• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Sports >  కోహ్లి సేనకు పాకిస్థాన్...

కోహ్లి సేనకు పాకిస్థాన్ ఫిట్టింగ్

By - Tupaki Desk
Update: 2015-08-02 11:25 GMT
రెండు నెలల కిందట బంగ్లాదేశ్ చేతిలో పాకిస్థాన్ మూడు వన్డేల సిరీస్ లో చిత్తుగా ఓడింది. అప్పడు మన ఇండియన్ ఫ్యాన్స్ పాకిస్థాన్ ను చూసి జాలి పడ్డారు. కానీ పాక్ ను చిత్తు చేసిన బంగ్లా.. ఆ తర్వాత టీమ్ ఇండియాను కూడా మట్టికరిపించింది. అప్పటికి కానీ మన ఫ్యాన్స్ కి అర్థం కాలేదు.. పాకిస్థాన్ పతనం కాలేదు, బంగ్లాదేశ్ ఎదిగింది అని. పాకిస్థాన్ బలమేంటో అందరికీ ఇప్పుడు తెలుస్తోంది. శ్రీలంక పర్యటనలో ఆ జట్టు విజృంభించిన తీరు చూస్తే ప్రపంచ క్రికెట్ మొత్తం విస్తుపోతోంది. అనిశ్చితికి మారుపేరైన ఆ జట్టు.. శ్రీలంకను శ్రీలంకలో టెస్టు, వన్డే, టీ20.. ఇలా మూడు ఫార్మాట్లలోనూ చిత్తు చేయడం విశేషం. గత కొన్నేళ్లలో పాకిస్థాన్ ఎప్పుడైనా పెద్ద జట్లను ఓడిస్తే అది గాలి వాటం అనేసే వాళ్లు. కానీ నెలన్నర పర్యటనలో అత్యంత నిలకడగా ఆడి శ్రీలంకకు షాకుల మీద షాకులిచ్చింది పాక్.

టెస్టు సిరీస్ లో 2-1తో, వన్డే సిరీస్ లో 3-2తో విజయం సాధించిన పాకిస్థాన్.. టీ20 సిరీస్ ను 2-0తో చేజిక్కించుకుంది. అందులోనూ చివరిదైన రెండో టీ20లో ఆ జట్టు విజయం అద్భుతం. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టు ఓ దశలో 40 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఘోర పరాజయం దిశగా సాగింది. కానీ కెప్టెన్ అఫ్రిది (22 బంతుల్లో 45), అన్వర్ అలీ (17 బంతుల్లో 46) మెరుపులతో అనూహ్య విజయం సాధించింది. మొత్తానికి లంక పర్యటనను దిగ్విజయంగా ముగించింది పాకిస్థాన్. ఇప్పుడిక సవాలు టీమ్ ఇండియా ముందుంది. పాకిస్థాన్ చేతిలో చిత్తయిన జట్టు చేతిలో కోహ్లి సేన ఓడితే మన పరువు నిలవదు. పాక్ కు దీటైన ప్రదర్శన చేయాలి. మామూలుగా అయితే లంక చేతిలో ఓడినా అభిమానులు లైట్ తీసుకుంటారేమో కానీ.. పాకిస్థాన్ గెలిచిన తీరు చూశాక మనోళ్లు ఓడితే ఒప్పుకోరు. కాబట్టి పాకిస్థాన్ కోహ్లి సేనకు పెద్ద ఫిట్టింగ్ పెట్టిందనే చెప్పాలి. మరి కోహ్లి సేన ఏం చేస్తుందో చూడాలి.
Tags:    
  • Virat Kohli 
  • Sri Lanka tour 
  • telugu NEws 

Similar News

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని ఆటగాడు మృతి!

2026-11-04 05:07 GMT

ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని రిక్వెస్టులా? 2027 వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

2026-11-03 08:21 GMT

ముంబై గొంతెమ్మ కోరికలు.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ కు కేకేఆర్ బ్రేక్

2026-11-02 18:26 GMT

ఒక నవ్వు.. ఎంబాపే కొంప మునిగింది.. చైనా నుంచి గట్టి షాక్ తగిలింది..

2026-11-02 13:54 GMT

ముంబై ఇండియన్స్ తో హార్దిక్ పాండ్యా రాజీ.. కానీ ఒక కండీషన్.. తెలుగోడికి అన్యాయం?

2026-10-30 22:30 GMT

మ్యాచ్ మధ్యలో క్రికెటర్ తల్లిపై కామెంట్.. ఏం మనుషులురా మీరు.. ఇదేం దౌర్భాగ్యం

2026-10-30 07:20 GMT

రొనాల్డోను వెనక్కి నెట్టిన గిల్.. గిల్‌కు గ్లోబల్ బ్రాండ్ గుర్తింపు!

2026-10-30 04:01 GMT

ముంబై ఇండియన్స్ కొట్టే జట్టు ఐపీఎల్ లో పుట్టలేదిక..

2026-10-29 15:30 GMT

నువ్వు 12 బంతుల్లో 50 కొట్టలేదు.. కానీ.. అభిషేక్ శర్మపై యువరాజ్ సింగ్ ఆసక్తికర ట్వీట్..

2026-10-27 12:38 GMT

Copyright @2026

Powered by Blink CMS