యుద్ధం వేళ.. పాకిస్థాన్ క్రికెట్ లీగ్ నుంచి ఐపీఎల్ లోకి ఓ క్రికెటర్

కాగా, ఈ సీజన్ కు ఆస్ట్రేలియా విధ్వంసక ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ ను తీసుకుంది పంజాబ్. కానీ, అతడు ఘోరంగా విఫలం కావడంతో గాయం కారణంగా సాగనంపింది.;

Update: 2025-05-05 01:30 GMT

ఓవైపు భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.. పెహల్గా ఉగ్ర దాడి నేపథ్యంలో ఏ క్షణమైనా భారత్ తమ మీద ప్రతీకారం తీర్చుకుంటుందని పాకిస్థాన్ వణికిపోతోంది. సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చిన ప్రధాని మోదీ భారత త్రివిధ దళాధిపతులతో సమావేశం అయ్యారు. ఇక కార్యాచరణ ఎప్పుడనేదే మిగిలింది. అటు పాకిస్థాన్ కూడా యుద్ధం జరిగితే తామేం చేయాలో అని చూసుకుంటోంది.

భారత్ లో ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) జరుగుతోంది. పది జట్లు పోటీపడుతున్న ఈ లీగ్ లో ప్లేఆఫ్స్ నకు వెళ్లేవి ఏవో దాదాపు తేలిపోయింది. ఏమైనా అద్భుతం జరిగితే తప్ప వీటిలో మార్పు లేనట్లే.

కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆధ్వర్యంలో ఈసారి లీగ్ లో పంజాబ్ కింగ్స్ మంచి జోష్ మీద కనిపిస్తోంది. 10 మ్యాచ్ లలో ఆరు గెలిచి, ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో 13 పాయింట్లతో ఉంది. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. కాగా, ఈ సీజన్ కు ఆస్ట్రేలియా విధ్వంసక ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ ను తీసుకుంది పంజాబ్. కానీ, అతడు ఘోరంగా విఫలం కావడంతో గాయం కారణంగా సాగనంపింది. మరి మ్యాక్స్ వెల్ స్థానంలో ఎవరు అంటే?

ఎవరీ ఒవెన్?

మ్యాక్స్ వెల్ ప్లేస్ లో పంజాబ్ కింగ్స్ ఆస్ట్రేలియాకే చెందిన మిచెల్ ఒవెన్ ను తీసుకుంది. రూ.3 కోట్ల ధరతో పంజాబ్ కు ఆడనున్న ఒవెన్ ప్రస్తతుం పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో పెషావర్ జాల్మీ తరఫున ఆడనున్నాడు. మే 18తో ఈ టోర్నీ ముగియనుంది. ఆ తర్వాత పంజాబ్ గనుక ప్లేఆఫ్స్ చేరితే జట్టుతో కలుస్తాడు. అయితే, పెహల్గాం దాడికి ప్రతీకారంగా అప్పటికి భారత్ గనుక పాకిస్థాన్ పై యుద్ధం మొదలుపెడితే..?

Tags:    

Similar News