• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సొమ్ము కార్యకర్తలదీ.....

సొమ్ము కార్యకర్తలదీ.. సోకు వైసీపీ ఎమ్మెల్యేదా?

By - Tupaki Desk
Update: 2020-04-27 15:30 GMT
దాదాపు పదేళ్లు ప్రతిపక్షంలో అష్టకష్టాలు పడి వైసీపీని అధికారంలోకి తెచ్చారు జగన్. అధికారం ఎంతకష్టపడితే వస్తుందని ఆయనకు తెలుసు. అందుకే ఆ ప్రజలు ఇచ్చిన అధికారాన్ని వారి సంక్షేమానికే  వెచ్చిస్తూ ప్రజాసంక్షేమ పాలన తెస్తూ మరో రాజన్న రాజ్యాన్ని ఏపీలో తీసుకొస్తున్నారు. ప్రత్యర్థుల ప్రతిపక్ష మీడియా బలంగా ఉండి జగన్ ను వెనక్కి నెడుతున్నా.. వెకిలిగా అవమాన పరుస్తున్నా మొక్కవోని దీక్షతో జగన్ ముందుకు వెళుతున్నారు. జగన్ సీఎంగా ఇప్పటికీ ఎక్కువ పనిచేస్తూ తక్కువ పబ్లిసిటీ కోరుకుంటూ ప్రజలకు ఎక్కువ పాలనను చేరువ చేస్తున్నారు.

జగన్ ఇంత చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం పబ్లిసిటీ కే ప్రాధాన్యత ఇస్తుండడం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. ఇలాంటి తరుణంలో ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే మాత్రం కార్యకర్తలపై ఆర్థిక భారం మోపడం తీవ్ర చర్చనీయాంశమైంది. కరోనా టైంలో కార్యకర్తలంతా కలిసి సీఎం రిలీఫ్ ఫండ్ కు డబ్బులు విరాళాలు జమచేసి ఎమ్మెల్యేకు ఇస్తే వాటిని సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇవ్వకుండా తన పబ్లిసిటీకి వినియోగించిన తీరు నియోజకవర్గంలో దుమారం రేపింది.

తాజాగా  గిద్దలూరు ఎమ్మెల్యేకు సీఎం రిలీఫ్ ఫండ్ డబ్బులను కార్యకర్తలు ఇస్తే.. వాటిని ప్రభుత్వానికి ఇవ్వకుండా వాటిని తన పేరుతో పబ్లిసిటీకి ఖర్చు చేయడంపై కార్యకర్తలు - నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారట. ఆ డబ్బులతో రైసు బ్యాగులను తయారు చేసి పేదలకు తన పేరుతో పంచడానికి ఆ ఎమ్మెల్యే రెడీ అయ్యారట. దాని మీద ఎమ్మెల్యే పేరు తాటికాయలంత అక్షరాలతో  ముద్రించుకొని కింద డబ్బులిచ్చిన కార్యకర్తల పేర్లు చిన్నగా కింద కనిపించకుండా ముద్రించాడు. తాజాగా ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అత్త సొమ్ము అల్లుడు దానం చేసిన చందంగా ఉందని వైసీపీ నేతలు ఈ వ్యవహారాన్ని ఆడిపోసుకుంటున్నారు.ఈ ఫొటోను తీసుకొని సోషల్ మీడియాలోనూ ట్రోల్ చేస్తున్నారు.
 
 సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వాల్సిన డబ్బులను ఎమ్మెల్యే ఇలా డైవర్ట్ చేసుకొని సొంత ఇమేజ్ పెంచుకోవడం ఏంటని వైసీపీ సోషల్ మీడియా వర్గాలు ఆరోపిస్తున్నాయి. కార్యకర్తల సొమ్ము తన సొమ్ము మాదిరి పబ్లిసిటీకి ఉపయోగిస్తున్నాడని..  సీఎం జగన్ కు పబ్లిసిటీ దక్కకుండా తనకే దక్కేలా కుట్ర పన్నుతున్నాడని  వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఇలాంటి ఎమ్మెల్యే వల్ల వైసీపీకి నష్టం వస్తోందని.. కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటున్నాయని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. 


Tags:    
  • YSRCP MLAS 
  • Welfare Activities 
  • CoronaVirus 
  • Andhra 
  • andhra Politics 
  • Telugu NEws 

Similar News

జడ్పీ పీఠాలు : టీడీపీకి 22, జనసేనకు 4, బీజేపీకి 1

2026-11-20 03:36 GMT

యూత్ కి బీపీ షుగర్...ఏంటీ జనరేషన్ !

2026-11-20 03:36 GMT

బీఆర్ఎస్ కి రాజకీయ సిద్ధి...అక్కడే రేవంత్ గురి !

2026-11-20 03:35 GMT

పిచ్చికుక్క కరిచిందా.. ఎర్రగడ్డకు పంపిస్తాం.. కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి పరోక్ష పంచ్.. కాంగ్రెస్‌లో మాటల మంటలు

2026-11-19 21:30 GMT

విశాఖ నుంచి తిరుపతి వెళ్ళే భక్తులకు సూపర్ న్యూస్

2026-11-19 21:15 GMT

సీనియర్లను రంగంలోకి దించిన జనసేన

2026-11-19 21:15 GMT

ఎవరు గెలిచినా మేమే...వైసీపీ అలా తృప్తి పడుతోందా ?

2026-11-19 21:12 GMT

మంత్ర్రుల‌ను కాద‌న‌లేరు.. కార్య‌క‌ర్త‌ల‌ను వ‌ద్ద‌న‌లేరు: బాబుకు చిక్కులు

2026-11-19 21:12 GMT

పెరిగే సీట్లు వైసీపీ రాజకీయాన్ని ముంచేస్తాయా ?

2026-11-19 21:11 GMT

మలేషియా గేట్లు మూసేసింది.. భారతీయులకు ఇక వీసా కష్టాలు.. అసలు కారణమిదే..

2026-11-19 21:10 GMT

కొలువు తీరిన ఎంపీపీలు...రికార్డు స్థాయిలో పదవులు

2026-11-19 21:01 GMT

మోదీ ప్రస్తావించిన లైసెన్స్ రాజ్ అంటే ఏమిటి? ఏంటా కథ?

2026-11-19 21:00 GMT

Copyright @2026

Powered by Blink CMS