• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Sports >  బీసీసీఐ ఫొటో: టీమ్ ఇండియా...

బీసీసీఐ ఫొటో: టీమ్ ఇండియా శిబిరంలో క్రికెటర్ ను పోలిన క్రికెటర్

| భారత సీనియర్ జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. బుధవారం నుంచి రెండో టెస్టును ఆడనుంది.

By - Tupaki Desk
Update: 2025-07-01 23:30 GMT

క్రికెట్ విధాన నిర్ణయాలు మాత్రమే కాదు.. క్రికెట్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు.. ఆటగాళ్లు గాయాల నుంచి కోలుకోవడం.. ప్రాక్టీస్ విశేషాలు.. విజయోత్సవ సంబరాలు.. ప్రత్యేకతలు, రికార్డులు.. ఇలా అన్నీ పంచుకుంటూ ఉంటుంది బోర్డు. ప్రపంచంలోనే ధనిక బోర్డు అయిన బీసీసీఐ ఇప్పుడు ఎంత చెబితే మిగతా దేశాలకు అంత. అలాంటి బీసీసీఐ తాజాగా ఓ ఫన్నీ ఫొటో షేర్ చేసింది. అందులో ఉన్న ఇద్దరు క్రికెటర్లు ఒకేలా ఉండడం దీని ప్రత్యేకత.

భారత సీనియర్ జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. బుధవారం నుంచి రెండో టెస్టును ఆడనుంది. తొలి టెస్టులో ఓటమి నేపథ్యంలో టీమ్ ఇండియాకు ఇది చాలా కీలకమైన మ్యాచ్. ఈ నేపథ్యంలో ముమ్మరంగా ప్రీక్టీస్ చేస్తోంది. కెప్టెన్ శుబ్ మన్ గిల్ ప్రత్యేకంగా ఓ స్పిన్ బౌలర్ ను తీసుకొచ్చారు. అతడి పేరు హర్ ప్రీత్ బ్రార్. ఇతడు ఎవరో కాదు పంజాబ్ కింగ్స్ తరఫున ఐపీఎల్ లో మెరుగైన ప్రదర్శన చేసిన ఎడమచేతి వాటం స్పిన్నర్. బహుశా వైవిధ్యమైన బౌలింగ్ స్టయిల్ ను పరీక్షించేందుకే గిల్.. తన రాష్ట్రానికే చెందిన బ్రార్ ను పిలిపించాడు అనుకోవాలి.

బర్మింగ్ హామ్ లోని ఎడ్జ్ బాస్టన్ లో రెండో టెస్టు బుధవారం నుంచి జరగనుండగా.. ట్రయినింగ్ సెషన్ లో ముఖ కవళికలు ఒకేలా ఉన్న ఇద్దరు ఆటగాళ్లు కనిపించారు. ఆ ఇద్దరిలో ఒకరు హర్ ప్రీత్ బ్రార్ కాగా.. మరొకరు జగ్జీత్ సింగ్ సంధు. ఈ జగ్జీత్ సింగ్ ఎవరో తెలియదు కానీ, బహుశా ఇంగ్లండ్ లో స్థిరపడిన సిక్కు కుటుంబానికి చెందినవాడు అయి ఉంటాడు. ప్రాక్టీస్ సెషన్ లో బ్యాట్స్ మెన్ కు బంతులు వేసేందుకు ఇతడిని పిలిచి ఉంటారని భావించవచ్చు. మరోవైపు బుధవారం నాటి మ్యాచ్ లో టీమ్ ఇండియా తరఫున పేస్ బౌలర్ అర్షదీప్ సింగ్ అరంగేట్రం చేసే చాన్సుంది. బీసీసీఐ షేర్ చేసిన ఫొటోలో అతడు కూడా ఉంటే ముగ్గురూ ఒకేలా కనిపించేవారు.

Tags:    
  • BCCI 
  • TeamIndia 
  • ShubmanGill 
  • HarpreetBrar 
  • INDvsENG 
  • EdgbastonTest 
  • CricketBuzz 
  • FunnyCricketMoment 
  • JagjeetSingh 
  • IndianCricket 

Similar News

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని ఆటగాడు మృతి!

2026-11-04 05:07 GMT

ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని రిక్వెస్టులా? 2027 వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

2026-11-03 08:21 GMT

ముంబై గొంతెమ్మ కోరికలు.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ కు కేకేఆర్ బ్రేక్

2026-11-02 18:26 GMT

ఒక నవ్వు.. ఎంబాపే కొంప మునిగింది.. చైనా నుంచి గట్టి షాక్ తగిలింది..

2026-11-02 13:54 GMT

ముంబై ఇండియన్స్ తో హార్దిక్ పాండ్యా రాజీ.. కానీ ఒక కండీషన్.. తెలుగోడికి అన్యాయం?

2026-10-30 22:30 GMT

మ్యాచ్ మధ్యలో క్రికెటర్ తల్లిపై కామెంట్.. ఏం మనుషులురా మీరు.. ఇదేం దౌర్భాగ్యం

2026-10-30 07:20 GMT

రొనాల్డోను వెనక్కి నెట్టిన గిల్.. గిల్‌కు గ్లోబల్ బ్రాండ్ గుర్తింపు!

2026-10-30 04:01 GMT

ముంబై ఇండియన్స్ కొట్టే జట్టు ఐపీఎల్ లో పుట్టలేదిక..

2026-10-29 15:30 GMT

నువ్వు 12 బంతుల్లో 50 కొట్టలేదు.. కానీ.. అభిషేక్ శర్మపై యువరాజ్ సింగ్ ఆసక్తికర ట్వీట్..

2026-10-27 12:38 GMT

Copyright @2026

Powered by Blink CMS