• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Sports >  ఎజెండా ప్రకారం...

ఎజెండా ప్రకారం కామెంట్రీ.. క్రికెట్ జర్నలిజం..రోహిత్ నిప్పులు

| భారతీయ కామెంటేటర్లు కొందరు ఓ క్రికెటర్ టాలెంట్ ను పట్టించుకోకుండా, అతడి వ్యక్తిగత జీవితాన్నిటార్గెట్ చేస్తుంటారని, ఇది తగదని రోహిత్ అన్నాడు.

By - Tupaki Desk
Update: 2025-05-08 14:30 GMT

భారత క్రికెటర్ల విషయంలో ఎప్పుడూ విదేశీ కామెంటేటర్లు, విదేవీ మీడియా పక్షపాతం చూపుతుందనే విమర్శలు వస్తుంటాయి. కొందరిని టార్గెట్ చేస్తారనే ఆరోపణలు వినిపిస్తాయి. కానీ, ఈసారి భారత కామెంటేటర్లనే తప్పుబట్టాడు టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ. ఐపీఎల్ జరుగుతుండగానే టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచిన రోహిత్.. ఓ పాడ్ కాస్ట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ సంచలనం రేపుతోంది.

భారతీయ కామెంటేటర్లు కొందరు ఓ క్రికెటర్ టాలెంట్ ను పట్టించుకోకుండా, అతడి వ్యక్తిగత జీవితాన్నిటార్గెట్ చేస్తుంటారని, ఇది తగదని రోహిత్ అన్నాడు. అసలు కామెంటేటర్లకే ఏదో ఒక ఎజెండా ఉంటుందని తెలిపాడు. కొన్నిసార్లు విదేశీ కామెంటేటర్ల తీరే బాగుంటుందని కితాబిచ్చాడు.

కామెంట్రీనే కాదు.. భారత్ లో క్రికెట్ జర్నలిజం తీరు కూడా మారాల్సిన ఆవశ్యకత ఉందని రోహిత్ పేర్కొన్నాడు. అసలు వార్తలను వదిలేసి.. కొందరు కావాలనే వివాదాలు రేపే ఉద్దేశంలో ఉంటారని, నాణ్యమైన జర్నలిజం తగ్గిపోతుందనే ఆవేదన వ్యక్తం చేశాడు.

అంతా లైక్ లు.. వ్యూస్ కోసమే..

ఆట గురించి చర్చించే రోజులు పోయి.. ఇప్పుడు ఎక్కువ లైక్స్, వ్యూస్ గురించి చూసే రోజులు వచ్చాయని రోహిత్ నిందించాడు.

వ్యూహాలు, విశ్లేషణ వదిలేసి ఇందుకోసం ఆట వదిలేసి.. వివాదాలను తెరపైకి తెస్తున్నారని తప్పుబట్టాడు.

మసాలా పూసి మారేడు కాయ..

వాస్తవానికి చాలామంది అభిమానులు క్రికెట్ గురించి తెలుసుకోవడానికే ఆసక్తిగా ఉంటారని.. అలాంటివారికి మసాలా పూసి కామెంటేటర్లు చేసే కామెంట్రీ ఎందుకని రోహిత్ ప్రశ్నించాడు. ప్లేయర్ ఫామ్ ఎందుకు కోల్పోయాడు? ఏం తప్పులు చేశాడు? అనేవాటినే అభిమానులు చూస్తారని.. వ్యక్తిగత విషయాలు కాదని తెలిపాడు. ఇవన్నీ చూసుకోకుండా కామెంటేటర్లు మాట్లాడేస్తూ ఉంటారని చెప్పాడు. విఫలమైతే విమర్శలు చేయొచ్చని.. దానికీ ఓ పద్ధతి ఉంటుందని రోహిత్ వాపోయాడు.

ఇటీవలి కాలంలో రోహిత్ శర్మ ఫిట్ నెస్ గురించి.. వైఫల్యాల మీద.. అతడు టెస్టులకు పనికిరాడనే విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. వీటిపై ఓసారి స్టేడియంలోనే రోహిత్ తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇప్పుడు రిటైర్మెంట్ సందర్భంగా అతడి పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూ వైరల్ అవుతోంది. ఇంతకూ టార్గెట్ అయిన ప్లేయర్ ఎవరూ అంటే..? అది రోహిత్ శర్మనే అనుకోవాలి.

Tags:    
  • RohitSharma 
  • IndianCricket 
  • IPL2025 
  • CricketCommentary 
  • MediaBias 
  • CricketControversy 
  • RohitPodcast 
  • CricketJournalism 
  • IndianMedia 
  • TeamIndiaCaptain 
  • CricketAnalysis 
  • RohitRetirement 
  • MumbaiIndians 

Similar News

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని ఆటగాడు మృతి!

2026-11-04 05:07 GMT

ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని రిక్వెస్టులా? 2027 వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

2026-11-03 08:21 GMT

ముంబై గొంతెమ్మ కోరికలు.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ కు కేకేఆర్ బ్రేక్

2026-11-02 18:26 GMT

ఒక నవ్వు.. ఎంబాపే కొంప మునిగింది.. చైనా నుంచి గట్టి షాక్ తగిలింది..

2026-11-02 13:54 GMT

ముంబై ఇండియన్స్ తో హార్దిక్ పాండ్యా రాజీ.. కానీ ఒక కండీషన్.. తెలుగోడికి అన్యాయం?

2026-10-30 22:30 GMT

మ్యాచ్ మధ్యలో క్రికెటర్ తల్లిపై కామెంట్.. ఏం మనుషులురా మీరు.. ఇదేం దౌర్భాగ్యం

2026-10-30 07:20 GMT

రొనాల్డోను వెనక్కి నెట్టిన గిల్.. గిల్‌కు గ్లోబల్ బ్రాండ్ గుర్తింపు!

2026-10-30 04:01 GMT

ముంబై ఇండియన్స్ కొట్టే జట్టు ఐపీఎల్ లో పుట్టలేదిక..

2026-10-29 15:30 GMT

నువ్వు 12 బంతుల్లో 50 కొట్టలేదు.. కానీ.. అభిషేక్ శర్మపై యువరాజ్ సింగ్ ఆసక్తికర ట్వీట్..

2026-10-27 12:38 GMT

Copyright @2026

Powered by Blink CMS