బిగ్ చేంజ్ : వైజాగ్ మీద రియల్ ఫోకస్ !

రియల్ ఎస్టేట్ రంగం చూపు ఏపీలో విశాఖ నగరం మీద పడుతోంది. దానికి కారణం దేశవ్యాప్తంగా టైర్ టూ సిటీల మీద రియల్టర్ల ఫోకస్ పెరగడమే అని అంటున్నారు.

Update: 2026-06-02 03:32 GMT

రియల్ ఎస్టేట్ రంగం చూపు ఏపీలో విశాఖ నగరం మీద పడుతోంది. దానికి కారణం దేశవ్యాప్తంగా టైర్ టూ సిటీల మీద రియల్టర్ల ఫోకస్ పెరగడమే అని అంటున్నారు. దేశంలో టాప్ పొజిషన్ లో ఉన్న టైర్ టూ సిటీలలో విశాఖ కూడా ఉంది అని గుర్తు చేస్తున్నారు. అలా రియల్ ఎస్టేట్ రంగం ఎంచుకున్న దేశవ్యాప్తమైన ఎనిమిది టైర్ టూ సిటీలలో విశాఖ ఒకటిగా ఉండడం విశేషం. దాంతో రానున్న కాలంలో విశాఖలో రియల్ బూమ్ ఒక బిగ్ రేంజిలో సాగుతుందని అంచనా వేస్తున్నారు.

కారణాలు ఇవేనంటూ :

దేశంలో ఎన్నో టైర్ టూ సిటీస్ ఉండగా కేవలం ఎనిమిది నగరాల మీదనే రియల్టర్ల కన్ను పడడానైకి కారణాలు ఏమిటి అన్నది చూస్తే ఇలా ఎంపిక చేసుకున్న నగరాలలో మౌలిక సదుపాయాలు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నాయి. అంతే కాదు ఆయా నగరాల మీద ప్రత్యేక శ్రద్ధతో ప్రభుత్వాలు కూడా ప్రాధాన్యత ఇస్తున్నాయి. దాంతో ఈ నగరాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇవన్నీ ఆలోచించిన మీదటనే రియల్ ఎస్టేట్ రంగం విశాఖ వంటి టైర్ టూ సిటీల మీద దృష్టి కేంద్రీకరించింది అని చెబుతున్నారు.

అందుబాటులో భూములు :

ఈ టైర్ టూ సిటీలలో భూములు పెద్ద ఎత్తున అందుబాటులో ఉండడమే కాకుండా తక్కువ ధరలకు లభిస్తున్నాయి అని చెబుతున్నారు. దాంతో ఇక్కడ పెట్టుబడులు పెడితే అధిక రాబడులు వస్తాయని కూడా భావిస్తున్నారు. సమీప భవిష్యత్తులో విశాఖ వంటి సిటీలలోనే రియల్ ఎస్టేట్ రంగం విస్తారంగా అభివృద్ధి చెందగలదన్న లెక్కలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. ఫలితంగా టాప్ మెట్రో సిటీలుగా ఉన్నముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల నుంచి రియల్ ఎస్టేట్ రంగం నెమ్మదిగా తమ పెట్టుబడులను తగ్గించుకుని టైర్ టూ సిటీల వైపు చూస్తోంది అని బిజినెస్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ఉపాధి అవకాశాల కేంద్రం :

ఇక అభివృద్ధి ఉన్న చోట ఉపాధి అవకాశాలు కచ్చితంగా ఉంటాయి. అలా ఆదాయాలను పెద్ద ఎత్తున అందుకుంటున్న వారి వల్లనే రియల్ ఎస్టేట్ రంగం మూడు పూవులు ఆరు కాయలుగా వృద్ధి చెందుతుంది. ఈ కారణాల వల్ల కూడా టైర్ టూ సిటీల మీద ఫోకస్ పెరిగింది అని అంటున్నారు. మరో వైపు చూస్తే దేశంలో మెట్రో నగరాల తరువాత వేగంగా అభివృద్ధి చెందేవి ఈ టైర్ టూ సిటీస్ అని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్మార్ట్ సిటీస్ మిషన్ అదే విధంగా అమృత్ వంటి పథకాల కింద ఈ సిటీలలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నారు. ఆలాగే నూతనంగా మెట్రో లైన్లు ఎక్స్‌ప్రెస్‌వేలు విమానాశ్రయాల నిర్మాణం వంటివి టైర్ టూ సిటీల జాతకాన్ని వాటి రూపురేఖలను సమూలంగా మార్చేస్తున్నాయని చెబుతున్నారు.

అభివృద్ధి నగరాలుగా :

ఈ రోజున చూస్తే దేశంలో ప్రగతి మార్గాన వేంగంగా ముందుకు సాగుతున్న డెవలప్మెంట్ సిటీస్లలో మధ్యప్రదేశ్ లోని ఇండోర్, అలాగే యూపీలోని లక్నో, రాజస్థాన్ లోని జైపూర్, తమిళనాడులోని కోయంబత్తూరు, మహారాష్ట్రలోని నాగ్‌పూర్, ఓడిషాలోని భువనేశ్వర్సూ గుజరాత్ లోని సూరత్‌ ఇక ఏపీలోని విశాఖపట్నం ఉన్నాయి. ఈ నగరాలు అన్నీ వేటికవే ప్రత్యేకం. అలాగే అభివృద్ధికి కూడా ఇవి కేరాఫ్ గా మారుతున్నాయి. దాంతోనే ఈ నగరాల మీద ఫోకస్ పెరిగింది. మెట్రో సిటీస్ లో అభివృద్ధి అన్నది ఇప్పటికే సంతృప్త స్థాయికి చేరిందని భావిస్తున్నారు. దాంతో ఇక మీదట ఫ్యూచర్ అంతా మెట్రో నగరాలతో పోలిస్తే ఈ టైర్ టూ సిటీస్ దే అని అంటున్నారు.

Tags:    

Similar News