• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Sports >  చరిత్రలో తొలిసారి.....

చరిత్రలో తొలిసారి.. ఐపీఎల్ నిరవధిక వాయిదా

| భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఐపీఎల్ నిరవధిక వాయిదాకు దారితీశాయి.

By - Tupaki Desk
Update: 2025-05-09 07:50 GMT

2008లో మొదలైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు ద్వితీయ విఘ్నం ఎదురైంది. అంటే.. 2009లో భారత్ లో సాధారణ ఎన్నికలు వచ్చాయి. ఈ నేపథ్యంలో లీగ్ ను దక్షిణాఫ్రికాకు మార్చారు. ఇక దీనికిముందే 2008 నవంబరు 26న పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత ఆర్థిక రాజధాని ముంబైపై భయంకర దాడులు చేశారు. దీంతో ఆనాటి నుంచి పాకిస్థాన్ ఆటగాళ్లకు ఐపీఎల్ లో చాన్స్ లేకుండా పోయింది.

13వ సీజన్ వచ్చేప్పటికీ 2020లో ఐపీఎల్ కు కొవిడ్ సమస్య ఎదురైంది. మహమ్మారి కారణంగా లీగ్ ను అప్పుడు వాయిదా వేసి సెప్టెంబరులో దుబాయ్ లో నిర్వహించారు.

అయితే, దక్షిణాఫ్రికాలో జరిగినా, దుబాయ్ లో జరిగినా 17 సీజన్లలో ఎన్నడూ ఐపీఎల్ మాత్రం ఆగలేదు. కానీ, చరిత్రలో తొలిసారి భారత్ లో జరుగుతుండగా లీగ్ వాయిదా పడింది.

భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఐపీఎల్ నిరవధిక వాయిదాకు దారితీశాయి. అత్యంత ఆసక్తికరంగా సాగుతూ వస్తున్న 18వ సీజన్లో కొత్త చాంపియన్ ను చూస్తామా? అన్న అభిప్రాయం వినిపిస్తోంది. అలాంటిది యుద్ధ ప్రభావంతో లీగ్ ఆగిపోయింది.

ఫైనల్, ప్లేఆఫ్స్ కలిపి ఐపీఎల్ లో 74 మ్యాచ్ లు జరగాల్సి ఉంది. గురువారం ధర్మశాలలో రద్దయిన పంజాబ్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ సహా 58 మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఇంకా 16 మ్యాచ్ లు జరగాల్సి ఉంది. అయితే, యుద్ధం తీవ్రం అయ్యే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో లీగ్ ను నిరవధికంగా వాయిదా వేయడమే ఉత్తమం అని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.

Tags:    
  • IPL2025 
  • BCCI 
  • IndiaPakistanTension 
  • CricketNews 
  • IPLPostponed 
  • NationalSecurityFirst 
  • RCB 
  • DharamsalaMatch 
  • IndiaDefense 
  • OperationSindoor 
  • IPLNews 
  • IndiaStrikePOK 
  • Indiamissileattack 
  • IndiaPakistanWar 

Similar News

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని ఆటగాడు మృతి!

2026-11-04 05:07 GMT

ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని రిక్వెస్టులా? 2027 వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

2026-11-03 08:21 GMT

ముంబై గొంతెమ్మ కోరికలు.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ కు కేకేఆర్ బ్రేక్

2026-11-02 18:26 GMT

ఒక నవ్వు.. ఎంబాపే కొంప మునిగింది.. చైనా నుంచి గట్టి షాక్ తగిలింది..

2026-11-02 13:54 GMT

ముంబై ఇండియన్స్ తో హార్దిక్ పాండ్యా రాజీ.. కానీ ఒక కండీషన్.. తెలుగోడికి అన్యాయం?

2026-10-30 22:30 GMT

మ్యాచ్ మధ్యలో క్రికెటర్ తల్లిపై కామెంట్.. ఏం మనుషులురా మీరు.. ఇదేం దౌర్భాగ్యం

2026-10-30 07:20 GMT

రొనాల్డోను వెనక్కి నెట్టిన గిల్.. గిల్‌కు గ్లోబల్ బ్రాండ్ గుర్తింపు!

2026-10-30 04:01 GMT

ముంబై ఇండియన్స్ కొట్టే జట్టు ఐపీఎల్ లో పుట్టలేదిక..

2026-10-29 15:30 GMT

Copyright @2026

Powered by Blink CMS