హైదరాబాద్ లో చౌకగా ఇళ్ళు... బంపర్ ఆఫర్ !

హైదరాబాద్ అంటే దక్షిణ భారత దేశంలోనే అతి ముఖ్య ప్రాంతం. అక్కడ కోటి కి పైగా జనాభా ఉంది. హైదరాబాద్ లో ఉంటే చాలు అనుకునే వారే అత్యధిక శాతం ఉంటారు.;

Update: 2025-12-20 07:40 GMT

హైదరాబాద్ అంటే దక్షిణ భారత దేశంలోనే అతి ముఖ్య ప్రాంతం. అక్కడ కోటి కి పైగా జనాభా ఉంది. హైదరాబాద్ లో ఉంటే చాలు అనుకునే వారే అత్యధిక శాతం ఉంటారు. ఇక సొంత ఇళ్ళు ఎంతమందికి ఉన్నాయంటే వేరే స్టోరీ. కానీ సొంత ఇల్లు తమకు ఉండాలని సగటు మనిషికి కోరిక. అలాంటిది భాగ్యనగరంలో ఇళ్ళు అయితే అతి చౌకగా ఇస్తున్నారు. అది కూడా ఎంతో కీలకమైన ప్రాంతంలో. మరి ఎందుకు ఆలస్యం. అది అమృతం విషం అంటున్నారు. ఇంతకీ ఆ బంపర్ ఆఫర్ ఏమిటి ఏమా కధా అన్నదే ఇంట్రెస్టింగ్ పాయింట్.

మిడిల్ క్లాస్ కి అందుబాటులో :

హైదరాబాద్ లో అద్దెలు చాలా చోట్ల ఎక్కువగా ఉంటాయి. ప్రైమ్ ఏరియాలో అయితే ఇంకా బాదుడు ఉంటుంది. అలాంటిది గచ్చీ బౌలి లాంటి ప్రాంతంలో సింగిల్ బెడ్ రూంలను తక్కువ రేట్లకే అమ్మకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం గేట్లు తెరచింది. ఈ సింగిల్ బెడ్ రూం ఇళ్ళను తెలంగాణా హౌసింగ్ బోర్డు నిర్మాణం చేసింది. వీటిని ఈ వేలం ద్వారా అమ్మడానికి సిద్ధం అయింది. అయితే ఈ సింగిల్ బెడ్ రేట్లు ఇపుడు చర్చగా మారాయి. కేవలం ఇరవై ఆరు లక్షల రూపాయల నుంచి 35 లక్షల రూపాయల దాకా ఉన్నాయి. అయితే వీటి ఎస్ ఎఫ్ టీ చూస్తే కనుక 500 నుంచి 600 పై దాకా ఉన్నాయి. హాయిగా ఇద్దరు చిన్న పిల్లలతో కాపురం ఉండేవారికి ఈ ఇళ్ళు చాలా చక్కటి సదుపాయంగా ఉంటాయని అంటున్నారు.

వారి కోసమే మరి :

భాగ్యనగరంలో ఉద్యోగం చేస్తూ నెలకు ఒక యాభై వేల రూపాయల దాకా ఆదాయం తెచ్చుకున్న వారు అంతా మిడిల్ క్లాస్ గానే ఉంటారు. వీరి ఇంటి ఖర్చులు పోనూ నెలవారీ ఆదాయంలో ఎంతో కొంత మిగుల్చుని చిన్న పాటి జాగా అయిన కొనుక్కోవాలని చూస్తారు. అలాంటి వారికి ఈ ఇళ్ళు ఎంతో ఉపయోగగంగా ఉంటాయని అంటున్నారు. ఎందుకంటే ఇంటద్దకే జీతంలో పావు వంతుకు పైగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంటొంది. అది కూడా గచ్చీ బౌలీ లాంటి చోట్ల చిన్న ఇల్లు అయినా పెద్ద ఆస్తిగానే చూడాల్సి ఉందని చెబుతున్నారు. ఈ రోజున ఈ ఇళ్ళను కొనుగోలు చేసి పెట్టుకున్నా ఫ్యూచర్ లో ఈ ఇళ్ళే కోటికి పైగా పడగలెత్తే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.

యాభై వేల లోపు ఆదాయం ఉన్న వారే ఈ ఇళ్ళను పొందేందుకు అర్హులని కూడా హౌసింగ్ బోర్డు స్పష్టంగా పేర్కొంది. గచ్చిబౌలిలో ఏకంగా 111 దాకా ఈ తరహా ప్లాంట్లను విక్రయించడం జరుగుతోంది. అంతే కాదు ఇదే విధంగా వరంగల్ లో మరో వంద దాకా ఖమ్మంలో నూటా పాతిక దాకా ప్లాట్లు హౌసింగ్ బోర్డువే ఉన్నాయి. వీటిని కూడా అక్కడ మార్కెట్ ధరలను దృష్టిలో ఉంచుకుని హౌసింగ్ బోర్డు తక్కువ ధరలకే విక్రయిస్తోంది. ఇక ఖమ్మంలో అయితే సింగిల్ బెడ్ రూం చూస్తే ఏకంగా 11 లక్షలకే దొరుకొతోంది అంటే సూపర్ అనాల్సిందే. వరంగల్ లో అక్కడ ఉన్న మార్కెట్ రేటుని దృష్టిలో ఉంచూని 20 లక్షల దాకా వీటి రేటు పెట్టారు. మొత్తానికి ఈ గోల్డెన్ చాన్స్ ని మిడిల్ క్లాస్ అయితే మిస్ చేసుకోకూడదనే అంటున్నారు. ఇతర వివరాలు కావాల్సిన వారు వెబ్ సైట్ లోకి వెళ్ళి అన్నీ చూడాల్సి ఉంది.

Tags:    

Similar News