• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Real Estate >  ఈ 17 నగరాల్లో పెట్టుబడులు...

ఈ 17 నగరాల్లో పెట్టుబడులు పెడితే ఇక తిరుగులేనట్టే!

| ఈ 17 నగరాలు రియల్‌ ఎస్టేట్‌ రంగ వృద్ధికి హాట్‌ స్పాట్లుగా ఉన్నాయని తెలిపింది.

By - Tupaki Desk
Update: 2024-06-19 17:30 GMT

ప్రముఖ అంతర్జాతీయ రియల్‌ ఎస్టేట్‌ దిగ్గజ సంస్థ.. కొలియర్స్‌ సంచలన అధ్యయనాన్ని వెలువరించింది. భారతదేశంలో 17 నగరాలు రియల్‌ ఎస్టేట్‌ రంగ వృద్ధికి ఆశాకిరణాలుగా ఉన్నాయని పేర్కొంది. ఈ 17 నగరాలు రియల్‌ ఎస్టేట్‌ రంగ వృద్ధికి హాట్‌ స్పాట్లుగా ఉన్నాయని తెలిపింది. వీటిలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి తిరుపతి, విశాఖపట్నం చోటు దక్కించుకోవడం విశేషం.

అయితే దేశంలో ఈ 17 నగరాలు కేవలం రియల్‌ ఎస్టేట్‌ రంగానికే కాకుండా పలు అవకాశాల ఆధారంగా అభివృద్ధి చెందుతున్నాయని కొలియర్స్‌ వెల్లడించింది. మన దేశంలో తిరుపతి (ఆంధ్రప్రదేశ్‌), షిరిడీ (మహారాష్ట్ర), వారణాసి (ఉత్తరప్రదేశ్‌), ద్వారక (గుజరాత్‌), అయోధ్య (ఉత్తరప్రదేశ్‌), పూరి (ఒడిశా) వంటి ఆధ్యాత్మిక నగరాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని కొలియర్స్‌ తన నివేదికలో వెల్లడించింది.

మనదేశంలో ఎక్కువ మంది హిందువులు దర్శించే పుణ్యక్షేత్రాల్లో తిరుపతి, షిరిడీ, కాశీ, అయోధ్య, ద్వారక, పూరి చోటు దక్కించుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రియల్‌ ఎస్టేట్‌ రంగ అభివృద్ధికి ఈ ఆధ్యాత్మిక నగరాల్లో అవకాశాలున్నాయని కొలియర్స్‌ వెల్లడించింది.

అలాగే ఆంధ్రప్రదేశ్‌ లో అతిపెద్ద నగరమైన విశాఖపట్నం పర్యాటక రంగానికి పేరుపొందింది. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక రాజధానిగా ఈ నగరానికి పేరుంది. ఈ నేపథ్యంలో విశాఖలో స్థిరాస్థి వృద్ధికి అపార అవకాశాలున్నాయని కొలియర్స్‌ తెలిపింది.

అలాగే తమిళనాడులో రెండో అతిపెద్ద నగరంగా ఉన్న కోయంబత్తూరు, కేరళలో అతిపెద్ద నగరమైన కోచి (కొచ్చిన్‌)లోనూ రియల్‌ ఎస్టేట్‌ రంగానికి మంచి పరిస్థితులు ఉన్నాయని కొలియర్స్‌ తన నివేదికలో వెల్లడించింది.

టాప్‌ 17 నగరాల్లో అమృత్‌ సర్‌ (పంజాబ్‌), అయోధ్య (ఉత్తరప్రదేశ్‌), కోయంబత్తూర్‌ (తమిళనాడు), ద్వారక (గుజరాత్‌), ఇండోర్‌ (మధ్యప్రదేశ్‌) తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయని కొలియర్స్‌ పేర్కొంది.

