• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Sports >  భారత్ లోని సొంతగడ్డపై...

భారత్ లోని సొంతగడ్డపై న్యూజిలాండ్ క్రికెటర్ సెంచరీ

| ఇదేంటి..? భారత్ లోని సొంతగడ్డపై న్యూజిలాండ్ క్రికెటర్ సెంచరీ చేయడం ఏమిటి..? సొంతగడ్డ అంటే న్యూజిలాండ్ అవుతుంది కదా..?

By - Tupaki Desk
Update: 2024-10-18 09:42 GMT

ఇదేంటి..? భారత్ లోని సొంతగడ్డపై న్యూజిలాండ్ క్రికెటర్ సెంచరీ చేయడం ఏమిటి..? సొంతగడ్డ అంటే న్యూజిలాండ్ అవుతుంది కదా..? అనుకునేరు.. మీరు చదివింది కరెక్టే. భారత్ లోని ‘సొంతగడ్డ’పైనే అతడు సెంచరీ కొట్టాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ భారత దేశంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా బెంగళూరులో తొలి టెస్టు జరుగుతోంది. ఈ మ్యాచ్ లోనే పైన చెప్పిన సందర్భం ఎదురైంది.

అప్పుడు ప్రపంచ కప్ లో..

నిరుడు ఇదే సమయంలో జరిగిన వన్డే ప్రపంచ కప్ లో న్యూజిలాండ్ యువ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర చెలరేగిన సంగతి తెలిసిందే. వాస్తవానికి స్పిన్నర్ అయిన రవీంద్రను న్యూజిలాండ్ ఆ విధంగానే చూసింది. కానీ, జట్టు అవసరాల రీత్యా రవీంద్ర బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకు వచ్చాడు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దుమ్మురేపాడు. ఇప్పుడు తొలి టెస్టులోనూ తనదైన ముద్ర చాటాడు. ప్రధాన బ్యాట్స్ మన్ కేన్ విలియమ్సన్ దూరం కావడంతో నాలుగో స్థానంలో బ్యాటింగ్ దిగిన రచిన్ ఏకంగా సెంచరీ (157 బంతుల్లో 134, 13 ఫోర్లు, 4 సిక్స్ లు) బాదాడు. దీంతో న్యూజిలాండ్ 402 పరుగులు చేసింది. దీంతో భారత్ పై 356 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది.

సొంతగడ్డపైన..

రచిన్ రవీంద్ర పూర్వీకులది బెంగళూరు. ఇప్పటికీ అతడి నానమ్మ, తాతయ్య ఇక్కడే ఉంటారు. గత ఏడాది ప్రపంచ కప్ సందర్భంగా మ్యాచ్ కు కూడా వీరు హాజరయ్యారు. తాజాగా టెస్టు మ్యాచ్ కూ రచిన్ బంధువులు వచ్చినట్లు కనిపించింది. అందుకే భారత్ లోని సొంతగడ్డపై న్యూజిలాండ్ క్రికెటర్ సెంచరీ అని చెప్పాల్సి వచ్చింది. కాగా, భారత్ పై ఏకంగా 356 పరుగుల ఆధిక్యం రావడానికి ప్రధాన కారణం రచిన్ రవీంద్రనే. అతడి సూపర్ ఇన్నింగ్స్ తో ఇప్పుడు న్యూజిలాండ్ భారత్ లో భారత్ ను ఓడించే స్థితికి చేరింది.

Tags:    
  • Rachinravindra 
  • Newzealandcricketer 
  • Rachinravindracentury 
  • Bengaluru 
  • Cricket 
  • Indianewzealandmatch 

Similar News

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని ఆటగాడు మృతి!

2026-11-04 05:07 GMT

ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని రిక్వెస్టులా? 2027 వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

2026-11-03 08:21 GMT

ముంబై గొంతెమ్మ కోరికలు.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ కు కేకేఆర్ బ్రేక్

2026-11-02 18:26 GMT

ఒక నవ్వు.. ఎంబాపే కొంప మునిగింది.. చైనా నుంచి గట్టి షాక్ తగిలింది..

2026-11-02 13:54 GMT

ముంబై ఇండియన్స్ తో హార్దిక్ పాండ్యా రాజీ.. కానీ ఒక కండీషన్.. తెలుగోడికి అన్యాయం?

2026-10-30 22:30 GMT

మ్యాచ్ మధ్యలో క్రికెటర్ తల్లిపై కామెంట్.. ఏం మనుషులురా మీరు.. ఇదేం దౌర్భాగ్యం

2026-10-30 07:20 GMT

రొనాల్డోను వెనక్కి నెట్టిన గిల్.. గిల్‌కు గ్లోబల్ బ్రాండ్ గుర్తింపు!

2026-10-30 04:01 GMT

ముంబై ఇండియన్స్ కొట్టే జట్టు ఐపీఎల్ లో పుట్టలేదిక..

2026-10-29 15:30 GMT

నువ్వు 12 బంతుల్లో 50 కొట్టలేదు.. కానీ.. అభిషేక్ శర్మపై యువరాజ్ సింగ్ ఆసక్తికర ట్వీట్..

2026-10-27 12:38 GMT

Copyright @2026

Powered by Blink CMS