టీ20 వరల్డ్ కప్ జరుగుతున్నట్లు ట్రంప్ కు ఇప్పుడే తెలిసిందట

నోటికి వచ్చినట్లుగా మాట్లాడే విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎలా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.;

Update: 2026-02-09 11:30 GMT

నోటికి వచ్చినట్లుగా మాట్లాడే విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎలా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ క్రీడారంగంలో ఫుట్ బాల్.. టెన్నిస్.. అథ్లెటిక్స్ కు ఉండే ఆదరణ క్రికెట్ కు ఉండదు. ఇప్పుడిప్పుడే క్రికెట్ వైపు పలు దేశాలు చూస్తున్న పరిస్థితి. తాజాగా టీ20 వరల్డ్ కప్ జరుగుతున్న వేళ.. ట్రంప్ పంపిన ఒక మెసేజ్ ఇప్పుడు వైరల్ గా మారింది. తనకు ఇప్పుడే క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీ భారతదేశంలో జరుగుతుందని తెలిసిందని.. ఈ టోర్నీలో పాల్గొంటున్న అమెరికా జట్టుకు బెస్టాఫ్ లక్ చెబుతూ ఒక మెసేజ్ పంపారు.

టీమ్ యూఎస్ మెరుగైన ప్రదర్శన చేయాలన్న ట్రంప్.. ‘‘మనది బలమైన జట్టు. మీరు విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అంటూ మెసేజ్ చేశారు. టీ20 ప్రపంచకప్ లో తమ దేశ జట్టు పాల్గొంటున్న విషయం ట్రంప్ లాంటి అధినేతకు తప్పనిసరిగా తెలియాలనుకోవటం తప్పే అవుతుంది. కాకుంటే.. టోర్నీ మొదలై.. తమ జట్టు ఓటమిపాలైందన్న విషయాన్ని పట్టించుకోకుండా.. తాను చెప్పాలనుకున్నది చెప్పేసిన తీరు చూస్తే.. క్రికెట్ లవ్వర్స్ కు ఒళ్లు మండక మానదు.

టీ20 ప్రపంచకప్ టోర్నీలో భాగంగా శనివారం రాత్రి టీమిండియా - యూఎస్ జట్ల మధ్య మ్యాచ్ జరగటం.. ఆ మ్యాచ్ లో అతిథ్య భారత జట్టు శుభారాంభాన్ని చేయటం తెలిసిందే. అమెరికా జట్టును పసికూనలుగా భావించినప్పటికీ.. ఆటలో అదరగొట్టిన వైనం.. కష్టంగా గెలుపు బాట పట్టటం తెలిసిందే. మొత్తంగా చూస్తే.. ఈ మ్యాచ్ లో అమెరికా జట్టు టీమిండియా సభ్యులకు ఒక దశలో చెమటలు పట్టించారని చెప్పాలి. ఇక.. అమెరికా జట్టులో సగం కంటే ఎక్కువ మంది భారతీయులు.. భారత మూలాలున్న అమెరికన్లు కావటం విశేషం.

Tags:    

Similar News