్టిన గిల్.. గిల్‌కు గ్లోబల్ బ్రాండ్ గుర్తింపు!

2026-10-30 04:01 GMT

ముంబై ఇండియన్స్ కొట్టే జట్టు ఐపీఎల్ లో పుట్టలేదిక..

2026-10-29 15:30 GMT

Copyright @2026

Powered by Blink CMS