• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Sports >  సన్ రైజర్స్ కుర్రాడు...

సన్ రైజర్స్ కుర్రాడు అభి‘‘షేక్ చేసేశాడు’’.. ఒక్క సెంచరీతో అనేక రికార్డులు

| రెండో టి20లో అభిషేక్ 46 బంతుల్లోనే సెంచరీ చేసేశాడు. ఇది అతడికి రెండో అంతర్జాతీయ మ్యాచ్ మాత్రమే.

By - Tupaki Desk
Update: 2024-07-08 07:22 GMT

ఆడుతున్న రెండో అంతర్జాతీయ టి20 మ్యాచ్ లోనే సెంచరీతో.. అతి తక్కువ ఇన్నింగ్స్ ల్లో సెంచరీ కొట్టిన భారతీయుడు.. వరుసగా మూడు సిక్స్ లతో సెంచరీ కొట్టిన తొలి భారతీయుడు.. ఒకే టి20లో స్పిన్నర్ల బౌలింగ్ లో అత్యధిక పరుగులు బాదిన భారతీయుడు.. ఇవన్నీ సన్ రైజర్స్ కుర్రాడు అభిషేక్ శర్మ సాధించిన రికార్డులు. తొలి మ్యాచ్ లో శనివారం డకౌట్ అయి నిరాశపరిచినప్పటికీ రెండో మ్యాచ్ లో జింబాబ్వేను అభి‘‘షేక్ చేసేశాడు’’. ఈ ఏడాది ఐపీఎల్‌ లో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున చెలరేగిన అభిషేక్.. అందరూ ఊహించినట్లే జింబాబ్వే పర్యటనకు ఎంపికయ్యాడు. తొలి మ్యాచ్ లో షాట్ కు ప్రయత్నించి డకౌట్ అయిన అతడు ఆదివారం మాత్రం విరుచుకుపడ్డాడు. తొలుత నెమ్మదిగా ఆడినప్పటికీ.. తర్వాత సిక్సర్లతో దుమ్మురేపాడు.

46 బంతుల్లోనే సెంచరీ..

రెండో టి20లో అభిషేక్ 46 బంతుల్లోనే సెంచరీ చేసేశాడు. ఇది అతడికి రెండో అంతర్జాతీయ మ్యాచ్ మాత్రమే. అంతేకాదు.. తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత అందుకున్న భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. మరోవైపు మ్యాచ్ లో అభిషేక్ సరిగ్గా 100 పరుగులు కొట్టాడు. ఇందులో స్పిన్నర్ల నుంచి పిండుకున్నవే 65. ఇది ఓ రికార్డు. 2012లో మేటి ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ పాకిస్థాన్ స్పిన్నర్లపై అహ్మదాబాద్ లో 57 పరుగులు చేశాడు. దీనిని అభిషేక్ బద్దలు కొట్టాడు. ఇక జింబాబ్వే స్పిన్నర్ వెల్లింగ్టన్ మసకద్జ బౌలింగ్ లో హ్యాట్రిక్ సిక్స్ లతో అభిషేక్ సెంచరీని అందుకున్నాడు. ఇలా వరుసగా మూడు సిక్సులతో సెంచరీ చేసిన తొలి భారత క్రికెటర్ ఇతడే. అంతేకాదు.. యువరాజ్ సింగ్ తరహాలోనే ఎడమచేతి వాటం బ్యాటర్, బౌలర్ అయిన అభిషేక్ .. అదే యువరాజ్ సింగ్ ను విపరీతంగా ఆరాధిస్తాడు.

బ్యాట్ అతడిది కాదు..

ఇన్ని రికార్డులు బద్దలు కొట్టిన అభిషేక్ వాడిన బ్యాట్ మాత్రం అతడి కాదు. ఈ మ్యాచ్ లో అతడు వాడింది కెప్టెన్‌ శుభ్‌ మన్‌ గిల్‌ బ్యాట్. పంజాబ్ కే చెందిన ఈ ఇద్దరూ అండర్‌-12 నుంచి కలిసి ఆడుతున్నారు. ఆదివారం నాటి మ్యాచ్ లో గిల్‌ బ్యాట్‌తోనే అభిషేక్ ఆడాడు. తాను భారత జట్టుకు ఎంపికైనప్పుడు ఫస్ట్ కాల్ గిల్‌ నుంచి వచ్చిందని అభిషేక్ చెప్పాడు. ఒత్తిడి ఉన్న మ్యాచ్‌ లలో గిల్‌ ను బ్యాట్‌ అడిగి తీసుకుంటానని అభిషేక్ చెప్పాడు. తొలి మ్యాచ్ లో డకౌట్ కావడంతో.. ఆదివారం గిల్ బ్యాట్ తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. కాగా, ఐపీఎల్‌ లో కూడా గిల్ బ్యాట్ తోనే అభిషేక్ ఆడాడు.

Tags:    
  • Abhisheksharma 
  • T20Match 
  • Zimbabwe 
  • Rinkusingh 
  • Bcci 
  • Icc 
  • Subhmangill 

Similar News

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని ఆటగాడు మృతి!

2026-11-04 05:07 GMT

ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని రిక్వెస్టులా? 2027 వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

2026-11-03 08:21 GMT

ముంబై గొంతెమ్మ కోరికలు.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ కు కేకేఆర్ బ్రేక్

2026-11-02 18:26 GMT

ఒక నవ్వు.. ఎంబాపే కొంప మునిగింది.. చైనా నుంచి గట్టి షాక్ తగిలింది..

2026-11-02 13:54 GMT

ముంబై ఇండియన్స్ తో హార్దిక్ పాండ్యా రాజీ.. కానీ ఒక కండీషన్.. తెలుగోడికి అన్యాయం?

2026-10-30 22:30 GMT

మ్యాచ్ మధ్యలో క్రికెటర్ తల్లిపై కామెంట్.. ఏం మనుషులురా మీరు.. ఇదేం దౌర్భాగ్యం

2026-10-30 07:20 GMT

రొనాల్డోను వెనక్కి నెట్టిన గిల్.. గిల్‌కు గ్లోబల్ బ్రాండ్ గుర్తింపు!

2026-10-30 04:01 GMT

ముంబై ఇండియన్స్ కొట్టే జట్టు ఐపీఎల్ లో పుట్టలేదిక..

2026-10-29 15:30 GMT

నువ్వు 12 బంతుల్లో 50 కొట్టలేదు.. కానీ.. అభిషేక్ శర్మపై యువరాజ్ సింగ్ ఆసక్తికర ట్వీట్..

2026-10-27 12:38 GMT

జెర్సీ నంబర్ కోసం ఫైటింగ్.. అంతటి సెహ్వాగ్ కు తల్లి, పెళ్లాం పోరు తప్పలేదు నాయనలారా?

2026-10-26 14:39 GMT

Copyright @2026

Powered by Blink CMS