రోజుకు 6.5 కోట్లు.. ఏడాదికి 2356 కోట్లు..ఆస్తి కాదు..ఆటగాడి ఆదాయం

పోర్చుగల్ ఫుట్ బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో బాగా సంపాదించే క్రీడాకారుల జాబితాలో టాప్ లో నిలిచాడు.;

Update: 2025-05-19 04:04 GMT

మన సమాజంలో సగటు ధనిక వ్యక్తి ఆస్తి ఎంత ఉంటుంది.. ఓ ఐదారు కోట్లు ఉండొచ్చు.. సంపన్నుడైతే వందకోట్లు ఉండొచ్చు.. ఆపైన కూడా ఆస్తి ఉంటే కుబేరుడు అని అంటాం.ఇక ఎంత గొప్ప ఆటగాడయినా సంపాదన ఎంత ఉంటుంది..? ఏడాది మహా అయితే రూ.50 కోట్లు..లేదా రూ.100 కోట్లు..

కానీ, ఈ ప్లేయర్ ఒక్క ఏడాది ఆదాయమే రూ.2,356 కోట్లు. అంటే రోజుకు రూ.6.5 కోట్లు. దీన్నిబట్టే చెప్పొచ్చు అతడు మామూలు ఆటగాడు కాదని..ఎవరి వివాహానికైనా మనం బైక్ పై వెళ్తాం.. లేదంటే కారుంటే కారులో వెళ్తాం.. కానీ, అతడు ప్రత్యేక విమానంలో వెళ్తాడు.. చెప్పాలంటే ఉదయం ఒక దేశంలో బ్రేక్ ఫాస్ట్.. లంచ్ మరో దేశంలో.. డిన్నర్ ఇంకో దేశంలో చేస్తాడు. ఔను.. అతగాడి సంపాదనే ఏడాదికి రూ.2,356 కోట్లు.

భారతదేశంలో స్పోర్ట్స్ సూపర్ స్టార్ ఎవరంటే విరాట్ కోహ్లి అని చెబుతాం. అయితే, అతడి మొత్తం ఆస్తి రూ.వెయ్యి కోట్లు ఉంటుందేమో? లేదంటే ఓ 2 వేల కోట్లు అనుకోవచ్చేమో? కానీ.. క్రికెట్ లో కోహ్లిలాగానే ఫుట్ బాల్ లో సూపర్ స్టార్ అయిన అతగాడి ఏడాది ఆర్జనే రూ.2 వేల కోట్లకుపైమాటే. ఇదంతా అతడు కెరీర్ పీక్స్ లో ఉండగా ఏమీ కాదు. దాదాపు ముగింపునకు వచ్చిన సమయంలో కావడం గమనార్హం.

పోర్చుగల్ ఫుట్ బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో బాగా సంపాదించే క్రీడాకారుల జాబితాలో టాప్ లో నిలిచాడు. అతడి గత 12 నెలల ఆర్జన ఏకంగా రూ.2,356 కోట్లు అంటే నోరెళ్లబెట్టాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా సంపన్నుల లెక్కలు తేల్చే ఫోర్బ్స్ మేగజీన్ ఈ ఏడాది అత్యధికంగా ఆర్జించిన స్పోర్ట్స్ పర్సన్ల వివరాలు వెల్లడించింది. దీంట్లో 38 ఏళ్ల రొనాల్డో టాప్ లో నిలిచాడు. ఫోర్బ్స్ లిస్ట్ లో వరుసగా మూడో ఏడాది కూడా రొనాల్డోనే టాపర్ కావడం విశేషం.

మరి మన భారతీయులు..??

బాగా ఆర్జించే క్రీడాకారుల్లో రొనాల్డో తర్వాత ఉన్నాడు బాస్కెట్‌ బాల్‌ ఆటగాడు స్టీఫెన్‌ కర్రీ. అయితే, ఇతడి సంపాదన రొనాల్డో కంటే మూడొంతులు తక్కువ (రూ.1333 కోట్లు) కావడం గమనార్హం.

ఆ తర్వాత మూడో స్థానంలో బాక్సర్‌ టైసన్‌ ప్యూరి (రూ.1248 కోట్లు) నిలిచాడు. ఫుట్‌ బాలర్లు ప్రెస్‌ కాట్‌ (రూ.1,172 కోట్లు), అర్జెంటీనా దిగ్గజ లయెనల్‌ మెస్సీ (రూ.1,155 కోట్లు) వరుసగా నాలుగు, ఐదో స్థానాల్లో ఉన్నారు. అయితే, బాగా ఆర్జించే ఆటగాళ్ల టాప్‌-50 జాబితాలో భారత ఆటగాళ్లు ఎవరూ లేకపోవడం గమనార్హం.

కాగా, రొనాల్డోను దాదాపు మూడేళ్ల కిందట జరిగిన ప్రపంచ కప్ మధ్యలో జట్టు నుంచి తప్పించారు. అతడు వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచ కప్ ఆడతాడో లేదో చెప్పలేం.

Tags:    

Similar News