• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Sports >  ఐపీఎల్-18.. వచ్చాడు.. మహా...

ఐపీఎల్-18.. వచ్చాడు.. మహా దంచుడు దంచాడు.. ఇక టీమ్ ఇండియాలోకే

| 90 ఏళ్ల భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ట్రిపుల్ సెంచరీలు సాధించినది ఇద్దరే ఇద్దరు.

By - Tupaki Desk
Update: 2025-04-14 04:21 GMT

90 ఏళ్ల భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ట్రిపుల్ సెంచరీలు సాధించినది ఇద్దరే ఇద్దరు. ఒకరు మెరుపు వీరుడు వీరేంద్ర సెహ్వాగ్. సహజంగా మిడిలార్డర్ బ్యాట్స్ మన్ అయినప్పటికీ ఓపెనింగ్ కు పంపడంతో సెహ్వాగ్ రాత మారిపోయింది. పాకిస్థాన్ లో పాకిస్థాన్ పై, భారత్ లో ఇంగ్లండ్ పై ట్రిపుల్ సెంచరీలు కొట్టి భారత క్రికెట్ లో మొనగాడుగా నిలిచాడు.

అయితే, మిడిలార్డర్ లో దిగి ట్రిపుల్ సెంచరీ కొట్టిన మరో క్రికెటర్ కూడా ఉన్నాడు. అయితే, అతడి కెరీర్ ఏమంత గొప్పగా సాగలేదు. ట్రిపుల్ తర్వాత వైఫల్యాలు ఎదురవడంతో టీమ్ ఇండియా తలుపులు మూసుకున్నాయి. ఆరు టెస్టులు ఆడిన అతడు 374 పరుగులు చేస్తే అందులో 303 పరుగులు ట్రిపుల్ సెంచరీ చేసినప్పటివే. ఇదంతా కర్ణాటక బ్యాట్స్ మన్ కరుణ్ నాయర్ గురించి.

2016 నవంబరులో మొదలైన అతడి అంతర్జాతీయ కెరీర్ 2017తో ముగిసింది. 2016లోనే ఇండియాకు రెండు వన్డేలు ఆడాడు. ఇక టెస్టులకు దూరమైన సమయానికి అతడికి 25 ఏళ్లే. మళ్లీ దేశానికి ఆడలేదు. ఇక కెరీర్ కనుమరుగు అయిపోయింది అనుకుంటుండగా.. 2024-25 దేశవాళీ సీజన్ లో కరుణ్ తన సత్తా ఏమిటో చూపాడు. సొంత రాష్ట్రం కర్ణాటకను వదలి విదర్భకు ఆడడం ద్వారా వెలుగులోకి వచ్చాడు. సెంచరీల మీద సెంచరీలు కొట్టాడు.

రంజీల్లో ఏకంగా 9 సెంచరీలు, విజయ్ హజారే ట్రోఫీలో ఐదు సెంచరీలు బాదాడు. ఇంత ఆడినా టీమ్ ఇండియాలోకి అతడిని తీసుకోలేదు. చాంపియన్స్ ట్రోఫీకి కూడా ఎంపిక చేయలేదు. దీనిపై విమర్శలు కూడా వచ్చాయి. విసిగిపోయాడో ఏమో.. ’’మిస్టర్ క్రికెట్ నాకో చాన్స్ ఇవ్వు’’ అంటూ ట్వీట్ చేశాడు.

ఇక ప్రస్తుత విషయానికి వస్తే ఐపీఎల్ 18లో ఢిల్లీ క్యాపిటల్స్ కరుణ్ ను తీసుకుంది. అయితే, అతడి రేటెంతో తెలుసా? కేవలం రూ.50 లక్షలు. మరోవైపు సీజన్ లో నాలుగు మ్యాచ్ లు ముగిసినా కరుణ్ కు మాత్రం ఢిల్లీ అవకాశం ఇవ్వలేదు. ఆదివారం ముంబైతో మ్యాచ్ లో మాత్రం ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలో దింపింది.

ఎన్నాళ్లుగానో కసి పెంచుకున్నాడో ఏమో..? ఐపీఎల్ 18లో బరిలో దిగుతూనే కరుణ్ కుమ్మేశాడు. మేటి పేసర్ బుమ్రాను సైతం బాదేశాడు. అతడి ఓవర్ లో 22 పరుగులు కొట్టాడు. ఇక 40 బంతుల్లే 5 సిక్స్ లు, 12 ఫోర్లతో 89 పరుగులు చేశాడు. సెంచరీ ఖాయం.. ఢిల్లీని గెలిపించడం ఖాయం అనుకుంటుండగా శాంట్నర్ వేసిన అద్భుత బంతికి ఔటయ్యాడు.

ఈ మ్యాచ్ లో కరుణ్ సూపర్ బ్యాటింగ్ ను చూశాక అందరూ అన్న మాట ఒక్కటే. ఇంత అద్భుతంగా, అలవకోగా ఆడుతున్న అతడిని టీమ్ ఇండియాకు ఎంపిక చేయాలని. కామెంటేటర్లు కూడా ఇదే మాట అన్నారు. వచ్చే ఇంగ్లండ్ టూర్ కు కరుణ్ ను తీసుకెళ్లాలని.

Tags:    
  • Karunnair 
  • Delhicapitals 
  • Mumbaiindians 
  • Teamindia 
  • IPL2025 
  • IPL18 
  • BCCI 
  • Cricketnews 
  • Sports 
  • Latestnews 

Similar News

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని ఆటగాడు మృతి!

2026-11-04 05:07 GMT

ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని రిక్వెస్టులా? 2027 వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

2026-11-03 08:21 GMT

ముంబై గొంతెమ్మ కోరికలు.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ కు కేకేఆర్ బ్రేక్

2026-11-02 18:26 GMT

ఒక నవ్వు.. ఎంబాపే కొంప మునిగింది.. చైనా నుంచి గట్టి షాక్ తగిలింది..

2026-11-02 13:54 GMT

ముంబై ఇండియన్స్ తో హార్దిక్ పాండ్యా రాజీ.. కానీ ఒక కండీషన్.. తెలుగోడికి అన్యాయం?

2026-10-30 22:30 GMT

మ్యాచ్ మధ్యలో క్రికెటర్ తల్లిపై కామెంట్.. ఏం మనుషులురా మీరు.. ఇదేం దౌర్భాగ్యం

2026-10-30 07:20 GMT

రొనాల్డోను వెనక్కి నెట్టిన గిల్.. గిల్‌కు గ్లోబల్ బ్రాండ్ గుర్తింపు!

2026-10-30 04:01 GMT

ముంబై ఇండియన్స్ కొట్టే జట్టు ఐపీఎల్ లో పుట్టలేదిక..

2026-10-29 15:30 GMT

నువ్వు 12 బంతుల్లో 50 కొట్టలేదు.. కానీ.. అభిషేక్ శర్మపై యువరాజ్ సింగ్ ఆసక్తికర ట్వీట్..

2026-10-27 12:38 GMT

Copyright @2026

Powered by Blink CMS