• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Sports >  జీవితంలో ఆంధ్రా జట్టుకు...

జీవితంలో ఆంధ్రా జట్టుకు ఆడను... విహారీ ఇష్యూ ఏమిటి?

| అవును... చాలా రంగాలతో పాటు క్రికెట్ లోనూ రాజకీయ జోక్యం పెరిగిపోయిందంటూ వస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చేలాంటి సంఘటన ఒకటి తాజాగా తెరపైకి వచ్చింది.

By - Tupaki Desk
Update: 2024-02-27 05:34 GMT

భారతదేశంలో క్రికెట్ ఆట గురించి, దానికున్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సమయంలో క్రికెట్ బోర్డుల్లో రాజకీయ నేతల జోక్యంపై కూడా నిత్యం ఏదో ఒక మూల విమర్శలు వినిపిస్తుంటాయి. ఇందులో ఉన్నతమైన బోర్డు, చిన్న బోర్డు అనే తారతమ్యాలేమీ ఉండవు అని కూడా పలువురు సీనియర్లు చెబుతుంటారు! ఈ క్రమంలో తాజాగా స్టార్ క్రికెటర్ హనుమ విహారీ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు! ప్రస్తుతం ఇతడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

అవును... చాలా రంగాలతో పాటు క్రికెట్ లోనూ రాజకీయ జోక్యం పెరిగిపోయిందంటూ వస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చేలాంటి సంఘటన ఒకటి తాజాగా తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా ప్రముఖ క్రికెటర్ హనుమ విహారీ ఏపీ క్రికెట్ అసోసియేషన్ లో రాజకీయ నేతల పాత్ర పెరిగిపోయిందన్నట్లుగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు క్రీడా రంగంలోనూ తీవ్ర చర్చ నీయాంశం అవుతున్నాయి.

వివరాళ్లోకి వెళ్తే... ఏడేళ్లుగా విహారీ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న ఆంధ్రా రంజీ జట్టు ఇటీవల మధ్యప్రదేశ్ చేతిలో కేవలం 4 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో ఒక మ్యాచ్ లో ఏపీ టీం లోని 17వ ఆటగాడిని కెప్టెన్ విహారీ మందలించాడంట. దీంతో అలిగిన ఆ ఆటగాడు ఈ విషయం తన తండ్రికి చెప్పాడంట. ఆయన ఒక కార్పొరేటర్ గా ఉన్నారని తెలుస్తుంది. ఈ సమయంలో ఆయన ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) కు ఫిర్యాదు చేశారంట.

దీంతో ఈ విషయంపై ఏసీఏ సీరియస్ గా స్పందించడం.. అందులో భాగంగా విహారీని కెప్టెన్ గా తొలగించడం.. ఆ స్థానంలో మరో కెప్టెన్ ను నియమించడం చకచకా జరిగిపోయాయంట. దీంతో ఈ విషయాన్ని, తన ఆవేదనను మధ్యప్రదేశ్ తో మ్యాచ్ ఓటమి అనంతరం విహారీ ఇన్ స్టా వేదికగా పంచుకున్నాడు. రాజకీయ నాయకుల జోక్యం వల్ల తాను కెప్టెన్సీ కోల్పోయినట్లు తెలిపాడు.

ఇందులో భాగంగా... బెంగాళ్ తో జరిగిన మ్యాచ్ లో తానే కెప్టెన్ గా ఉన్నాను అని చెప్పిన విహారీ... అప్పుడు ఆ టీం నిర్ధేశించిన 410 లక్ష్యాన్ని పోరాడి చేదించామని తెలిపాడు. అలా గత సీజన్ లో ఫైనల్ కు చేరిన బెంగాల్ జట్టును తాము మొదటి మ్యాచ్ లోనే ఓడించినా కూడా.. తనను కెప్టెన్సీకి రాజీనామా చేయాల్సిందిగా ఏసీఏ ఆదేశించింది. తన తప్పేమీ లేకపోయినా ఈ శిక్ష పడిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం అని పేర్కొన్నాడు. ఇకపై ఆంధ్రా జట్టుకు ఆడబోనని ప్రకటించారు!

మరోపక్క... హనుమ విహారిని కెప్టెన్‌ గా తొలగించిన అనంతరం.. (ఫిర్యాదు చేసిన వ్యక్తి మినహా) జట్టులోని 15 మంది సభ్యులూ ఏసీఏ పెద్దలకు ఒక లేఖ రాశారు. ఇందులో భాగంగా... విహారినే కెప్టెన్‌ గా కొనసాగించాలని కోరారు. వారిలో విహారి తర్వాత కెప్టెన్‌ గా నియమితుడైన రికీభుయ్‌ కూడా ఉండటం గమనార్హం. ఈ క్రమంలో... విహారి అభ్యంతరకర పదజాలంతో దూషించినట్టు తమ సహచర సభ్యుడొకరు ఫిర్యాదు చేశారు కానీ... విహారి దురుసుగా దూసుకొచ్చాడన్నది నిజం కాదు అని వారు పేర్కొన్నారు.

కాగా... ఈ సీజన్‌ లో 13 ఇన్నింగ్స్‌ ల్లో విహారి 522 పరుగులు చేశారు. రికీభుయ్‌ తర్వాత జట్టులో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా ఉన్నాడు. ఇదే సమయంలో ఆంధ్రా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌ అడిన అతికొద్ది మంది క్రీడాకారుల్లో విహారి కూడా ఒకరు కాగా... భారత్‌ తరఫున 16 టెస్ట్‌ మ్యాచ్‌ లు ఆడి, 839 పరుగులు చేసిన విహారీ... వెస్టిండీస్‌ పై సెంచరీ చేశారు!

Tags:    
  • India 
  • Cricketteam 
  • Andhracricketassociation 
  • Hanumavihari 
  • Politicians 
  • Testmatches 
  • Westindies 

Similar News

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని ఆటగాడు మృతి!

2026-11-04 05:07 GMT

ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని రిక్వెస్టులా? 2027 వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

2026-11-03 08:21 GMT

ముంబై గొంతెమ్మ కోరికలు.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ కు కేకేఆర్ బ్రేక్

2026-11-02 18:26 GMT

ఒక నవ్వు.. ఎంబాపే కొంప మునిగింది.. చైనా నుంచి గట్టి షాక్ తగిలింది..

2026-11-02 13:54 GMT

ముంబై ఇండియన్స్ తో హార్దిక్ పాండ్యా రాజీ.. కానీ ఒక కండీషన్.. తెలుగోడికి అన్యాయం?

2026-10-30 22:30 GMT

మ్యాచ్ మధ్యలో క్రికెటర్ తల్లిపై కామెంట్.. ఏం మనుషులురా మీరు.. ఇదేం దౌర్భాగ్యం

2026-10-30 07:20 GMT

రొనాల్డోను వెనక్కి నెట్టిన గిల్.. గిల్‌కు గ్లోబల్ బ్రాండ్ గుర్తింపు!

2026-10-30 04:01 GMT

ముంబై ఇండియన్స్ కొట్టే జట్టు ఐపీఎల్ లో పుట్టలేదిక..

2026-10-29 15:30 GMT

Copyright @2026

Powered by Blink CMS