• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Sports >  "ఓం సాయిరాం"... ఐపీఎల్ ...

"ఓం సాయిరాం"... ఐపీఎల్ అన్ సోల్డ్ ఆటగాడి ఆసక్తికర పోస్ట్!

| కాలం కలిసి రాకపోతే ఎంత పెద్ద ఓడ అయినా బండి అయిపోతుందని.. అన్నీ అనుకూలంగా సాగితే బండి కూడా ఓడగా మారిపోతుందని అంటుంటారు.

By - Tupaki Desk
Update: 2024-12-17 16:58 GMT

కాలం కలిసి రాకపోతే ఎంత పెద్ద ఓడ అయినా బండి అయిపోతుందని.. అన్నీ అనుకూలంగా సాగితే బండి కూడా ఓడగా మారిపోతుందని అంటుంటారు. అందుకే... ప్రధానంగా సినిమా, క్రికెట్, రాజకీయం వంటి భారీ రంగాల్లో గుమ్మడికాయ అంత టాలెంట్ తో పాటు ఆవగింజంత అదృష్టం కూడా మస్ట్ అని చెబుతుంటారు. పృథ్వీ షా గురించి ఇప్పుడు ఇదే చర్చ అని అంటున్నారు!

అవును... టీమిండియా యంగ్ బ్యాటర్ పృథ్వీ షా కు ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తందని అంటున్నారు. ఇప్పటికే జాతీయ జట్టుకు దురమైన షా.. ఐపీఎల్ మెగా వేలంలోనూ అన్ సోల్డ్ గా మిగిలిపోవడం గమనార్హం. ఇక ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై చాంపియన్ గా నిలిచినప్పటికీ అందులో పృథ్వీషా వాటా అతి స్వల్పం అనే చెప్పాలి!

ఆ ట్రోఫీలో భాగంగా 9 మ్యాచ్ లలో 197 పరుగులు మాత్రమే చేసిన పృథ్వీ షా... మధ్యప్రదేశ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 10 పరుగులకే ఔటయ్యాడు. దీంతో... ఈ నెల 21 నుంచి ప్రారంభంకానున్న విజయ్ హజారే ట్రోఫీ మొదటి మూడు మ్యాచ్ లకు ప్రకటించిన ముంబై జట్టులో పృథ్వీ షాకు చోటు దక్కలేదు.

ఇలా విజయ్ హజారే ట్రోఫీ మొదటి మూడు మ్యాచ్ లకూ తనను ఎంపిక చేయకపోవడంపై స్పందించిన పృథ్వీ షా సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. ఈ సందర్భంగా తన లిస్ట్ ఎ క్రికెట్ ఘణాంకాలను వెల్లడిస్తూ ఓ పోస్ట్ పెట్టాడు. ఇప్పుడు ఈ పోస్ట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.

ఈ సందర్భంగా... "దేవుడా చెప్పు.. నేను ఇంకా ఎన్ని పరుగులు చేయాలి?" అంటు మొదలుపెట్టిన పృథ్వీ షా... లిస్ట్ ఎ క్రికెట్ లో 65 ఇన్నింగ్స్ లో 55.7 యావరేజ్ తో 126 స్ట్రైక్ రేట్ తో 3,399 పరుగులు చేసినట్లు తెలిపాడు. అయినప్పటికీ.. తనను ఎంపిక చేయడానికి ఈ గణాంకాలు సరిపోవు.. కానీ నేను మీపై (దేవుడిపై) నమ్మకం ఉంచుతాను అని రాసుకొచ్చాడు.

ఇదే సమయంలో... తాను దేవునిపై విశ్వాసాన్ని ఉంచుతాను.. ప్రజలు ఇప్పటికీ తనపై నమ్మకం ఉంచుతారని ఆశిస్తున్నాను.. ఎందుకంటే తాను తప్పకుండా తిరిగి వస్తాను అని రాస్తూ... "ఓం సాయిరాం" అంటూ ముగించాడు షా. ఇప్పుడు ఈ పోస్ట్ ఆసక్తిగా మారింది.

Tags:    
  • Indiancricketteam 
  • India 
  • Batsman 
  • Mumbaisquad 
  • Prithvishaw 
  • VijayHazareTrophy 
  • Instagramstory 
  • Viralpost 
  • Socialmedia 

Similar News

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని ఆటగాడు మృతి!

2026-11-04 05:07 GMT

ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని రిక్వెస్టులా? 2027 వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

2026-11-03 08:21 GMT

ముంబై గొంతెమ్మ కోరికలు.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ కు కేకేఆర్ బ్రేక్

2026-11-02 18:26 GMT

ఒక నవ్వు.. ఎంబాపే కొంప మునిగింది.. చైనా నుంచి గట్టి షాక్ తగిలింది..

2026-11-02 13:54 GMT

ముంబై ఇండియన్స్ తో హార్దిక్ పాండ్యా రాజీ.. కానీ ఒక కండీషన్.. తెలుగోడికి అన్యాయం?

2026-10-30 22:30 GMT

మ్యాచ్ మధ్యలో క్రికెటర్ తల్లిపై కామెంట్.. ఏం మనుషులురా మీరు.. ఇదేం దౌర్భాగ్యం

2026-10-30 07:20 GMT

రొనాల్డోను వెనక్కి నెట్టిన గిల్.. గిల్‌కు గ్లోబల్ బ్రాండ్ గుర్తింపు!

2026-10-30 04:01 GMT

ముంబై ఇండియన్స్ కొట్టే జట్టు ఐపీఎల్ లో పుట్టలేదిక..

2026-10-29 15:30 GMT

నువ్వు 12 బంతుల్లో 50 కొట్టలేదు.. కానీ.. అభిషేక్ శర్మపై యువరాజ్ సింగ్ ఆసక్తికర ట్వీట్..

2026-10-27 12:38 GMT

Copyright @2026

Powered by Blink CMS