• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Sports >  కొహ్లీని ఊరిస్తున్న...

కొహ్లీని ఊరిస్తున్న మాస్టర్ రికార్డ్... ఈ టోర్న మెంట్ లో అయిపోద్దా?

| ఇందులో భాగంగా సచిన్ 463 మ్యాచ్ లలో 49 సెంచరీలు చేయగా... విరాట్ కొహ్లీ కేవలం 285 మ్యాచ్ లలోనే 48 శతకాలు బాదాడు.

By - Tupaki Desk
Update: 2023-10-20 05:32 GMT

వన్డే ప్రపంచకప్‌ లో టీం ఇండియాకు ఎదురులేకుండాపోయింది. నాలుగో విజయం సాధించిన భారత్‌.. సెమీస్‌ దిశగా మరో అడుగు ముందుకేసింది. ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్ లను వరుసగా ఓడించిన భారత్... తాజాగా జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ లో విరాట్ కొహ్లీ దుమ్ముదులిపాడు. 97 బంతుల్లో 103 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 6 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. బుమ్రా, సిరాజ్‌, జడేజా లు చెరో రెండేసి వికెట్లూ తీసుకోగా... శార్దూల్‌, కుల్‌ దీప్‌ చెరో వికెట్ తీసుకున్నారు. అనంతరం 257 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన భారత్ మొదటి నుంచీ దూకుడు ప్రదర్శించింది. రోహిత్‌ (48), గిల్‌ (53) బలమైన పునాది వేశారు. అనంతరం కొహ్లీ (103*), శ్రేయస్‌ 19, రాహుల్‌ (34*) పని పూర్తి చేశారు.

ఇలా లక్ష్యఛేదనలో 41.3 ఓవర్‌ కు కోహ్లీ సిక్స్‌ బాది సెంచరీ పూర్తి చేసి భారత్‌ కు విజయాన్ని అందించాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 48వ సెంచరీ కాగా.. ప్రపంచకప్‌ లో మూడోది. ఇక, వరల్డ్ కప్‌ ఛేజింగ్ లో ఇదే మొదటి సెంచరీ. ఈ సమయంలో కొహ్లీ ముందు ఒక అద్భుతమైన రికార్డ్ ఉంది. ఇంకో రెండు సెంచరీలతో అది సాధ్యమవుతుంది!

అవును... వన్ డే క్రికెట్ లో భారత్ క్రికెట్ దిగ్గజం సచిన్ పే రిట 49 సెంచరీలు ఉన్నాయి. ఇప్పుడు కొహ్లీ సెంచరీల సంఖ్య 48. అంటే... కొహ్లీ మరో సెంచరీ చేస్తే సచిన్ తో సమం అవుతాడు.. మరో రెండు సెంచరీలు చేస్తే సచిన్ ని అధిగమించి ప్రపంచంలోనే బెస్ట్ బ్యాట్స్ మెన్ గా చరిత్రకెక్కుతాడు.

ఇందులో భాగంగా సచిన్ 463 మ్యాచ్ లలో 49 సెంచరీలు చేయగా... విరాట్ కొహ్లీ కేవలం 285 మ్యాచ్ లలోనే 48 శతకాలు బాదాడు. మరి సచిన్ పేరున ఉన్న రికార్డును కొహ్లీ ఈ వరల్డ్ కప్ లొనే అధిగమించేస్తాడా.. లేక, మరింత కాలం వెయిట్ చేయిస్తాడా అన్నది వేచి చూడాలి.

మరోపక్క ఈ ఇన్నింగ్స్‌ తో ఇంటర్నేషనల్ క్రికెట్‌ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానానికి చేరాడు కొహ్లీ. శ్రీలంక మాజీ క్రికెటర్ మహేల జయవర్ధనెను అధిగమించడం ద్వారా కోహ్లీ ఈ స్థానానికి చేరుకున్నాడు.

ఈ జాబితాలో... సచిన్ టెండుల్కర్ (34,357 పరుగులు), కుమార సంగక్కర (28,016 పరుగులు), రికీ పాంటింగ్ (27,483 పరుగులు) మొదటి మూడు స్థానాల్లో ఉండగా... తాజాగా నాలుగోస్థానంలో కోహ్లీ (26,026 పరుగులు) వచ్చి చేరాడు. దీంతో మహేలా జయవర్ధనె (25,957 పరుగులు) ఐదో స్థానంలో ఉన్నారు.

Tags:    
  • ICCWorldcup2023 
  • ICCWorldcup 
  • India 
  • Afghanistan 
  • Australia 
  • Pakistan 
  • Bangladesh 
  • Viratkohli 
  • Rohitsharma 
  • Subhamgill 
  • Sreyasiyer 
  • Klrahul 
  • Bumrah 
  • Siraj 
  • Jadeja 
  • Sachin 
  • Mahelajayawardene 

Similar News

శాండ్ పేపర్ వివాదం.. ఆస్ట్రేలియా క్రికెట్ లో మంటపెట్టిన ఉస్మాన్ ఖవాజా

2026-11-07 08:22 GMT

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని ఆటగాడు మృతి!

2026-11-04 05:07 GMT

ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని రిక్వెస్టులా? 2027 వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

2026-11-03 08:21 GMT

ముంబై గొంతెమ్మ కోరికలు.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ కు కేకేఆర్ బ్రేక్

2026-11-02 18:26 GMT

ఒక నవ్వు.. ఎంబాపే కొంప మునిగింది.. చైనా నుంచి గట్టి షాక్ తగిలింది..

2026-11-02 13:54 GMT

ముంబై ఇండియన్స్ తో హార్దిక్ పాండ్యా రాజీ.. కానీ ఒక కండీషన్.. తెలుగోడికి అన్యాయం?

2026-10-30 22:30 GMT

మ్యాచ్ మధ్యలో క్రికెటర్ తల్లిపై కామెంట్.. ఏం మనుషులురా మీరు.. ఇదేం దౌర్భాగ్యం

2026-10-30 07:20 GMT

Copyright @2026

Powered by Blink CMS