• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Sports >  భారత ఆటగాళ్లతో స్నేహం...

భారత ఆటగాళ్లతో స్నేహం చేయొద్దు..పాక్ మాజీ కెప్టెన్ తీవ్ర వ్యాఖ్యలు

| మరోవైపు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మోయిన్ ఖాన్ స్పందించాడు. భారత ఆటగాళ్లతో మైదానంలో స్నేహంగా ఉండడం సరికాదని వ్యాఖ్యానించాడు.

By - Tupaki Desk
Update: 2025-01-31 10:13 GMT

మైదానం బయట ఉద్రిక్తతలు సరే.. ఒకప్పుడు భారత్–పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఆటగాళ్ల మధ్య ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తుతాయోనని అనిపించేది. వేలాది టికెట్లు గంటల్లో అమ్ముడుపోవడం.. కోట్లాది రూపాయిల ప్రకటనలు రావడం.. వేల కోట్ల మంది టీవీలకు అతుక్కుపోవడం సరేసరి.. ఓ దశలో ఆటగాళ్ల మధ్య కూడా శత్రుత్వం ఉందా? అనే విధంగా భారత్ పాక్ మ్యాచ్ లు జరిగేవి. తాజాగా మరోసారి రెండు జట్లూ తలపడనున్నాయి. దీనికి కారణంగా చాంపియన్స్ ట్రోఫీ.

ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ జరగనున్న సంగతి తెలిసిందే. భద్రతా కారణాల రీత్యా భారత్ మ్యాచ్ లకు దుబాయ్ ఆతిథ్యం ఇస్తోంది. తమ దేశానికి భారత జట్టు రావాల్సిందేనని పాకిస్థాన్ పట్టుబట్టింది. చివరకు టోర్నీనే రద్దయ్యే పరిస్థితి వచ్చేసరికి దిగొచ్చింది.

వన్డే ఫార్మాట్ లో జరగనున్న చాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాక్ సహా 8 జట్లు ఆడనున్నాయి. టీమ్ ఇండియా ఉన్న గ్రూప్ లోనే పాక్ కూడా ఉంది. ఈ రెండు జట్ల మధ్య ఫిబ్రవరి 23న మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ల ఆసక్తికర సన్నివేశాలతో కూడిన వీడియో ట్రైలర్ విడుదలైంది. మరోవైపు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మోయిన్ ఖాన్ స్పందించాడు. భారత ఆటగాళ్లతో మైదానంలో స్నేహంగా ఉండడం సరికాదని వ్యాఖ్యానించాడు. పాక్ క్రికెటర్లు వారితో స్నేహం చేయొద్దని హెచ్చరించాడు. మైదానంలో పోటీపడేలా ఉండాలని.. తద్వారా గెలవాలనే పట్టుదల వస్తుందన్నాడు. గౌరవించడం మంచిదే కానీ, ప్రొఫెషనలిజం కట్టుబాట్లను దాటొద్దన్నాడు.

గతంలో రెండు జట్ల మధ్య మ్యాచ్ లు అత్యంత తీవ్రతతో సాగేవి. ఇప్పుడు మాత్రం భారత క్రికెటర్లు క్రీజ్‌లోకి వచ్చినప్పుడు పాక్ ఆటగాళ్లు బ్యాట్లను చూడడం, వారి భుజాలను తట్టడం చేస్తున్నారని.. ఇదేమిటో తనకు అర్థం కావడం లేదని మోయిన్ ఖాన్ వ్యాఖ్యానించాడు. ఇండియాతో మ్యాచ్ అంటే ఎలాంటి మినహాయింపులు ఇవ్వొద్దని తమ సీనియర్లు చెప్పేవారన్నాడు. కనీసం మాట్లాడటం కూడా చేయొద్దని సూచించారన్నాడు. స్నేహాన్ని చివరకు బలహీనత అనుకొనే ప్రమాదం ఉంటుందన్నాడు.

మైదానంలోనే కాదు.. బయట కూడా ఫ్రొఫెషనల్స్‌ కు కొన్ని పరిమితులు ఉంటాయని మోయిన్ ఖాన్ తెలిపాడు. వాటిని తప్పక పాటించాలన్నాడు. తమ ఆటగాళ్లకు ఇది అర్థం కావడం లేదని వాపోయాడు. స్నేహంగా ఉండడం వల్ల మైదానంలో అనవసర ఒత్తిడి తెచ్చుకున్నట్లు అవుతుందని పేర్కొన్నాడు.

Tags:    
  • ChampionsTrophy 
  • IndiaVsPakistan 
  • MoinKhan 
  • CricketRivalry 
  • IndiaPakistanMatch 
  • Sportsmanship 
  • CricketFever 
  • Pakistancricket 
  • Teamindia 

Similar News

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని ఆటగాడు మృతి!

2026-11-04 05:07 GMT

ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని రిక్వెస్టులా? 2027 వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

2026-11-03 08:21 GMT

ముంబై గొంతెమ్మ కోరికలు.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ కు కేకేఆర్ బ్రేక్

2026-11-02 18:26 GMT

ఒక నవ్వు.. ఎంబాపే కొంప మునిగింది.. చైనా నుంచి గట్టి షాక్ తగిలింది..

2026-11-02 13:54 GMT

ముంబై ఇండియన్స్ తో హార్దిక్ పాండ్యా రాజీ.. కానీ ఒక కండీషన్.. తెలుగోడికి అన్యాయం?

2026-10-30 22:30 GMT

మ్యాచ్ మధ్యలో క్రికెటర్ తల్లిపై కామెంట్.. ఏం మనుషులురా మీరు.. ఇదేం దౌర్భాగ్యం

2026-10-30 07:20 GMT

రొనాల్డోను వెనక్కి నెట్టిన గిల్.. గిల్‌కు గ్లోబల్ బ్రాండ్ గుర్తింపు!

2026-10-30 04:01 GMT

ముంబై ఇండియన్స్ కొట్టే జట్టు ఐపీఎల్ లో పుట్టలేదిక..

2026-10-29 15:30 GMT

నువ్వు 12 బంతుల్లో 50 కొట్టలేదు.. కానీ.. అభిషేక్ శర్మపై యువరాజ్ సింగ్ ఆసక్తికర ట్వీట్..

2026-10-27 12:38 GMT

Copyright @2026

Powered by Blink CMS