ఐపీఎల్ బురదను చూసి బెదురుతున్న కార్పొరేట్ సంస్థలు

Update: 2015-07-17 10:20 GMT
    ఒకప్పుడు ఐపీఎల్ అంటే తిరుగులేని పెట్టుబడి... కానీ, తాజా పరిణామాల నేపథ్యంలో బడా కార్పొరేట్ సంస్థలు ఐపీఎల్ టీంలపై పెట్టుబడికి వెనుకాడుతున్నాయి. ఆయా టీంలపై పెట్టుబడి పెట్టి ఐపీఎల్ మకిలిని తాము అంటించుకుని చెడ్డపేరు తెచ్చుకోవడం ఎందుకన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల జస్టిస్ లోధా కమిటీ రెండు ఐపీఎల్ టీంలపై మండిపడడం... వాటిని తొలగించొచ్చని బీసీసీఐకి సూచించిన నేపథ్యంలో ఈ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు టీంను కొనాలని యత్నించిన జిందాల్ సంస్థ ఇప్పుడు ఆ ఆలోచన నుంచి వెనక్కు మళ్లింది.

    ఐపీఎల్ లో రెండు జట్లను రద్దు చేయాలంటూ జస్టిస్ లోధా కమిటీ బీసీసీఐకి సిఫార్సు చేసింది. రెండేళ్ల నిషేధానికి గురయిన చెన్నై, రాజస్థాన్ ఫ్రాంచైజీలను తొలగించొచ్చని సూచించింది. దీంతో ఐపీఎల్ పైనే మచ్చ పడినట్లయింది. ఈ నేపథ్యంలోనే జిందాత్ గ్రూప్ ఐపీఎల్ లో వేలు  పెట్టరాదని నిర్ణయించుకుంది.  రాయల్ ఛాలెంజర్స్ ఫ్రాంచైజీనిక కొనాలన్న నిర్ణయాన్ని వెనక్కుతీసుకుంది. ఐపీఎల్ కు ఉన్న బురద తమ ఒంటికి రాసుకోవడం ఇష్టం లేదని ఆ గ్రూప్ స్పష్టం చేసింది.
Tags:    

Similar News