• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Real Estate >  కోకాపేటలోనే కాదు అక్కడ...

కోకాపేటలోనే కాదు అక్కడ కూడా భూముల ధరల మోత!

| తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. హైదరాబాద్‌ మెట్రో డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) పరిధిలో ప్లాట్లను వేలం వేస్తున్న సంగతి తెలిసిందే

By - Tupaki Desk
Update: 2023-08-24 07:11 GMT

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. హైదరాబాద్‌ మెట్రో డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) పరిధిలో ప్లాట్లను వేలం వేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కోకాపేటలో మొదటి విడతలో వేలం వేసిన 65 ఎకరాలతో ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరింది. ఏకంగా రూ. 2 వేల కోట్లకుపైనే ప్రభుత్వం దండుకుంది. కోకాపేటలో ఎకరం గరిష్టంగా రూ.100 కోట్లకు, కనిష్టంగా రూ.45 కోట్లు పలికిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో మరిన్ని ఆదాయ వనరులపై దృష్టి సారించిన ప్రభుత్వం ఇప్పుడు శంకరపల్లి మండలంలో మోకిలలో ప్లాట్లను అమ్ముతోంది. ఇక్కడ హెచ్‌ఎండీఏ లేఅవుట్‌ ని అభివృద్ధి చేసింది. దాదాపు 165 ఎకరాల విస్తీర్ణంలో 1,321 ప్లాట్లలతో కూడిన భారీ రెసిడెన్షియల్‌ లేఅవుట్‌ ను సిద్ధం చేసింది. ఆగస్టు మొదటి వారంలో జరిగిన అమ్మకంలో కొనుగోలుదారుల నుంచి మంచి స్పందన వచ్చింది.

ఈ నేపథ్యంలో రెండో దశలో 300 ప్లాట్లను ఆన్‌లైన్‌ వేలం ద్వారా ఆగస్టు 23 నుంచి 29 వరకు విక్రయించనుంది. మోకిలలో మొదటి ఫేజ్‌ లో మంచి డిమాండ్‌ వచ్చిన నేపథ్యంలో రెండో దశలో 300 ప్లాట్లకు ప్రీబిడ్‌ లను ఆహ్వానించింది.

ఈ క్రమంలో మోకిలలో ఆగస్టు 23 బుధవారం ఉదయం, సాయంత్రం రెండు సెషన్లలో 60 ప్లాట్లను వేలం వేయగా.. గరిష్ఠంగా చదరపు గజానికి రూ.లక్ష ధర లభించింది. 361 నంబరు ప్లాటు చదరపు గజానికి రూ.లక్ష చొప్పున 375 గజాలకు రూ.3.75 కోట్లు పలకడం విశేషం. రెండు మినహా మిగతా 58 ప్లాట్లు వేలంలో అమ్ముడుపోవడం విశేషం.

సరాసరి చదరపు గజం ధర రూ.63,512 చొప్పున వేలంలో అమ్ముడైంది. కనిష్ఠ ధర చదరపు గజానికి రూ.55 వేల వరకు పలికింది. మొత్తం 20,025 చదరపు గజాలకు గాను 19,275 చదరపు గజాలు అమ్ముడుపోయాయి. దీనిద్వారా హెచ్‌ఎండీఏకు రూ.122.42 కోట్ల ఆదాయం వచ్చింది. అప్‌సెట్‌ ధర రూ.50 కోట్లు కంటే రెండు రెట్లకు పైగా రావడంపై అధికారులు హర్షం వ్యక్తం చేశారు.

కాగా హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ఆధ్వర్యంలో ఆగస్టు మొదటి వారంలో మోకిలలో నిర్వహించిన మొదటి విడత వేలంలో ప్లాట్లు కూడా హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయాయి. 50 ప్లాట్లకు వేలం నిర్వహించగా.. చదరపు గజం గరిష్ఠంగా రూ.1.05 లక్షల వరకు ధర పలికింది. కనీస ధర రూ.72 వేలకు విక్రయించారు. ఒక్కో ప్లాట్‌ 300-500 చదరపు గజాల్లోపు ఉంది. కోకాపేట నియోపోలిస్, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్, నార్సింగిలకు సమీపంలో ఉండటంతో కొనుగోలుదారులు ఎగబడ్డారు. అప్‌సెట్‌ ధర చదరపు గజానికి రూ.25 వేలు నిర్ణయించగా.. కొన్ని మూడు, నాలుగు రెట్లు ఎక్కువ ధరకు అమ్ముడయ్యాయి. మొత్తం 50 ప్లాట్లకు రూ.40 కోట్లు ఆశించగా.. అంతకు మూడు రెట్లు అధికంగా రూ.121.40 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది.

Tags:    
  • Hyderabad 
  • Realestate 
  • Brsgovernment 
  • Kokapet 
  • Mokilaplots 
  • Hyderabadrealestate 
  • HMDA 
  • Plotsauction 

Similar News

ట్రంప్ టవర్స్‌లో షాకింగ్ పరిస్థితులు.. కోట్ల ఫ్లాట్ కొన్నా కర్టెన్లు లేవు.. లిఫ్ట్ లేదు

2026-11-02 18:26 GMT

హైదరాబాద్ రియల్ ముందుకా ? వెనక్కా ?

2026-10-12 07:30 GMT

ఆఫీస్ స్పేస్: పలు నగరాల్లో క్షీణత.. హైదరాబాద్ అందుకు భిన్నం

2026-10-11 16:47 GMT

బంగారు గనిలా మారిన ‘హైదరాబాద్ ఐటీ కారిడార్’

2026-08-29 04:48 GMT

రియల్ మంటల్లో మన భాగ్యనగరం.. మిగతా ఊర్లు చల్లబడినా... ఇక్కడ మాత్రం 'హౌస్'ఫుల్లే

2026-08-23 13:30 GMT

దేశంలోనే టాప్ 2.. రియల్ ఎస్టేట్‌లో భాగ్యనగరం దూకుడు

2026-08-18 11:30 GMT

"మేక్ కోకాపేట్ గ్రేట్ ఎగైన్!".. భాగ్యనగరంలో ట్రంప్ 65 అంతస్తుల విలాసవంతమైన సర్కస్!

2026-08-11 13:29 GMT

కోహ్లీ ఒక్క‌డే కాదు.. ముంబైని కొనేస్తున్న టాప్ -5 సెల‌బ్రిటీలు ఎవ‌రో తెలుసా?

2026-07-27 12:39 GMT

హైద‌రాబాద్‌లో 63,700 ఇళ్ల ప‌రిస్థితి? రియ‌ల్ ఎస్టేట్‌పై వార్ పంచ్!

2026-06-13 20:05 GMT

బిగ్ చేంజ్ : వైజాగ్ మీద రియల్ ఫోకస్ !

2026-06-02 03:32 GMT

అపార్ట్‌మెంట్ నిర్వహణ నియమాలు: నివాసితులకు చ‌ట్టం గురించి ఏం తెలుసు?

2026-05-31 00:30 GMT

ఎకరా రూ.237 కోట్లకు కొనేసి గౌర వెంచర్స్ బ్యాక్ గ్రౌండ్ ఇదే!

2026-05-29 04:49 GMT

Copyright @2026

Powered by Blink CMS