• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Sports >  ఏడడుగులు వేసి విడాకులు...

ఏడడుగులు వేసి విడాకులు తీసుకున్న ఏడుగురు ప్రముఖ క్రికెటర్లు వీరే

| భారత క్రికెట్ లో ఇప్పుడు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా విడాకుల విషయం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం.

By - Tupaki Desk
Update: 2024-05-26 14:30 GMT

భారత క్రికెట్ లో ఇప్పుడు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా విడాకుల విషయం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం. ఎంతో కష్టపడి పైకి వచ్చిన పాండ్య.. ఎంతో ఇష్టపడి నటాషాను వివాహమాడాడు. పెళ్లికి ముందే వీరికి ఓ కుమారుడు కూడా పుట్టాడు. అయితే, ఐదేళ్లు తిరగకుండానే వీరు విడిపోతున్నారు. భారత క్రికెట్ లో ఇంత తొందరగా విడిపోయిన జంట వీరేనేమో? ఇలాంటి వారు ఇంకా ఎవరున్నారో చూస్తే..


టెన్నిస్-క్రికెట్ లవ్

భారత్ లో టెన్నిస్ కు మారుపేరుగా నిలిచిన సానియా మీర్జాకు తొలుత ప్రముఖ బేకరీ కరాచీ బేకరీ సంస్థ యజమాని కుమారుడితో వివాహం కుదిరింది. కానీ, అది రద్దయి.. సానియా చివరకు పాకిస్థాన్ క్రికెట్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ ను వివాహమాడింది. 2010లో వీరిద్దరూ ఒక్కటయ్యారు. పదేళ్లుపైగా కలిసున్న అనంతరం నిరుడు విడిపోయారు.


పెళ్లయిన మహిళను పెళ్లాడిన ధావన్

టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ 2012లో ఆయేషా ముఖర్జీని పెళ్లాడాడు. అప్పటికే ఆయేషాకు పెళ్లయి భర్తతో విడిపోయింది. వీరు కూడా పదేళ్లు కలిసున్నారు. 2021లో విడిపోయారు. నిరుడు ధావన్ తన కుమారుడిని చూడనీయడం లేదంటూ ఆయేషాపై తీవ్ర విమర్శలు చేశాడు.


సహచర క్రికెటర్ చేతిలో మోసపోయిన కార్తీక్

టీమిండియా, ఐపీఎల్ లో ఫినిషర్ గా పేరు తెచ్చుకున్న వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ చాలా చిన్న వయసులోనే.. 23 ఏళ్లకే నికితా వంజారాను పెళ్లాడాడు. కానీ, నికితా ఆ తర్వాత తమిళనాడుకే చెందిన కార్తీక్ సహచర క్రికెటర్ మురళీ విజయ్ తో ఎఫైర్ పెట్టుకుంది. కార్తీక్ తో 2012లో విడిపోయింది. అనంతరం కార్తీక్ స్వ్కాష్ ప్లేయర్ దీపికా పల్లికల్ ను పెళ్లి చేసుకున్నాడు


టీమిండియా మాజీ కెప్టెన్.. హైదరాబాదీ

టీమిండియాకు సుదీర్ఘ కాలం కెప్టెన్ గా వ్యవహరించిన హైదరాబాదీ మొహమ్మద్ అజహరుద్దీన్ హైదరాబాద్ కే చెందిన నౌరీన్ ను కెరీర్ తొలినాళ్లలోనే పెళ్లాడాడు. కానీ, 1996లో వీరు విడిపోయారు. అజహర్ బాలీవుడ్ నటి సంగీతా బిజ్ లానీని పెళ్లాడాడు. ఆ తర్వాత వీరు కూడా విడిపోయారు.


సచిన్ స్నేహితుడు..

సచిన్ తెందూల్కర్ తో పాటే గొప్ప క్రికెటర్ కావాల్సిన వినోద్ కాంబ్లీ కెరీర్ అర్థంతరంగా ముగిసింది. ఇతడు నోయెల్లా లూయీస్ ను వివాహం చేసుకున్నాడు. కానీ, 2005లో విడిపోయాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ తన గర్ల్ ఫ్రెండ్ కైలీ బోల్డీతో 2020లో తెగదెంపులు చేసుకున్నాడు.


Tags:    
  • Saniamirza 
  • Shoaibmalik 
  • Shikhardhawan 
  • Ayeshamukerji 
  • Dineshkarthik 
  • Nikithavanzara 
  • Azharuddin 
  • Vindokambley 
  • Hardikpandya 

Similar News

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని ఆటగాడు మృతి!

2026-11-04 05:07 GMT

ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని రిక్వెస్టులా? 2027 వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

2026-11-03 08:21 GMT

ముంబై గొంతెమ్మ కోరికలు.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ కు కేకేఆర్ బ్రేక్

2026-11-02 18:26 GMT

ఒక నవ్వు.. ఎంబాపే కొంప మునిగింది.. చైనా నుంచి గట్టి షాక్ తగిలింది..

2026-11-02 13:54 GMT

ముంబై ఇండియన్స్ తో హార్దిక్ పాండ్యా రాజీ.. కానీ ఒక కండీషన్.. తెలుగోడికి అన్యాయం?

2026-10-30 22:30 GMT

మ్యాచ్ మధ్యలో క్రికెటర్ తల్లిపై కామెంట్.. ఏం మనుషులురా మీరు.. ఇదేం దౌర్భాగ్యం

2026-10-30 07:20 GMT

రొనాల్డోను వెనక్కి నెట్టిన గిల్.. గిల్‌కు గ్లోబల్ బ్రాండ్ గుర్తింపు!

2026-10-30 04:01 GMT

ముంబై ఇండియన్స్ కొట్టే జట్టు ఐపీఎల్ లో పుట్టలేదిక..

2026-10-29 15:30 GMT

నువ్వు 12 బంతుల్లో 50 కొట్టలేదు.. కానీ.. అభిషేక్ శర్మపై యువరాజ్ సింగ్ ఆసక్తికర ట్వీట్..

2026-10-27 12:38 GMT

Copyright @2026

Powered by Blink CMS