• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Sports >  ఆశ్చర్యం.. పదివేల టెస్టు...

ఆశ్చర్యం.. పదివేల టెస్టు పరుగులు సాధించిన ‘స్పిన్నర్’

| 15 ఏళ్ల తర్వాత ఏకంగా టెస్టుల్లోనే 10 వేల పరుగులు పూర్తి చేశాడు. టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, న్యూజిలాండ్ మేటి బ్యాట్స్ మన్ కేన్ విలియమ్సన్ ల కంటే ముందే ఈ ఘనతను అందుకున్నాడు.

By - Tupaki Desk
Update: 2025-01-30 12:30 GMT

అతడు అండర్ 19 ప్రపంచ కప్ ఆడాడు.. కానీ, స్పెషలిస్ట బ్యాటర్ గా కాదు..

అతడు టెస్టు జట్టులోకి స్పిన్నర్ గానే వచ్చాడు.. తొలి మ్యాచ్ లో 8వ స్థానంలో బ్యాటింగ్ కు దిగాడు.

కట్ చేస్తే 15 ఏళ్ల తర్వాత ఏకంగా టెస్టుల్లోనే 10 వేల పరుగులు పూర్తి చేశాడు. టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, న్యూజిలాండ్ మేటి బ్యాట్స్ మన్ కేన్ విలియమ్సన్ ల కంటే ముందే ఈ ఘనతను అందుకున్నాడు. మరో రెండు, మూడేళ్లు క్రికెట్లో కొనసాగే వీలున్న అతడు 40పైగా సెంచరీలు, మూడు వేల పరుగులు చేసే అవకాశం కనిపిస్తోంది.

ఇటీవల భారత్ తో జరిగిన బోర్డర్-గావస్కర్ టెస్టు (బీజీటీ) సిరీస్ లో 9999 పరుగుల వద్ద ఆగిపోయిన ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్.. తాజాగా శ్రీలంకతో మొదలైన టెస్టు సిరీస్ లో ఎదుర్కొన్న తొలి బంతికే సింగిల్ తీయడం ద్వారా టెస్టుల్లో 10 వేల పరుగులు సాధించిన బ్యాట్స్ మన్ గా రికార్డుల్లోకి ఎక్కాడు. అయితే, స్మిత్ కెరీర్ మొదలైన తీరు చూస్తే ఇది అద్భుతం అనే అనుకోవాలి.

2007లో దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ రిటైర్ అయ్యాక ఆస్ట్రేలియా కొన్నాళ్లు మంచి స్పిన్నర్ లేని లోటును ఎదుర్కొంది. ఇలాంటి సమయంలోనే లెగ్‌ స్పిన్నర్‌ గా జట్టులోకి వచ్చాడు స్టీవ్ స్మిత్. ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్ లో న్యూసౌత్‌ వేల్స్‌ తరపున ఆడే స్మిత్‌.. వార్న్ కు ప్రత్యామ్నాయంగా కనిపించాడు. స్పిన్నర్‌ గానే అతడికి ఆస్ట్రేలియా జట్టులో చోటు దక్కింది. ఇలా.. 2010లో పాకిస్థాన్‌ పై 8వ స్థానంలో బ్యాటింగ్‌ కు దిగాడు స్మిత్. రెండో మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌ లో 77 పరుగులు సాధించాడు. అప్పటికీ మూడేళ్లు అతడికి బ్యాటర్ గా సరైన గుర్తింపు రాలేదు. 2013లో మొహాలీలో భారత్‌ పర్యటనలో స్పిన్ కు పేరుగాంచిన పిచ్ పై అయిదో స్థానంలో వచ్చి 92 పరుగులు చేయడంతో స్మిత్ వెలుగులోకి వచ్చాడు. తొలి 20 టెస్టుల్లో 40 సగటుతో 1361 పరుగులు చేసిన స్మిత్‌.. తర్వాత 50 టెస్టుల్లో 74.36 సగటుతో 5652 పరుగులు సాధించాడు. గత 45 టెస్టుల్లో 44.78 సగటుతో 3090 పరుగులు రాబట్టాడు.

నాలుగో ఆస్ట్రేలియన్.. ప్రపంచంలో 15వ వాడు

టెస్టుల్లో 10 వేల పరుగులు చేసిన 15వ బ్యాటర్ స్మిత్. 115 టెస్టుల్లో ఈ ఘనత సాధించాడు. శ్రీలంకతో శ్రీలంకలో బుధవారం మొదలైన తొలి టెస్టులో స్మిత్ 35వ సెంచరీ కొట్టాడు. అత్యధిక టెస్టు సెంచరీల్లో స్మిత్ ఆరో స్థానంలో ఉన్నాడు. మాజీ కెప్టెన్ పాంటింగ్‌ (41) తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన ఆస్ట్రేలియన్ ఇతడే. పాంటింగ్‌ (13,378), అలన్‌ బోర్డర్‌ (11,174), స్టీవ్‌ వా (10,927) తర్వాత పదివేల పరుగులు సాధించిన నాలుగో ఆస్ట్రేలియన్ బ్యాటర్ స్మిత్‌ కావడం విశేషం. టెస్టుల్లో సచిన్‌ (51), కలిస్‌ (45), పాంటింగ్‌ (41), సంగక్కర (38), రూట్, ద్రవిడ్‌ (36) తర్వాత అత్యధిక సెంచరీలు స్మిత్ వే. వీరిలో రూట్ మాత్రమే ఇప్పుడు క్రికెట్ లో కొనసాగుతున్నాడు.

కొసమెరుపు: స్పిన్నర్ గా జట్టులోకి వచ్చిన స్మిత్.. బ్యాటర్ గా కుదురుకున్నాక పెద్దగా బంతి పట్టలేదు. 62 టెస్టు ఇన్నింగ్స్‌ లలో మాత్రమే అతడు బౌలింగ్‌ చేశాడు. 19 వికెట్లు తీశాడు

Tags:    
  • Stevesmith 
  • Australiacricketer 
  • Aussie 
  • Stevesmithstats 
  • Testcricket 
  • Srilankavsaustralia 
  • Smudge 
  • Stevesmithrecords 
  • Viratkohli 
  • Kanewilliamson 
  • Cricket 

Similar News

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని ఆటగాడు మృతి!

2026-11-04 05:07 GMT

ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని రిక్వెస్టులా? 2027 వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

2026-11-03 08:21 GMT

ముంబై గొంతెమ్మ కోరికలు.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ కు కేకేఆర్ బ్రేక్

2026-11-02 18:26 GMT

ఒక నవ్వు.. ఎంబాపే కొంప మునిగింది.. చైనా నుంచి గట్టి షాక్ తగిలింది..

2026-11-02 13:54 GMT

ముంబై ఇండియన్స్ తో హార్దిక్ పాండ్యా రాజీ.. కానీ ఒక కండీషన్.. తెలుగోడికి అన్యాయం?

2026-10-30 22:30 GMT

మ్యాచ్ మధ్యలో క్రికెటర్ తల్లిపై కామెంట్.. ఏం మనుషులురా మీరు.. ఇదేం దౌర్భాగ్యం

2026-10-30 07:20 GMT

రొనాల్డోను వెనక్కి నెట్టిన గిల్.. గిల్‌కు గ్లోబల్ బ్రాండ్ గుర్తింపు!

2026-10-30 04:01 GMT

Copyright @2026

Powered by Blink CMS