‘దిశ’ అంటే ఏమిటీ? షాకిచ్చిన ఎమ్మెల్యే?!

Update: 2021-08-02 01:30 GMT
వైసీపీ ప్రభుత్వం మహిళల భద్రత కోసం తీసుకొచ్చిన దిశ చట్టం దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యింది. ఈ చట్టం యాప్ వినియోగంపై అధికారులు వివిధ రూపాల్లో ప్రచారం కల్పిస్తున్నారు. సీఎం జగన్ ఎంతో పట్టుదలతో ఏపీలో మహిళలకు రక్షణ కల్పించేందుకు ఈ చట్టం తీసుకొచ్చాడు. ఇప్పటికే ఏపీ పోలీసులు, సీఎం జగన్ దిశ యాప్, చట్టం, పోలీస్ స్టేషన్లపై అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు.

 అయితే ఆంధ్రప్రదేశ్ తోపాటు దేశంలోనే పాపులర్ అయిన ఈ చట్టంపై సాక్ష్యాత్తూ అధికార పార్టీ ఎమ్మెల్యే 'దిశ' అంటే ఏంటి నాకు తెలియదే' అని అవగాహన సదస్సులోనే పేర్కొనడంతో అక్కడికి వచ్చిన వారు అవాక్కయ్యారు. ఇది కాస్త పెద్ద దుమారం రేపింది.

శ్రీకాకుళం జిల్లా రాజాంలో దిశ యాప్ పై పోలీస్ శాఖ శనివారం అవగాహన సదస్సు నిర్వహించింది. 'దిశ' డీఎస్పీ వాసుదేవ్.. చట్టంతోపాటు యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జోగులు మాట్లాడారు. తనకు అసలు దిశ చట్టం గురించి తెలియదన్నారు. దీంతో అక్కడున్న వారు అంతా షాక్ అయిన పరిస్థితి నెలకొంది.

ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే అయ్యిండి.. అందులోనూ అసెంబ్లీలో సీఎం జగన్ ఈ 'దిశ' చట్టంను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నప్పుడు మద్దతుగా ఆమోదించిన వ్యక్తి అయిన ఈ ఎమ్మెల్యే తనకు దిశ చట్టం అంటే ఏంటో తెలియదనడం నిజంగా సిగ్గుచేటు అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. 
Tags:    

Similar News