దేశంలో తాము గుర్తించిన 17 నగరాల్లో ఆధ్యాత్మిక పర్యాటకం, డిజిటలైజేషన్, డేటా సెంటర్ల ఏర్పాటు, రియల్‌ ఎస్టేట్‌ రంగ వృద్ధికి అధిక అవకాశాలున్నాయని కొలియర్స్‌ తెలిపింది. ఈ నగరాల్లో హౌసింగ్, హాస్పిటాలిటీ, రిటైల్‌ రంగం, వాణిజ్య, వ్యాపార రంగాల వృద్ధికి ఆశాజనక పరిస్థితులున్నాయని పేర్కొంది. ఈ నగరాల్లో ఇప్పటికే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక మునిసిపల్‌ కార్పొరేషన్‌ మౌలిక వసతుల కల్పనకు తీసుకుంటున్న చర్యలు కలిసివస్తాయని వివరించింది.

కాగా తాము పేర్కొన్న 17 నగరాల్లో అన్ని రకాల వృద్ధికి అవకాశాలు లేవని కొలియర్స్‌ తెలిపింది. ఒక్కో నగరం.. కొన్నింటికి అనుకూలంగా ఉన్నట్టు వివరించింది. తిరుపతిలో గృహ నిర్మాణం, ఆతిథ్య రంగం, రిటైల్‌ రంగాలకు అవకాశాలున్నాయని తెలిపింది. విశాఖపట్నంలో రెసిడెన్షియల్, వేర్‌ హౌసింగ్‌ బిజినెస్, రిటైల్, డేటా సెంటర్ల ఏర్పాటు వంటి వాటికి అపార అవకాశాలున్నట్టు పేర్కొంది.

Tags:    
  • India 
  • RealEstateCompany 
  • RealEstateSector 
  • Visakhapatnam 
  • Tirupathi 
  • AndhraPradesh 
  • Shirdi 
  • Varanasi 
  • Dwarka 
  • Ayodhya 
  • Puri 
  • Kochi 

Similar News

ట్రంప్ టవర్స్‌లో షాకింగ్ పరిస్థితులు.. కోట్ల ఫ్లాట్ కొన్నా కర్టెన్లు లేవు.. లిఫ్ట్ లేదు

2026-11-02 18:26 GMT

హైదరాబాద్ రియల్ ముందుకా ? వెనక్కా ?

2026-10-12 07:30 GMT

ఆఫీస్ స్పేస్: పలు నగరాల్లో క్షీణత.. హైదరాబాద్ అందుకు భిన్నం

2026-10-11 16:47 GMT

బంగారు గనిలా మారిన ‘హైదరాబాద్ ఐటీ కారిడార్’

2026-08-29 04:48 GMT

రియల్ మంటల్లో మన భాగ్యనగరం.. మిగతా ఊర్లు చల్లబడినా... ఇక్కడ మాత్రం 'హౌస్'ఫుల్లే

2026-08-23 13:30 GMT

దేశంలోనే టాప్ 2.. రియల్ ఎస్టేట్‌లో భాగ్యనగరం దూకుడు

2026-08-18 11:30 GMT

"మేక్ కోకాపేట్ గ్రేట్ ఎగైన్!".. భాగ్యనగరంలో ట్రంప్ 65 అంతస్తుల విలాసవంతమైన సర్కస్!

2026-08-11 13:29 GMT

కోహ్లీ ఒక్క‌డే కాదు.. ముంబైని కొనేస్తున్న టాప్ -5 సెల‌బ్రిటీలు ఎవ‌రో తెలుసా?

2026-07-27 12:39 GMT

హైద‌రాబాద్‌లో 63,700 ఇళ్ల ప‌రిస్థితి? రియ‌ల్ ఎస్టేట్‌పై వార్ పంచ్!

2026-06-13 20:05 GMT

బిగ్ చేంజ్ : వైజాగ్ మీద రియల్ ఫోకస్ !

2026-06-02 03:32 GMT

అపార్ట్‌మెంట్ నిర్వహణ నియమాలు: నివాసితులకు చ‌ట్టం గురించి ఏం తెలుసు?

2026-05-31 00:30 GMT

ఎకరా రూ.237 కోట్లకు కొనేసి గౌర వెంచర్స్ బ్యాక్ గ్రౌండ్ ఇదే!

2026-05-29 04:49 GMT

Copyright @2026

Powered by Blink CMS