• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Sports >  ఆయన...

ఆయన తిట్టేస్తున్నాడు..దిగ్గజ క్రికెటర్ పై బీసీసీఐకి రోహిత్ ఫిర్యాదు

| సీనియర్లు, క్రికెట్ విశ్లేషకుల పట్ల అత్యంత హుందాగా వ్యవహరించే రోహిత్ నుంచి ఇలాంటి ఆరోపణ రావడం అందరినీ ఆశ్చర్యపరిచేదే.

By - Tupaki Desk
Update: 2025-01-28 15:30 GMT

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ దిగ్గజ క్రికెటర్ పై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కు ఫిర్యాదు చేశాడట.. కామెంటేటర్ గా, విశ్లేషకుడిగా ఉన్నఆయన తన వ్యాఖ్యలతో తివ్రంగా బాధిస్తున్నాడని కంప్లంయింట్ పెట్టాడట.. సీనియర్లు, క్రికెట్ విశ్లేషకుల పట్ల అత్యంత హుందాగా వ్యవహరించే రోహిత్ నుంచి ఇలాంటి ఆరోపణ రావడం అందరినీ ఆశ్చర్యపరిచేదే. సాధారణ పరిస్థితుల్లో అయితే రోహిత్ స్పందించకపోయేవాడేమో..? ఓ వైపు జట్టు దారుణ ఓటములు.. మరోవైపు బ్యాట్స్ మన్ గా తీవ్ర వైఫల్యాలు.. దీనికితోడు ఆ దిగ్గజ క్రికెటర్ విమర్శలు.. అందుకనే రోహిత్ ఉండబట్టలేకపోయాడని తెలుస్తోంది.

న్యూజిలాండ్ తో సొంతగడ్డపై టెస్టు సిరీస్ లో చరిత్రలో లేని విధంగా 0-3తో ఓటమి.. ఆపై ఆస్ట్రేలియాలో బోర్డర్-గావస్కర్ సిరీస్ లో 1-3తో ఓటమి.. దీంతోపాటు బ్యాట్స్ మన్ గా రోహిత్ దారుణ ప్రదర్శనతో అభిమానులు, మాజీలు, సెలక్షన్ కమిటీ అందరూ విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే భారత బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గావస్కర్ కూడా రోహిత్, టీమ్ ఇండియా ప్రదర్శనపై మండిపడ్డారు. ఆస్ట్రేలియాతో సిరీస్ లో గావస్కర్ కామెంటేటర్ గా వ్యవహరించారు. ఓ టెస్టులో వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ నిర్లక్ష్య షాట్ తో ఔట్ కావడంతో గావస్కర్ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ‘‘స్టుపిడ్.. స్టుపిడ్.. స్టుపిడ్’’ అంటూ కామెంటరీ బాక్స్ లోనే గట్టిగా అరిచారు. ఇదే కాదు భారత జట్టుపై చాలా విషయాల్లో గావస్కర్ హ్యాపీగా లేరని తెలుస్తోంది.

గావస్కర్ అంటే గావస్కరే. కెరీర్ కొనసాగినప్పుడు కానీ, ఇప్పుడు కానీ

క్రికెట్ క్రీడా పాటవంలో ఆయనను మించినవారు లేరు. గావస్కర్ చేసే విమర్శలు కూడా అంతే కటువుగా ఉంటాయి. బ్యాట్స్ మన్ రన్ తీసే సందర్భంలో బ్యాట్ ను ముందుకుచాస్తూ క్రీజు వరకు తీసుకెళ్లకుండగా ఔట్ అయితే గావస్కర్ సహించరు. స్పిన్ బౌలర్ ఎవరైనా నో బాల్ వేస్తే గావస్కర్ కు కోపం నషాళానికి ఎక్కుతుంది. ఇలాంటి సందర్భాల్లో ముంబై గల్లీ క్రికెటర్లతో టీమ్ ఇండియా ఆటగాళ్లను పోల్చి తన కసినంతా చాటుతారు గావస్కర్. తాజాగా టీమ్ ఇండియా ప్రదర్శనపైనా అంతే నిష్కర్షగా విశ్లేషణలు, వ్యాఖ్యలు చేస్తున్నారు గావస్కర్. అయితే, ఇవి తమను హర్ట్ చేస్తున్నాయంటూ రోహిత్ శర్మ బీసీసీఐకి ఫిర్యాదు చేశాడట.

ప్రొఫెషనల్ కామెంటేటర్ మాత్రమే కాదు.. దిగ్గజ క్రికెటర్ అయిన సునీల్ గావస్కర్ ను బీసీసీఐ మందలించే సాహసం చేయదు. కాకపోతే.. క్రికెటర్ల ఆత్మ స్థయిరాన్ని దెబ్బతీసే స్థాయిలో కాకుండా సున్నితంగా విమర్శలు చేయమంటూ సూచన చేస్తుందేమో..?

Tags:    
  • Rohitsharma 
  • Sunilgavaskar 
  • Teamindia 
  • BCCI 
  • Indiancricketteam 
  • BGT 
  • Testseries 
  • Complaints 
  • Seniorcricketer 
  • Teamindiaplayers 
  • Cricket 

Similar News

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని ఆటగాడు మృతి!

2026-11-04 05:07 GMT

ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని రిక్వెస్టులా? 2027 వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

2026-11-03 08:21 GMT

ముంబై గొంతెమ్మ కోరికలు.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ కు కేకేఆర్ బ్రేక్

2026-11-02 18:26 GMT

ఒక నవ్వు.. ఎంబాపే కొంప మునిగింది.. చైనా నుంచి గట్టి షాక్ తగిలింది..

2026-11-02 13:54 GMT

ముంబై ఇండియన్స్ తో హార్దిక్ పాండ్యా రాజీ.. కానీ ఒక కండీషన్.. తెలుగోడికి అన్యాయం?

2026-10-30 22:30 GMT

మ్యాచ్ మధ్యలో క్రికెటర్ తల్లిపై కామెంట్.. ఏం మనుషులురా మీరు.. ఇదేం దౌర్భాగ్యం

2026-10-30 07:20 GMT

రొనాల్డోను వెనక్కి నెట్టిన గిల్.. గిల్‌కు గ్లోబల్ బ్రాండ్ గుర్తింపు!

2026-10-30 04:01 GMT

ముంబై ఇండియన్స్ కొట్టే జట్టు ఐపీఎల్ లో పుట్టలేదిక..

2026-10-29 15:30 GMT

Copyright @2026

Powered by Blink CMS